Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Patashala-7 by bhaskarabhatla

ఈ సంచికలో >> సినిమా >>

నేనొక్కడినే - చిత్ర సమీక్ష

Movie Review - 1 Nenokkadine

చిత్రం: ‘1’ నేనొక్కడినే
తారాగణం: మహేష్‌, కృతి సనన్‌, కెల్లీ డోర్జీ, నాజర్‌, పోసాని, షయాజీ షిండే, ప్రదీప్‌ రావత్‌, శ్రీనివాస్‌రెడ్డి, గౌతమ్‌ కృష్ణ తదితరులు
ఛాయాగ్రహణం: రత్నవేలు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
నిర్మాణం: ఇరోస్‌ ఇంటర్నేషనల్‌, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
నిర్మాతలు: ఆచంట రామ్‌, ఆచంట గోపీనాథ్‌, అనిల్‌ సుంకర
దర్శకత్వం: సుకుమార్‌
విడుదల తేదీ: 10 జనవరి 2014

క్లుప్తంగా చెప్పాలంటే:
ఫేమస్‌ రాక్‌ స్టార్‌ గౌతమ్‌ (మహేష్‌). అయితే అతనికి కలలో కొన్ని సంఘటనలు వెంటాడుతుంటాయి. తన తల్లిదండ్రుల్ని ముగ్గురు వ్యక్తులు చంపేసినట్లు, అతను వారిపై రివెంజ్‌ తీర్చుకున్నట్లు కలలు వస్తుంటాయి. డాక్టర్‌ వద్దకి వెళితే, అది మానసికంగా చిన్న సమస్య మాత్రమేనని చెబుతారు. అయితే ఓ జర్నలిస్ట్‌ సమీరా (కృతి), గౌతమ్‌ విషయంలో స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ చూపిస్తుంటుంది. అతని గతం గురించి తెలుసుకోవాలనుకుంటుంది. గౌతమ్‌, కృతి కలిసి ఆ గతాన్ని తవ్వే ప్రయత్నంలో పడ్తారు. వారి అన్వేషణ ఫలించిందా.? గౌతమ్‌ తన గతం గురించి తెలుసుకున్నాడా? కలలో వెంటాడుతున్న ముగ్గురు వ్యక్తులు ఎవరు? అనేది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
స్వతహాగా మంచి నటుడైనప్పటికీ, పూర్తిగా పెర్ఫామెన్స్‌ చూపించడానికి అవకాశం లేకుండా పోయింది. ఎక్కువ భాగం మౌనానికే పరిమితం కావడంతో, మహేష్‌ నుంచి చాలా ఆశించే అభిమానులు డిజప్పాయింట్‌ అవుతారు. అయితే తన వరకూ మహేష్‌ సినిమాలోని పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కృతి సనన్‌ గ్లామరస్‌గా కన్పించింది, నటన పరంగా మంచి మార్కులే వేయించుకుంటుంది. నాజర్‌ మామూలే. ప్రదీప్‌ రావత్‌ రొటీన్‌, పోసాని తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశాడు. కెల్లీ డోర్జీ, షయాజీ షిండే తమ పాత్రల పరిధి మేరకు ఓకే అన్పించారు. గౌతమ్‌ కృష్ణ క్యూట్‌గా వున్నాడు. మిగతా పాత్రధారులంతా తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సినిమాకి ప్రధాన ఆకర్షణ సినిమాటోగ్రఫీ. సినిమా రిచ్‌గా తెరకెక్కిందంటే అది సినిమాటోగ్రఫీ పుణ్యమే. డైలాగ్స్‌ ఫర్వాలేదు. స్క్రిప్ట్‌ జస్ట్‌ యావరేజ్‌. స్క్రీన్‌ప్లే సాగదీసినట్లన్పిస్తుంది. చాలా చోట్ల ఎడిటింగ్‌ విభాగం ఇంకా బాగా పనిచేసి వుండాల్సింది. కాస్ట్యూమ్స్‌ బాగా డిజైన్‌ చేశారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి.  బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బావున్నా, రెండు మినహా, మిగతా పాటలు అంత క్యాచీగా లేవు.

కాంప్లికేటెడ్‌ స్టోరీ లైన్‌ ఎంచుకున్నాక, ప్రెజెంటేషన్‌లో జాగ్రత్తలు వహించాల్సి వుంటుంది. ఫర్టిక్యులర్‌గా స్క్రీన్‌ప్లే మంచి పట్టుతో వుండాలి. కానీ, అక్కడే ఇబ్బంది ఎదురైంది. నేరేషన్‌ ఏమంత బాగా లేదు. కమర్షియల్‌ హీరోతో డిఫరెంట్‌ సినిమా, కమర్షియల్‌ హంగులు లేకుండా అంటే ఇబ్బందులు తప్పవని ఈ సినిమా రుజువు చేస్తుంది. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు భిన్నంగా సినిమా తెరకెక్కిస్తున్నప్పుడు ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేసేలా వుండాలి. అదీ స్టార్‌ హీరోతో సినిమా అంటే ఇంకా జాగ్రత్త పడాలి. అవేవీ కన్పించలేదు ఈ సినిమా విషయంలో. ఫస్టాఫ్‌ బాగానే వున్నా, ఇంటర్వెల్‌ గ్రిప్పింగ్‌గానే వున్నా, సెకెండాఫ్‌లో మాత్రం కథ, కథనం గాడి తప్పాయి. హాలీవుడ్‌ రేంజ్‌లో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ వున్నందువల్ల, టెక్నికల్‌గా బావుందన్పించుకోవచ్చుగానీ, ఓవరాల్‌గా సినిమా  అంచనాల్ని అందుకోలేనట్టే.

ఒక్క మాటలో చెప్పాలంటే: వ్రతం చెడలేదు కానీ, ఫలితం దక్కకపోవచ్చు.

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Director Sukumar