Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
mahakavi shree shree

ఈ సంచికలో >> శీర్షికలు >>

‘పాకుడు రాళ్ళు’ హడావిడి - -

Paakudu Rallu

రావూరి భరద్వాజ అనే సాహితీ వేత్త గురించి చాలా తక్కువమందికే తెలుసు నిన్న మొన్నటివరకూ. కానీ అతని పేరిప్పుడు తెలుగునాట మార్మోగిపోతోంది. ఎప్పుడో70లలో ఆయన రచించగా ప్రచురితమైన ‘పాకుడు రాళ్ళు’ నవలకి ఇప్పుడు జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు దక్కడంతో రావూరి భరద్వాజ గురించిన ప్రచారం మీడియాలో ఎక్కువగా జరుగుతోంది.


ఒకప్పుడు ‘పాకుడు రాళ్ళు’ పుస్తకాన్ని కొనేవారే లేకుండా పోయారు. దాంతో పునఃప్రచురణ కూడా ఆపేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.‘పాకుడు రాళ్ళు’ పుస్తకం గురించి అందరూ చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఇంటా బయటా ఇదే చర్చ. అసలు ఆ పుస్తకంలో ఏముందనే ఆసక్తి అందరిలోనూ కన్పిస్తోంది.


ఆ ఆసక్తికి తగ్గట్టుగానే సినిమాని మళ్ళీ కొత్తగా ప్రచురించారు. జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు పొందిన నవల.. అంటూ ఐదొందల పేజీల పుస్తకాన్ని కొత్త కవర్‌ పేజీతో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. సినిమాకి సంబంధించిన నవల ఇది. జ్ఞాన్‌పీట్‌ అవార్డు పొందిన నవల కాబట్టి.. గొప్పతనం కోసం కొందరు ఈ పుస్తకాన్ని కొంటోంటే,ఇంకొందరు హాబీగా అయినా ఈ పుస్తకాన్ని సేకరిస్తున్నారు.

మరిన్ని శీర్షికలు
Chinta Chiguru Koora