Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
patala pallavule

ఈ సంచికలో >> సినిమా >>

‘అనామిక’ పేరు నిలబెడుతుందా?

Anamika

దర్శకుడు శేఖర్‌ కమ్ములకి టాలీవుడ్‌లో సెపరేట్‌ ఇమేజ్‌ వుంది. ఆయన రూపొందించిన సినిమాలు తెలుగు తెరపై మంచి విజయాల్ని సాధించడమే అందుకు నిదర్శనం. క్లీన్‌ సినిమాలు తీస్తాడనే బ్రాండ్‌ ఇమేజ్‌ వున్న శేఖర్‌ కమ్ముల, తనపై వున్న అంచనాలకు తగ్గట్టుగానే సినిమాలు తీస్తూ, తన బ్రాండ్‌ వాల్యూని నిలబెట్టుకుంటున్నాడు.

ఇప్పుడు తాజాగా శేఖర్‌ కమ్ముల ‘అనామిక’ పేరుతో సినిమా తీస్తున్నాడు. నయనతార ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. హిందీలో వచ్చిన ‘కహానీ’ సినిమాకి ఇది తెలుగు రీమేక్‌. తెలుగు రీమేక్‌కి తగ్గట్టుగా సినిమాలో చాలా మార్పులు కూడా చేశాడు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. హిందీలో ‘కహానీ’ మంచి విజయం సాధించినట్టే, తెలుగులో ‘అనామిక’ మంచి విజయం సాధిస్తందనే అంచనాలున్నాయి.

‘అనామికపై’ ఉన్న అంచనాలు నిజమైతే, శేఖర్‌ కమ్ముల బ్రాండ్‌ వాల్యూ పెరిగినట్లే అవుతుంది. ‘కహానీ’లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రాసిన ఓ పాపులర్‌ సాంగ్‌ని సిగ్నేచర్‌ సాంగ్‌లా వాడుకున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఆ సాంగ్‌, ఎమోషనల్‌గా సాగి, సినిమాకి బాగా ప్లస్‌ అయ్యింది. తెలుగులో ‘అనామిక’ కోసం శేఖర్‌ కమ్ముల ఏం ప్రయోగం చేస్తున్నాడోగాని, ఇదివరకటి అతని సినిమాలకన్నా ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి సినీ అభిమానుల్లో, వాటిని ఆయన అందుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని సినిమా కబుర్లు
second innings