Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Award to Bapu garu in Dubai

ఈ సంచికలో >> సినిమా >>

ఈయన కూడా పోయారు

He is also died

జనవరి మాసం తెలుగు సినీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తీసింది. ఉదయ్‌కిరణ్‌ మరణం, ఆ తరువాత అంజలీ దేవి అస్తమించడం, అక్కినేని నాగేశ్వరరావు దివికేగడం ఇవన్నీ తెలుగు సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసిన విషాద ఘటనలు.ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ సోదరుడు ఇవివి గిరి కూడా ఈ మాసంలోనే కన్నుమూశారు. ఆయన ఇవివి సినిమాలకు స్టిల్స్‌ విభాగంలో పనిచేశారు.

ఇదిలా ఉండగా అలనాటి నటుడు నాగరాజారావు జనవరి 21వ తేదీన తుది శ్వాస విడిచారు. అజరామర చిత్రం ‘నర్తనశాల’లో సహదేవ పాత్రలో నటించారు నాగరాజారావు. ప్రముఖ గాయని ఎస్‌.జానకికి నాగరాజారావు స్వయానా మరిది. విజయనిర్మలకు జంటగా ‘రంగుల రాట్నం’ సినిమాలోనూ ఈయన నటించారు.

‘ఆంధ్రా ఆర్ట్స్‌ నాటక సంస్థకు’ వెన్నెముకలా ఉండి పలు నాటకాలలో పాల్గొన్నారు నాగరాజారావు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. చెన్నయ్‌లోని ఆయన స్వగృహంలో మృతిచెందారాయన. నటి శారద నాగరాజారావు భౌతిక కాయానికి నివాళులర్పించారు.
 

మరిన్ని సినిమా కబుర్లు
This title is for Family Audience