Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
new comedian

ఈ సంచికలో >> సినిమా >>

ఈ బాహుబలి ఆ బాహుబలి కాదు

Baahubali is not at all Jain's Baahubali

సినిమాలు, వివాదాలు కలిసి సహజీవనం చేస్తున్నాయి కొన్నేళ్ళ నుంచి. ఏదన్నా కొత్త సినిమా వస్తే అందులో ఏదో ఒక అంశాన్ని పట్టుకుని వివాదం చేయడానికి కొందరు రెడీగా ఉంటున్నారు. కులాల కుంపట్లు రగిల్చేవారు, మతం పేరుతో వివాదాలు సృష్టించేవారితో సినిమా పరిశ్రమ రాజకీయ రంగం కన్నా ఎక్కువ ఇబ్బంది పడుతున్నది.

దర్శకధీర రాజమౌళి రూపొందిస్తున్న ‘బాహుబలి’ సినిమా కూడా నిర్మాణంలోనే వివాదాలు ఎదుర్కొంటున్నది. కర్ణాటకలోని శ్రావణబెలగోళలో అతి పెద్ద మహావీరుడి విగ్రహం ఉంటుంది. దాన్ని బాహుబలి అంటారు. ఆ పేరుని సినిమాకి ఎలా వాడతారంటూ జైన మతస్తులు అభ్యంతరాలు తెలుపుతున్నారట. ప్రశాంతతకు మారుపేరైన మహా వీరుడి పేరుని పెట్టి, బీభత్సమైన యుద్ధకాండతో సినిమా రూపొందించడం భావ్యం కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.

కొన్నేళ్ళ క్రితం రాజ్‌ కందూరి అనే ఒకాయన ‘బుద్ధ’ అనే సినిమా తీశారు. తెలుగు, తమిళ, సింహల భాషల్లో వచ్చింది ఈ సినిమా. అల్లాణి శ్రీధర్‌ దర్శకుడు దీనికి. ఇది కూడా బౌద్ధుల ఆగ్రహం ఎదుర్కొన్నది. పేర్లను బట్టి వివాదాలు సృష్టించాలనుకుంటే సినిమా వాళ్ళకు సినిమా టైటిళ్ళు దొరకవు. వివాదాలు రేపేవారూ సంయమనం పాటించాలి. సంయమనం పాటిస్తే వివాదాలే రావు. సినిమా వాళ్ళు కూడా కొంతవరకు వివాదాలకు దూరంగా సినిమాలు చేయడం ఉత్తమం.

మరిన్ని సినిమా కబుర్లు
Numerologists