Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with Shruti Haasan

ఈ సంచికలో >> సినిమా >>

లవ్ యు బంగారమ్ - చిత్ర సమీక్ష

Movie Review - Love You Bangaram

చిత్రం: లవ్‌ యూ బంగారం
తారాగణం: రాహుల్‌, శ్రావ్య, రాజీవ్‌, మురళీకృష్ణ, రవి, సంజనా తదితరులు
ఛాయాగ్రహణం: అరుణ్‌ సూరపనేని
సంగీతం: మహిత్‌ నారాయణ్‌
నిర్మాణం: క్రియేటివ్‌ కమర్షియల్స్‌, మారుతి ప్రొడక్షన్స్‌
నిర్మాతలు: మారుతి, వల్లభ్‌
దర్శకత్వం: గోవి
విడుదల తేదీ : 24-01-2014

క్లుప్తంగా చెప్పాలంటే :
ఓ మొబైల్‌ ఫోన్‌ కంపెనీలో పనిచేసే ఆకాష్‌ (రాహుల్‌), మీనాక్షి (శ్రావ్య)తో ప్రేమలో పడతాడు. పెద్దల్ని కాదని ఆకాష్‌, మీనాక్షి వివాహ బంధంతో ఒక్కటవుతారు. మొదట్లో వారి వైవాహిక జీవితం సాఫీగా సాగినా, రోజులు గడిచే కొద్దీ వారి వైవాహిక జీవితంలో చెప్పుకోదగ్గ మార్పులు వస్తాయి. ఇద్దరి ఆలోచనల్లోనూ మార్పులు సంతరించుకోవడంతో, పరిస్థితులు చెయ్యిదాటిపోతాయి. ఉద్యోగంలో మీనాక్షి చేరాక, ఆకాష్‌ ప్రవర్తనలో తీవ్రమైన మార్పు వస్తుంది. మీనాక్షి కూడా విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. అలా వారి జీవితంలో వచ్చిన మార్పులతో, వారి వైవాహిక జీవనం ఏమయ్యింది? అనేది మిగతా కథ. అది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే :
రాహుల్‌ నటుడిగా పరిణతి వుంది. సినిమాలోని తన పాత్రకు సరిపోయాడు. నటన, డిక్షన్‌లో మార్పు గురించి రాహుల్‌ ఆలోచిస్తే మంచిది. శ్రావ్య నటన పరంగా ఓకే. గ్లామర్‌ పరంగా చూస్తే, ఆకట్టుకునే అందం, అందాల ప్రదర్శనతో ఉనికిని చాటుకుంది. రాజీవ్‌ ఓకే. మురళీకృష్ణ ఫర్వాలేదు, రవి తదితరులు సోసో.

కథ, కథనం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌, డైలాగ్స్‌... ఇలా ఏవీ గొప్పగా లేవు. ప్రత్యేకంగా వాటి గురించి చెప్పుకోడానికేమీ లేదు. సంగీతం కూడా అంతంతమాత్రమే, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదు. రెండు పాటలు తెరపై చూడ్డానికి బాగానే వున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే.

సినిమా నిండా ద్వందార్ధపు డైలాగులే, మోతాదు మించిపోయిన శృంగారమే. ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో వల్గర్‌ డైలాగ్స్‌, డబుల్‌ మీనింగ్‌ జోకులతో సరిపెట్టేశారు. ఫస్టాఫ్‌ ఫర్వాలేదన్పించినా, సెకెండాఫ్‌లో విజృంభించేశారంతా. వల్గారిటీనీ, ద్వందార్ధపు డైలాగుల్నీ ఇష్టపడేవారికి కొంతవరకు ఈ సినిమా రుచించే అవకాశం వుంది. బాక్సాఫీస్‌ వద్ద నెగ్గుకురావడం కష్టమే.

ఒక్క మాటలో చెప్పాలంటే : చూడలేం బంగారం...

అంకెల్లో చెప్పాలంటే : 2/5

 

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka