Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Not at all those days

ఈ సంచికలో >> సినిమా >>

ప్రారంభమైన ఉదయ్‌కిరణ్‌ ఫౌండేషన్‌

UdayKiran Foundation started
తెలుగు సినీ పరిశ్రమలో ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య ఉదంతం కొందరిని ఆలోచనలో పడేసింది, ఎక్కువమంది కంటతడి పెట్టేలా చేసింది. ఇంకో ఘటన ఇలాంటిది జరగకూడదని భావించి మారియట్ హోటల్ (హైదరాబాద్) లో 'మ్యూజ్' అనే ఆర్ట్ గ్యాలెరీ నిర్వహిస్తున్న కాళీ సుధీర్‌, "ఉదయ్‌కిరణ్‌ ఫౌండేషన్‌"ని ప్రారంభించారు. ఇది పూర్తిగా లాభాపేక్ష లేని ఫౌండేషన్‌ అని నిర్వాహకులు చెప్పారు. అవకాశాల్లేక సతమతమవుతున్నవారు, ఫెయిల్యూర్స్‌ ఎదుర్కొంటున్నవారు ఈ ఫౌండేషన్‌తో ఉపశమనం పొందవచ్చునట.

సినిమా పరిశ్రమలో ఎవరైతే మానసికంగా ఇబ్బందులు పడుతుంటారో అలాంటివారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేలా ఈ ఫౌండేషన్‌ పనిచేస్తుందట. ఫెయిల్యూర్స్‌తో వున్నవారు.. వారికి కౌన్సిలింగ్‌. సపోర్ట్‌ ఇచ్చేలా చేయడం వంటివి. సినీ పరిశ్రమ నుంచి మధుర శ్రీధర్‌, మంచు లక్ష్మి, గోపీ మోహన్‌, ఆర్‌పి పట్నాయక్‌ వంటివారు ఈ ఫౌండేషన్‌కి మద్దతిస్తున్నారు.

స్టార్‌గా ఒకప్పుడు అవకాశాలు పొంది, విజయాలు సొంతం చేసుకున్న ఉదయ్‌కిరణ్‌, అవకాశాలు రాకపోవడంతో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకోవడంతో, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఆలోచనలూ మారాల్సి ఉంటుంది. సక్సెస్‌ వున్నవారి వెంటే పడకుండా, మిగతావారికీ అవకాశాలు కల్పించడం ద్వారా సాటి మనిషిని ఆదుకునే గొప్ప అవకాశం లభిస్తుంది. ఎప్పుడూ ధనార్జనే కాకుండా, సాటి మనిషికి సాయం చేయడం అనే గొప్ప కార్యక్రమాన్ని పరిశ్రమలోనివారికే చేయడం ద్వారా చేపడితే ఇంకో ఆత్మహత్య సినీ పరిశ్రమలో జరగదు.
మరిన్ని సినిమా కబుర్లు
Cheppukondi Chuddam