Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
sushasthreeyam - Raja Sulochana

ఈ సంచికలో >> శీర్షికలు >>

జాతకచక్రం (మే 04 - మే 10) - శ్రీ నంద

'గోతెలుగు.కామ్' పాఠకుల ప్రశ్నలకు శ్రీ నంద గారు సమాధానాలిస్తారు. మీ యొక్క ప్రశ్నలను(ఒక్కటి మాత్రమే) మీ పేరు, పుట్టిన తేది, సమయం, పుట్టిన ఊరు జతచేసి 'goteluguastro@gmail.com ' కి పంపగలరు. 
 


ప్ర. నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందో లేదో తెలుపగలరు - తంగెళ్ళపల్లి నరేష్ కుమార్, హుజూర్ నగర్
జ. నరేష్ కుమార్ మీరు మీ జాతకం ప్రకారం శతబిషా నక్షత్రం కుంభరాశిలో జన్మించారు. గ్రహాలు చక్కటి బలాన్ని కలిగున్నవి. దీనివలన మీరు జీవితాన్ని ప్రణాళికా ప్రకారం వెళితే ఉన్నత శిఖరాలను అందుకోవచ్చు. ప్రస్తుతం మీకు శనిమహర్దశ నడుస్థుంది. ఈ మహర్దశ మీకు 2008 నుండి 2027 వరకు ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వఉద్యోగాలకు శని, రవిలు ఇద్దరు కారణం అవుతారు. జాతకంలో వీరుకనుక అనుకూలంగా ఉంటే ఉద్యోగంలో బాగారాణింపు ఉంటుంది. మీ జాతకం పరిశీలించినపుడు కుటుంబస్థానాదిపతికి అలాగే వృత్తిస్థానధిపతికి మధ్యలో పరివర్తన యోగం ఉండటం అలాగే వారిద్దరు మీజాతకానికి యోగకారకులు కావడం అనేది సంతోషించదగ్గ విషయం. అలాగే రవి యోగాకారకుడు అయినప్పటికిని స్వల్పదోషంలో ఉండటం కొద్దిగా ఇబ్బందిని కలిగించే అంశం. ప్రస్తుతం శనిమహర్దశలో బుధ అంతర్దశ నడుస్తుంది.  ఈ దశ మీకు 2014 మధ్యవరకు ఉంది. మీరు శ్రద్దపెట్టి బాగాకృషిచేయాలి. ఖర్చులకు వాహన ప్రమాదాలకు అవకాశం కలదు.  జాగ్రత్త వహించాలి. అలాగే మీయొక్క ఆలోచనలు తగ్గించుకొనుట, చేతల్లో మీ యొక్క మాటలను చూపించే ప్రయత్నం చేయండి. మీకు ప్రభుత్వఉద్యోగావకాశాలు బాగున్నవి. కాకపోతే ఎక్కువగా కష్టపడాలి. 2014 జూన్ నుండి 2015 ఆగస్ట్ వరకు అనుకూలమైన కాలం అలాగే మీరు పోలీసు, రక్షణ రంగాలలో రాణించగలుగుతారు.  గట్టిగా ప్రయత్నం చేస్తే కాంపిటేటివ్ పరీక్షల్లో బాగా రాణించే అవకాశం ఉంది. ఆదిశగా ప్రయత్నం చేయండి. మీరు ప్రతిరోజు సూర్యనమస్కారాలు చేయుట, బుధవారం తప్పనిసరిగా విష్ణుసహస్రనామం పారాయణ చేయుట వలన మంచి ఫలితాలను పొందుతారు.
    
ప్ర. నా వివాహ సమయాన్ని గురించి తెలుపగలరు - సాయి నీల్ కిరణ్, ఎల్లందు
జ. కిరణ్ మీయొక్క జాతకాన్నిపరిశీలిస్తే మీరు కుంభరాశి, పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించారు. మీయొక్క జాతకంలో కాలసర్పయోగం ఉంది. అందుచేత మీకు వివాహం విషయంలో లేదా సంతానం విషయంలో ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. ఒకసారి శ్రీకాళహస్తిలో పూజ చేయించుకోండి. ఏది ఏమైనా ఈ సంవత్సరం మీకు వివాహం అవుతుంది. కళత్రాధిపతి వాక్కు స్థానంలో ఉండటం, ఆస్థానంలో కేతువు యొక్క ప్రభావం చేత మీరు ఒక్క మాటపైన ఉండలేరు. ముందుగా మీరు ప్రజాసంబంధాలు  పెంచుకోవాలి. అందరితోను కలివిడిగా ఉండటం మంచిది. 2013 జూన్ నుండి మీకు వివాహానికి అనుకూలమైన కాలం. అలాగే ఈ సంవత్సరం మంచిపనుల కోసం ఖర్చులు పెడుతారు. మీయొక్క ఆశలు నెరవేరుతాయి. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు, శ్రీరామరక్షాస్తోత్రం  పారాయణ చేయుట మంచిది. కోరికలను తగ్గించుకోండి. పెద్దల సూచనలు పాటించండి. 

ప్ర. నా భవిష్యత్తు ఎలా వుంటుంది మరియు నా రాశి వివరాలు తెలపకోరుతున్నాను - పార్థ సారధి
జ. పార్థసారధి మీరు జన్మతేది మాత్రమే ఇచ్చారు. సమయం, ఊరుపేరు వ్రాయలేదు. కావున న్యూమరాలజీ ప్రకారం మీకు వివారాలు తెలుపుచున్నాము. మీరు N. PARTHA SARATHI  అని కనుక వ్రాస్తే పేరులో మార్పును చేసుకోవడం మంచిది. మీరు సాత్విక స్వభావాన్ని కలిగిఉన్నప్పటికిని జీవితాన్ని అనుభవించాలి అని కోరికను కలిగి ఉంటారు. లక్ష్యాన్ని సాదించే విధానం మీకు బాగా తెలుసు. మీరు పేరులో అదనంగా చివర్లో " i "అనే అక్షరం చేర్చుకోవడం అలాగే పూర్తిపేరును వాడటం మూలాన మీ యొక్క ఆలోచనలను నేరవేర్చుకోగలుగుతారు. మీరు ప్రణాళికాప్రకారం వెళితే ప్రభుత్వరంగంలో కాని అనుబందిత రంగంలో కాని చక్కగా స్థిరపడతారు. ప్రతి గురువారం సాయిబాబా ఆలయం లేదా శివాలయం వెళ్ళండి. అలాగే గురుచరిత్ర పారాయణ  చేయండి.    

ప్ర. ఉన్నత విద్యాభ్యాసం కొరకు విదేశాలకు వెళ్ళే అవకాశం వుందా? దయచేసి తెలుపండి - వాలిన వినయ్, మండపేట
జ. వినయ్ గారు మీరు కచ్చితంగా విదేశాలలో విద్యను అభ్యసిస్తారు. అలాగే అక్కడ కొంతకాలం స్థిరపడే అవకాశం కలదు. మీది  ఉత్తరా నక్షత్రం కన్యారాశి. మీకు ఏలినాటి శనిప్రభావం చివరిలో ఉంది. శనికి జపాలు చేయించుకోవడం మేలుచేస్తుంది. నవమాధిపతి మంచిబలాన్ని కలిగి ఉండటం మీకు అనుకూలించే విషయం. ప్రస్తుతం మీకు రాహు మహర్దశ లో శని యొక్క అంతర్దశ నడుస్తుంది. మీకు నమాధిపతి శని బలంగా ఉండటం వల్ల  విదేశీప్రయాణాలు అనుకూలిస్తాయి కాకపోతే ఖర్చులు ఉంటాయి. అలాగే విదేశాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. మీకు నచ్చిన విద్యను అభ్యసించడంలో ఆటంకాలు కొన్ని ఎదుర్కొంటారు. ఈవిషయంలో నిదానంగా అలోచించి నిర్ణయాలు తీసుకోండి. 2014 మే నుంచి ఇంకా మంచికాలం. ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు విదేశాలకు వెళ్ళు అవకాశం ఉంది. 2014 లో సోదరవర్గం సహకారంతో మీయొక్క ఆలోచనలు అనుకూలిస్తాయి. దుర్గాదేవికి సోమవారాలు కుంకుమ అర్చన అలాగే శివునకు శనివారం అభిషేకాలు చేయించుకోవాలి. 
 

వార ఫలాలు (మే 04  - మే 10)


మేష రాశి
ఈరాశివారు ఈవారం ప్రారంభంలో సంతోషంగా గడుపుతారు. బంధువులను కలిసే అవకాశం కలదు. భోజనసౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు. అర్థికంగాకూడా లాభాలను పొందుటకు అవకాశం ఉంది. నూతన ఆలోచనలను చేస్తారు. ఆదిశగా ముందుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు కాని వారం మధ్యలో కొంత ఇబ్బందులను అకారణంగా ఖర్చులను పొందుతారు. మానసికంగా ఆందోళనను పొందుతారు. మొండిగా దైర్యంతో ముందుకు వెల్లడంచేత ధనంవిషయంలో లోటును పూరించుకోగాలుగుతారు. అలాగే సంతోషాన్ని పొందుతారు. వారం మొత్తంకూడా కొద్దిగా భోజనంవిషయంలో సమయపాలన పాటించుట మేలుచేస్తుంది. కొద్దిపాటిఅనారోగ్యం కలుగుటకు ఆస్కారం ఉంది. తగినజాగ్రట్టలు చేపట్టండి. ప్రయాణాల్లో తగినజాగ్రత్తలు చేపట్టుట వాహనములు నడుపునప్పుడు నిదానంగా వ్యవహరించుట మేలు. ఏవైనా ఆలోచనలను తీసుకోనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మేలు. ధార్మికకార్యక్రమాల్లో పాల్గొంటారు. అందుచేత మానసిక ఆనందంను పొందుటకు అవకాశం ఉంది. కుటుంభంలో సంతోషంను పొందుతారు దేహసౌఖ్యంను కలిగిఉంటారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఈవారం మంచి ఫలితాలను పొందుటకు ప్రతిరోజు సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయుట, మంగళవారం దుర్గాదేవికి కుంకుమఅర్చన చేయుట మేలు. 

వృషభ రాశి
ఈరాశివారు ప్రారంభంలో చేపట్టినపనులను అనుకున్నసమయానికి పూర్తిచేస్తారు. బంధువులయెడల ప్రీతిని కలిగి ఉంటారు. భోజనసౌఖ్యంను పొందుతారు. ఆర్థికంగాలాభంను పొందుటకు అవకాశం కలదు. కాకపోతే వారం చివర్లో బంధుమిత్రులతో విరోదంను పొందుటకు అవకాశం కలదు. కావున నిదానంగా వ్యవహరించుట మేలు. వారంచివర్లో ఆరంభించే పనులను వీలైతే వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థికవిషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రయాణాలు చేయుట మూలాన కొంత ఇబ్బందులను పొందుటకు అవకాశం ఉంది. అనారోగ్యభయాన్ని పొందుటకు అవకాశముంది. వాహనములు నడుపునప్పుడు జాగ్రత్తలు పాటించుట మేలుచేస్తుంది. చేయువృత్తియందు చిక్కులు ఏర్పడుటకు అవకాశం ఉంది. కలహములు కలుగుటకు ఆస్కారం ఉంది. జాగ్రత్తవహించండి. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట మేలు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా సర్దుకుపోవడం ఉత్తమం. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించుట మేలు. విలువైన వస్థువులపట్ల అప్రమత్తత అవసరం. నూతన గృహనిర్మానం పైన ఇష్టాన్ని కలిగిఉంటారు. ఉత్తమ ఫలితాలను పొందుట కోసం శివారాధన, దుర్గాదేవి పూజ అలాగే ప్రతిరోజు విష్ణుసహస్రనామ పారాయణ చేయడం ఉత్తమం.    

మిథున రాశి
ఈ రాశివారికి ఉద్యోగస్థానంలో బాగుంటుంది. మీయొక్క ఆలోచనలను అధికారులు అమలుచేయుటకు అవకాశాలు కలవు. సంతోషంగా గడుపుతారు. వారంప్రారంభంలో మాములుగా ఉన్నప్పటికిని రాను రాను అభివృద్దిని పొందుతారు. ప్రయత్నకార్యములలో విజయాన్ని పొందుతారు. నూతనంగా చేపట్టిన ప్రయత్నాలు అనుకూలిస్థాయి. నూతన ప్రయత్నాలు కొనసాగించాలనుకుంటే వారంమధ్యలో ప్రారంభించుట చేత అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశాలు కలవు. భోజనం విషయంలో ప్రత్యేకమైన ఆసక్తిని చూపిస్తారు. భోజనసౌఖ్యం ఉంటుంది. కుటుంభంలోమాత్రం తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కొంచం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఆర్థికంగా లాభాలను కలిగిఉంటారు నూతనవస్థువులను కొనుటకు ఇష్టపడుతారు.కొద్దిపాటి ఖర్చులను పొందుటకు అవకాశం కలదు.ప్రయాణాలు చేయవలసి రావోచ్చును. బంధువులలో గౌరవాన్ని పొందుతారు. ఉత్సాహంను కలిగిఉండి చేపట్టిన పనులను ముందుకు తీసుకువెళ్తారు. విలువైన వస్థువులను జాగ్రత్తగా చూసుకోవడం సూచన. కలహములు కలుగుటకు అవకాశం కలదు, జాగ్రత్త. ఈ రాశివారు చక్కటి ఫలితాల కోసం లక్ష్మీఅష్టోత్తరం చదవడం, శివాలయం సందర్శనచేయుట అలాగే ప్రతిరోజు పడుకొనేముందు చంద్రునికి నమస్కారంచేయడం సూచన. 

కర్కాటక రాశి
ఈరాశివారికి ఉద్యోగంలో మాత్రం అభివృద్దిని కలిగిఉంటారు. అధికారులతో కలిసి నూతన ఆలోచనలు చేసి ఆదిశగా ముందుకు వెళ్తారు. రాజాకేయాల్లో ఉన్నవారు విజయాన్ని పొందుతారు. తము ఆశించిన ఫలితాలను పొందుటకు అవకాశంకలదు. వారం ప్రారంభంలో అనారోగ్యసమస్యలు ఇబ్బందిపెట్టుటకు అవకాశంకలదు. ముఖ్యంగా మొకాల్ల నోప్పులు భాదించుటకు అవకాశం ఉంది. జాగ్రత్తవహించుట మేలు అనారోగ్యంను మాత్రం అశ్రద్దచేయకండి. మీయొక్క మాటతీరు కుటుంభంలోని సభ్యులను భాదించేదిగా ఉండుటకు అవకాశం ఉంది. ఈకారణంచేత వివాదములు లేదా మనస్పర్థలు ఏర్పడుతాయి. వారంచివరకు కొంతసర్దుబాటు అవుతుంది. .ప్రయత్నకార్యములలో విజయాన్ని పొందుతారు.  చేపట్టిన పనులను సకాలానికి అవజేస్తారు. దానివలన తోటివారినుండి ప్రశంశలు కలుగుతాయి. మీయొక్క ఆలోచనలు కొన్నివిషయాల్లో తిరస్కరించబడుటకు అవకాశం కలదు. సర్దుకుపోవడం మంచిది. సమయానికి భోజనం తీసుకోండి. మొత్తంమీద గౌరవాన్ని పొందుతారు. చాలావరకు పనులను పూర్తిచేస్తారు. మీయొక్క వ్యతిరేకులను ఇబ్బందిపెట్టగలుగుతారు. కొద్దిగా ప్రయాణాలను ఎక్కువగా చేయుటకు అవకాశం కలదు. ఈవారం మరింత మంచిఫలితాలకోసం హనుమాన్ ఆలయం సందర్సించుట మంచిది, దుర్గాదేవిని అరాదించుట మేలు చేస్తుంది.

సింహ రాశి
ఈరాశివారికి వారం ప్రారంభంలో బాగున్న రానురాను ఇబ్బందులు ఎదురవుతాయి. కావున ఈవారం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. అన్నిరకాలుగా ఇబ్బందులను ఎదుర్కొనేఅవకాశం ఉంది. ముఖ్యంగా మీయొక్క మాటతీరు మూలాన అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్పకపోవచ్చును. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా లేనట్లయితే ధననష్టాన్ని చవిచూస్తారు. అకారణంగా కలహముల మూలన ఇబ్బందులను పొందుతారు. సౌఖ్యంనకు ప్రాముఖ్యతను ఇస్తారు. మానసిక సంతోషాలకు ప్రాధాన్యతలను ఇచ్చుటకు ఆస్కారం కలదు. అనారోగ్యం మూలాన ఇబ్బందులు తప్పవు. వేసవితాపానికి గురయ్యే అవకాశం ఉంది. బలహీనపడతారు. సరైన భోజనం చేయకపోవడం చేతసమస్యలు పెరుగుతాయి. మీయొక్క ఆలోచనలను వాయిదావేసుకోవడం చాలావరకు మేలుచేస్తుంది. ఉద్యోగంలో అధికమైన శ్రమనుపొందుతారు. ఫలితాన్ని ఆశించకుండా ముందుకు వెళ్ళడం సూచన. బంధువులతో నిదానంగా వ్యవహరించుట కొద్దిగా వారిఆలొచనలను మన్నించుట చేత మేలుజరుగుతుంది. స్త్రీలకు సంభందించిన విషయాల్లో తలదూర్చకండి. వివాదములు కలుగుతాయి. మీయొక్క తెలివితేటలను వాడుకొనే ప్రయత్నం చేయండి. తద్వార చేపట్టిన పనులను ముగించగలుగుతారు. వారంమొత్తం మీద దైవసంభంద పూజలు అధికంగా చేయుడం మూలాన మేలుజరుగుతుంది.    

కన్యా రాశి
ఈరాశివారికి తలపెట్టినపనులలో ఆర్థికంగాలాభాలను పొందుతారు. ధనలాభం ఉంటుంది. నూతన ఆలోచనలు కలిగిఉంటారు. వారం ప్రారంభంలో అనుకూలతలు కలుగుతాయి. కుటుంభజీవితంలో సౌఖ్యంను పొందుతారు. మీయొక్క ఆలోచనలు ఇతరులకు ఉపయోగపడుట మూలాన గౌరవాన్ని పొందుతారు. వారం చివర్లో అనారోగ్యసమస్యలు కలుగుతాయి. భోజనం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. శత్రువుల మూలాన ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారిమూలన కష్టములను పొందుటకు అవకాశం ఉంది. ప్రయాణాల మూలాన ఇబ్బందులను ఎదుర్కొంటారు. గతంలో మీరు తీసుకున్నఋణముల మూలాన ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు తీసుకున్ననిర్ణయాల మూలాన మాటను పడవలసి రావోచ్చును. అకారణంగా భయంను పొందుతారు. ప్రయత్నకార్యములలో విజయాన్ని పొందుతారు. మీయొక్క విజయాన్ని కోరుకొనే ఆత్మీయుల ఆలోచనలను పాటించుటకు ప్రయత్నం చేయండి. నూతన వస్త్రప్రాప్తిని పొందుటకు అవకాశం ఉంది. అకారణంగా కలహములకు అవకాశంఉంది. కావున నిదానంగా వ్యవహరించండి సంచారం చేయుట మూలాన కొంత అలసిపోవుటకు అవకాశం ఉంది. మంచి ఫలితాలను పొందుటకు శనివారం వేంకటేశ్వరస్వామి దేవాలయంనకు వెళ్ళుట, విష్ణు సహస్రనామం పారాయణచేయుట, సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయుట మేలుచేస్తుంది.   

తులా రాశి
ఈ రాశివారికి ఈవారం మిశ్రమఫలితాలను పొందుతారు. ప్రారంభంలో ఖర్చులు ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు. కుటుంభంలో వివాదములు కలుగుటకు ఆస్కారం కలదు. చేపట్టినపనులలో స్వల్ప ఆటంకాలు కలుగుటకు ఆస్కారముంది. వారం మధ్యనుంచి అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థికంగా ముందడుగు వేయగలుగుతారు, కుటుంభంలో మనస్పర్థలు తోలుగుటకు అవకాశముంది. సేవాగుణాన్ని కలిగిఉండటంచేత తోటివారిలో గౌరవాభివృద్దిని పొందుటకు అవకాశం కలదు. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు ఆస్కారం ఉంది. ఒకవార్త మీలోకొంత నిరుత్సహంను భాదను పెంచుతాయి. మానసికంగా దృడంగా ఉండే ప్రయత్నం చేయండి. అధికారుల చేత ఇబ్బందులను పొందుటకు అవకాశముంది. ఉద్యోగంలో నూతనప్రయోగాలుచేయకండి. సర్దుకుపోవడం గతంలో చేపట్టిన పనులను కొనసాగించుట మేలుచేస్తుంది. మీయొక్క కోపం మీకు ఇబ్బందులను తెచ్చుటకు అవకాశంఉంది. కావున జాగ్రత్తగా ఉండటం మేలు. విందులు వినొదముల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు. మానసికంగా మీయొక్క ఆలోచనల్లో పరిణతి లేకపోతే దుఃఖాన్ని పొందుటకు అవకాశం ఉంది. సమస్యలనుంచి తప్పించుకొనుటకు ప్రతిరోజు నవగ్రహలచుట్టు ప్రదక్షణ చేయుట మంచిది, సుందరాకాండ పారాయణ చేయుట, దుర్గాదేవిని ఆరాదించుట మేలుచేస్తుంది.

వృశ్చిక రాశి
ఈరాశివారికి ఈవారం పర్వాలేదు అన్నవిధంగా ఉంటుంది. ప్రయత్నకార్యములలో విజయాన్ని పొందుతారు. ఉత్సాహంను నూతనపనులను చేపడుతారు.  ధనధాన్యసంవృద్దిని కలిగిఉంటారు. కుటుంభంలో సౌఖ్యంను పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. బంధుమిత్రులతో మాత్రంమీకు స్వల్ప విభేదాలు కలుగుటకు ఆస్కారం కలదు. మానసికంగా కొంత ఒత్తిడిని పొందుటకు అవకాశం కలదు. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్దపనికిరాదు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలుచేస్తుంది. మీయొక్క ఆలోచనలు ఇతరులకు సేవచేయాలన్న ఉద్దేశంతో ఉంటారు. ఆ దిశగా ముందుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇతరులకు ఉపయోగాపడటం మూలన కీర్తిని పొందుటకు అవకాశంఉంది. వినొదముల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. అందరితోను సరదాగా గడుపుటకు ప్రయత్నం చేస్తారు. ఇష్టమైన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. బలమైన ఆలోచనలను కలిగిఉంటారు. కొన్నివిషయాల్లో కోపాన్ని పొందుతారు. భీతిని కలిగిఉండుటకు అవకాశంకలదు. చేపట్టిన పనుల్లావుస్రమను పొందుతారు. మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తిచేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఫలితాల కోసం శివాభిషేకం చేయుట, అన్నపూర్ణాష్టకం చదవటం, గణపతి ఆరాధన మేలుచేస్తుంది. 

ధనస్సు రాశి
ఈరాశివారికి ధనలాభాలు ఉనప్పటికిని కొద్దిగా ఇబ్బందికరమైన ఫలితాలు పొందుతారు. ధర్మసంభంద పనులకు సమయాన్ని కేతాయించుట మంచిది. చేపట్టే ప్రతిపనిలోను నిదానంగా వ్యవహరించుట మేలు. వారం ప్రారంభంలో ఉత్సాహంను కలిగిఉంటారు. భోజనసౌఖ్యంను పొందుతారు. మీయొక్క ఆలొచనలు ఖర్చులను కలిగించేవిగా ఉండటం చేత మానసికఆందోళనను పొందుతారు. బంధుమిత్రులతో మనస్పర్థలు కలుగుటకు అవకాశం కలదు కావున నిదానంగా ఉండటం మీయొక్క పనులను పూర్తిచేసే దిశగా అడుగులువేయడం సూచన. నిర్ణయాలను తీసుకోవడం తడబాటు ఉండుటకు ఆస్కారం ఉంది. కావున అనుభవజ్ఞుల సలహాలను పాటించేప్రయత్నం చేయండి. చేసే పనులలో ఆటంకాలు కలుగుతాయి .అధికమైన ప్రయత్నం అవసరం. సమయానికి భోజనంచేయలేరు. పనిఒత్తిడి ఉండుటకు అవకాశం కలదు జాగ్రత్త. అనారోగ్యం మూలాన ఇబ్బందులను ఎదుర్కొంటారు. చేసేపనులను మధ్యలో ఆపి వేయుటకు అవకాశం కలదు. కలహములకు దూరంగా ఉండటం, అధికారులతో సఖ్యతగా ఉండటం సూచన. మీయొక్క వ్యతిరేకులకు మీ బలహీనతలు ఆయుధాలు కాకుండా జాగ్రత్తపడటం మంచిది. ఫలితాలకు దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవాస్టకం చదవడం, లక్ష్మీఅభిషేకాలు మేలుచేస్తాయి.  

మకర రాశి
ఈరాశివారికి ఉద్యోగంలో అభివృద్దిని కలిగిఉంటారు. అధికారులతో గుర్తింపును పొందుతారు. మిగితా విషయాల్లో ఈవారం మిశ్రమఫలితాలు కలుగుతాయి. ఆచితూచి వ్యవహరించుట వలన నష్ట పోకుండా జాగ్రత్త పడగలరు. ప్రయత్నాల్లో ముందుకు వెళ్తారు. ధనధాన్య అభివృద్దిని పొందుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలు వాయిదావేయడం మంచిది. గతంలో చేపట్టినపనులను పూర్తిచేసేందుకు సిద్డం కావడం మేలుచేస్తుంది. మానసికంగా రెండురకాలుగా ఉంటారు. కాసేపు ఉత్సాహంగా ఉండటం అంతలోనే నిరాశను పొందుతారు. స్థిరమైన ఆలోచనలకోసం ప్రయత్నం చేయండి. కుటుంభంలో సర్దుబాటు ఆలోచనలను చేసినచో వివాదములు సమసిపోవుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో అలాగే ఆరోగ్యం విషయాల్లో తగినజాగ్రాత్తలు తీసుకోవడం మేలుచేస్తుంది. బంధుమిత్రులతో కుడా నిదానం ఉండటం సూచన. చేసేపనిలో శ్రమను, విచారంను పొందుటకు అవకాశంకలదు. క్రిందిస్థాయి ఉద్యోగులతో కావోచ్చును లేదా సేవకులతో కావోచ్చును కలిసివస్తుంది. ఇష్టమైన పనులలో కొంత సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేయండి. కష్టపడటం చేతగుర్తింపు లభిస్తుంది. ఈవారం సాయిబాబాఆరాధన, లలితాసహస్రనామం పారాయణ చేయుట, లింగాష్టకం పటించుట చేత మేలుజరుగుతుంది. 

కుంభ రాశి
ఈరాశివారికి కొంత అనుకూలమైన సమయం చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. బంధువులతో సరదాగా సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. తీర్థయాత్రలు అనుకూలిస్థాయి. ప్రయత్నకార్యములలో విజయాన్ని పొందుటకు అవకాశం కలదు. భోజనసౌఖ్యంను కలిగిఉంటారు. ఉత్సాహంను కలిగిఉండి నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆర్థికంగా పర్వాలేదు అన్నవిధంగా ఉండుటకు అవకాశం ఉంది. ఇష్టమైన వ్యక్తులతో మీయొక్క ప్రణాలికలను సిద్దంచేస్తారు. కాకపోతే మీయొక్క మాటతీరు కొంతమందిని ఇబ్బందిపెట్టే అవకాశం కలదు. కావున జాగ్రత్తవహిచండి. ఆరోగ్యం బాగుంటుంది. సంతోషంగా గడుపుతారు. ఉద్యోగంలో మాత్రం అనుకోని సంగటనలు జరుగుటకు అవకాశం ఉంది. కావున కొద్దిగా సర్దుకుపోవడం మేలుచేస్తుంది. ఉద్యోగాస్థానంలో అసంతృప్తిని కలిగిఉండుటకు అవకాశం కలదు. నిదానంగా వ్యవహరించండి. ఎటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. మీయొక్క గురువుల ఆలోచనలను పాటించుట చేత ముందుకు వెళ్తారు. ఈవారం లక్ష్మీగణపతిని ఆరాదించుట, సుబ్రమణ్య అభిషేకం, గోవిందనామాలు చదవడం చేయండి.

మీన రాశి
ఈరాశివారికి ఈవారం పెద్దగా అనుకూలమైన ఫలితాలు లేనప్పటికిని పెద్దగ ఇబ్బందులు కూడా పడరు. వారం ప్రారంభంలో మానసికంగా భాదను పొందిన వారం మధ్యలో కొద్దిగా మార్పులు కలుగుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తవహించండి. భోజనసౌఖ్యంను కలిగిఉంటారు. వ్యాపారంలో మాత్రం నూతన ఆలోచనలు చేయకండి. వాయిదావేసుకోవడం మంచిది. ఖర్చులు పెరుగుతాయి. ధననష్టం పొందుతారు. కావున జాగ్రత్త అవసరం. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. వారితో సమయాన్ని కేటాయిస్తారు. ప్రయత్నకార్యములు మధ్యలో ఇబ్బందులను కలిగిస్తాయి. మొండిగా ముందుకు వెల్లడం చేయడం ఉత్తమం. నూతన పరిచయాలు లాభిస్తాయి. మంచి ఆలోచనలను చేయుట కూడా మీకుఅనుకూలిస్తుంది. బంధువులతో నిదానంగా ఉండటం వారి ఆలోచనల్లో కల్పించుకోకపోవడం చేయండి. మీయొక్క వ్యతిరేకులు మిమ్మల్ని ఇబ్బందిపెట్టాలనే చేసినప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు. అకారణంగా తిరగవలసి రావోచ్చును. శ్రమను పొందుతారు. సమాజికవ్యవస్థలొని లోపాలవల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఈవారం సుబ్రమణ్య ఆరాధన, గణపతిపూజ చేయుట, సూర్యనమస్కారం చేయుట ఉత్తమం.  

మరిన్ని శీర్షికలు
annamayya pada seva