Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

దురదృష్టపు దొంగలు

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే సీరియల్ ఇది.

డల్లాస్ లోని ఓ ఇంట్లోంచి ఓ గుడ్డివాడు ఏ కారణంచేతో ఓ టెలివిజన్ ని దొంగిలించాడు. ఏదో చప్పుడికి ఆ ఇంట్లోని వారు బెడ్ రూం లోంచి బయటికి వచ్చి చూస్తే, ఆ దొంగ ఆ ఇంటి ఆవరణలోని చెట్టుకి ఢీకొని కింద పడి ఉండటం, పక్కనే ఉన్న టి.వి.ని చూశారు. ఆ దొంగ తేలిగ్గా చిక్కాడు.


 

ఓక్లహామ్ సిటీలో డెన్నిస్ న్యూటన్ అనే అతను తుపాకి చూపించి, బెదిరించి ఓ దుకాణంలో డబ్బు దోచుకున్నాడన్న నేరం మీద అరెస్ట్ చేయబడ్డాడు. అతను తను నిర్దోషినని వాదించడానికి లారీ జోన్స్ అనే లాయర్ని పెట్టుకున్నాడు.
మొదటిరోజు కోర్టులో తన క్లయింట్ తరపున వాదించడానికి లారీ జోన్స్ లేవగానే, కోర్ట్ కి హాజరైన ఆ దుకాణం యజమాని అతన్ని చూసి గట్టిగా అరిచాడు.
"మా దుకాణంలో దొంగతనం చేసాక ఆ దొంగ పారిపోయిన కారు డ్రైవర్ ఇతనే."
పోలీసులు జడ్జి ఆదేశం మీద ఆ డిఫెన్స్ లాయర్ని అక్కడికక్కడే అరెస్ట్ చేశారు.

 

మరిన్ని సీరియల్స్