Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Baahubali is not at all Jain's Baahubali

ఈ సంచికలో >> సినిమా >>

సంఖ్యా శాస్త్రజ్ఞులకు ఇదొకటి దొరికింది

Numerologists

కొన్ని ఘటనలు అనుకోకుండా జరుగుతాయి. అలాంటి ఘటనల మధ్య ఏదో సారూప్యత కన్పిస్తుంది. దాని చుట్టూ అనుమానాలు పెరుగుతాయి. ఎందుకిలా? అనుకోకుండా వుండలేం అలాంటి వాటి గురించి విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు. అక్టోబర్‌ 9న తెలుగు సినీ నటుడు శ్రీహరి అకాలమరణం చెందారు. నవంబర్‌ 8న హాస్యనటుడు ఏవీఎస్‌ మరణించారు. డిసెంబర్‌ 7న హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచారు.

ముగ్గురు ప్రముఖ నటులు నెలకొకరుగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. వారు చనిపోయిన తేదీలను పరిశీలిస్తే,  9, 8, 7. జనవరి 6న సినీ నటుడు ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అంటే పైన లెక్కలో ఇంకో తేదీ అనుమానాస్పదంగా చేరింది. అది తెలుగు సినీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నది.

సంఖ్యా శాస్త్రం పేరుతో జోస్యం చెప్పేవారి మాట ఎలా ఉన్నప్పటికీ, ఇదేదో అనుమానాస్పదంగా ఉందని కొందరు భావిస్తున్నారు. ఫిబ్రవరి 5న ఏం జరుగుతుందో అని సినీ వర్గాలు భయభ్రాంతులకు గురవుతున్నారని ప్రచారం జరుగుతున్నది. యాదృశ్చికంగా ఒకటి రెండు ఘటనలు జరగవచ్చునుగాని, నాలుగు ఘటనలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నట్లుగా జరిగితే అనుమానాలు పెరుగుతాయి. ఈ అరిష్టాలకు కారణమేంటా? అని సినీ ప్రముఖులు సంఖ్యా శాస్త్రం చెప్పే జ్యోతిష్యుల వెంట పరుగులు పెడుతున్నారంట.

మరిన్ని సినిమా కబుర్లు
Massage Parlours