Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
This title is for Family Audience

ఈ సంచికలో >> సినిమా >>

సినిమాగా సినిమా

cinimaagaa cinimaa

సినిమా... మనిషి జీవితంలో ఓ భాగం అని చెప్పవచ్చును. సినిమాని ఇష్టపడనివారెవరుంటారు? సినిమా గురించి తెలుసుకోవాలని అనుకోనివారూ ఉండరు. సినిమా సంగతుల గురించి ఎన్ని పుస్తకాలు వచ్చినా, సినిమా పరిశ్రమ గురించి ఎంతగా రచయితలు పేర్కొన్నా కొత్త కొత్తగా వచ్చే పుస్తకాలకి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అదే సినిమాకి ఉన్న క్రేజ్‌.

సినిమా నటుల గురించి, సినిమా గురించి, సినిమాకి సంబంధించిన వివిధ విభాగాల గురించి సవివరంగా పేర్కొంటూ ప్రముఖ సినీ చరిత్రకారుడు, సినీ విమర్శకుడు నందగోపాల్‌ ఓ పుస్తకాన్ని రచించారు. దాని పేరు ‘సినిమాగా సినిమా’. సినిమా రంగంలో తనకున్న అనుభవాన్ని రంగరించి ఈ పుస్తకాన్ని నందగోపాల్‌ తీర్చిదిద్దారు.

పుస్తక రూపకల్పనలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు తనకు సహాయ సహకారాలు అందించారని, సినిమా గురించి అందరికీ అన్నీ తెలిసినా, ఇంకా తెలియాల్సినవి చాలా ఉంటాయని తన పుస్తకం ద్వారా ఇప్పటిదాకా ఎవరూ స్పృశించని అంశాలను సినీ అభిమానులకు చేరవేస్తున్నానని నందగోపాల్‌ చెప్పారు.

మరిన్ని సినిమా కబుర్లు
Cheppukondi Chuddam