Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Tribute to Uday Kiran

ఈ సంచికలో >> సినిమా >>

సత్తా వున్న కొత్త కమెడియన్‌

new comedian

కొత్త కొత్త హీరోలు, హీరోయిన్లే కాదు, తెలుగు తెరపైకి కొత్త కొత్త కమెడియన్లూ వస్తున్నారు. మంచి టైమింగ్‌తో కూడిన ఆర్టిస్ట్‌లు తెలుగు తెరపై కమెడియన్లుగా తమ సత్తా చాటుకోవడానికి ముందుకు రావడం ఆహ్వానించదగ్గదే. వారిలో కొందరు తమదైన ప్రత్యేకతతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటున్నారు.

‘డి ఫర్‌ దోపిడి’ సినిమా వచ్చిన తర్వాత సినీ పరిశ్రమల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఓ కొత్త కమెడియన్‌ చర్చనీయాంశమయ్యాడు. అతనే రాకేష్‌ రాచకొండ. మంచి టైమింగ్‌తో కూడిన డైలాగ్స్‌తో నవ్వులు పండించాడు రాకేష్‌, సినిమాలో తాను కన్పించినంతసేపూ. భవిష్యత్‌లో మంచి కమెడియన్‌ అయ్యే లక్షణాలు అతనిలో మెండుగా వున్నాయి.

కామెడీ స్పెషలిస్ట్‌లైన దర్శకుల చేతిలో పడితే రాకేష్‌ రాచకొండ మరింతగా రాణించే అవకాశం వుంది. ఇండస్ట్రీలో ఎలాగూ అతని గురించి చర్చ జరుగుతుంది గనుక, మంచి ప్రాజెక్టులు తగిలితే, భవిష్యత్తులో స్టార్‌ కమెడియన్‌గా రాకేష్‌ రాచకొండ మారినా మారొచ్చు. ఆ రోజు త్వరలో రావాలని, రాకేష్‌ రాచకొండ మంచి కమెడియన్‌గా గుర్తింపు పొందాలని కోరుకుందాం.

మరిన్ని సినిమా కబుర్లు
Baahubali is not at all Jain's Baahubali