Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
He is also died

ఈ సంచికలో >> సినిమా >>

ఫ్యామిలీ ఆడియన్స్‌ కోసం ఈ టైటిల్‌

This title is for Family Audience

రామ్‌చరణ్‌ మాస్‌ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. ఒకే ఫార్మాట్‌లో సినిమాలు చేస్తున్నాడనే విమర్శ చరణ్‌పై వస్తోన్నది కూడా. అందుకే ట్రాక్‌ మార్చి ఫ్యామిలీ సినిమా ఒకటి రామ్‌చరణ్‌ చేయబోతున్నాడంట. కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనున్నది.
ఈ సినిమాకి ‘గోవిందుడు అందరివాడు’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు. బండ్ల గణేష్‌ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌ మీదకి రాబోతుండగా, తమ సినిమా టైటిల్‌ ఇంకా ఫిక్స్‌ అవలేదని చిత్ర యూనిట్‌ వెల్లడిరచింది. కాని ఫ్యామిలీ ఆడియన్స్‌ని రీచ్‌ అవడానికి ‘గోవిందుడు అందరివాడు’ అనే సాఫ్ట్‌ టైటిల్‌ బాగుంటుందనే భావన చిత్ర యూనిట్‌లో ఉందని సమాచారమ్‌.

ఒక్కోసారి తమ సినిమా టైటిల్‌ లీక్‌ అవడంతో అది కాదు అని చెప్పి, దాన్నే కొనసాగించిన సందర్భాలున్నాయి తెలుగు సినిమా పరిశ్రమలో. ‘గోవిందుడు అందరివాడు’ అనే టైటిల్‌ చిరంజీవి హీరోగా వచ్చిన ‘అందరివాడు’ చిత్రానికి మొదట పెట్టాలనుకున్నారు. కాని ‘అందరివాడు’తో సరిపెట్టారు. ఎన్టీఆర్‌ సినిమా ‘బృందావనం’కీ అనుకున్నారు, కుదరలేదు. చరణ్‌ సినిమాకి ఈ టైటిల్‌ ఖాయమవుతుందో లేదో మరి.

మరిన్ని సినిమా కబుర్లు
cinimaagaa cinimaa