Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
Raana as Hero and Villain

ఈ సంచికలో >> సినిమా >>

జూ.ఎన్టీఆర్‌కి ఇదొక అలవాటు

Junior NTR Likes Music

సినిమాకి సంగీతం ప్రాణం. ఆ సంగీతాన్ని ఆస్వాదించని సినీ ప్రముఖులెవరుంటారు.? సినిమా పరిశ్రమలో దాదాపు అందరికీ సంగీతంపై మక్కువ వుంటుంది. కొందరికి అది ఇంకాస్త ఎక్కువే వుంటుంది. అలా చాలా ఎక్కువ మక్కువ సంగీతంపై వుండే వ్యక్తుల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఖచ్చితంగా వుంటాడు.


ఏ కొత్త సినిమా ఆడియో రిలీజ్‌ అయినా, అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా.. ఆ క్యాసెట్‌ తెప్పించుకుని అందులోని పాటల్ని వినడం జూనియర్‌ ఎన్టీఆర్‌కి అలవాటు. వీలైతే ఇంట్లో తీరిగా కూర్చుని పాటలు వినడం, కుదరకపోతే కార్లో ప్రయాణిస్తూ పాటల్ని వినడాన్ని జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎంజాయ్‌ చేస్తాడట.


అంతే కాకుండా, తాను విన్న పాటల్లో మెలోడీస్‌ని బాగా ఇష్టపడే జూనియర్‌ ఎన్టీఆర్‌, తనకు పాటలు నచ్చితే.. ఆ పాట పాడిందెవరు, రాసిందెవరు? అన్న విషయాల్నీ జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని, సందర్భం కలిసొచ్చినప్పుడు ఆయా వ్యక్తులు కలిస్తే ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తాడట.


ఇది నిజంగా జూనియర్‌ ఎన్టీఆర్‌లో ఎవరికీ తెలియని కొత్త యాంగిల్‌ అని చెప్పొచ్చు.

మరిన్ని సినిమా కబుర్లు
Baahubali - 100 Crores Budget