Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
mm sreelekha proud of telugu people

ఈ సంచికలో >> సినిమా >>

రామ్‌గోపాల్‌ వర్మ రజతోత్సవం

Silver Jubilee for Ram Gopal Varma

‘శివ’ సినిమాతో తెలుగు సినిమా గతిని మార్చేసి, బాలీవుడ్‌కి వెళ్ళి అక్కడా విలక్షణ దర్శకుడిగా, ట్రెండ్‌ సెట్టర్‌గా పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, సినీ రంగ ప్రవేశం చేసి పాతికేళ్ళవుతోంది. వచ్చే ఏడాది దర్శకుడిగా రామ్‌గోపాల్‌వర్మకి రజతోత్సవం.


సాధారణంగా ఇలాంటి విషయాల్ని రామ్‌గోపాల్‌ వర్మ అస్సలు పట్టించుకోరు. సినిమా తర్వాత సినిమా చేసుకుపోవడం తప్ప, సినిమా బాగున్నా, బాగోకున్నా, రికార్డుల్ని తిరగరాసినా.. ఆ సినిమా గురించే పట్టించుకోని వర్మ, ఈ విషయాన్ని కూడా తేలిగ్గానే తీసుకుంటారు.


చేయబోయే సినిమా గురించి ఆలోచించాలే తప్ప, గడచిపోయినదాని గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం లేదంటారు రామ్‌గోపాల్‌ వర్మ. అదే ఆయన స్పెషాలిటీ. దర్శకుడిగా తొలి సినిమా ‘శివ’ విడుదలై వచ్చే ఏడాదికి పాతికేళ్ళు పూర్తవుతుంది. ఆ సినిమాకి భారీ యెత్తున రజతోత్సవాలు జరిపినా, వర్మ గురించే రజతోత్సవాలను ఎవరైనా ప్లాన్‌ చేసినా చేయొచ్చు.


ఎందుకంటే, ముందే చెప్పుకున్నాం కదా, తెలుగు సినిమా విషయానికొస్తే ‘శివ’కి ముందు.. ‘శివ’కి తర్వాత.. అన్నంతగా ఆ సినిమాతో వర్మ ట్రెండ్‌ సెట్‌ చేశారు గనుక.

మరిన్ని సినిమా కబుర్లు