Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
red carpet

ఈ సంచికలో >> సినిమా >>

గడ్డానికి కారణం

gaddam

తన సినిమా నిర్మాణ దశలో ఉన్నప్పుడు రాజమౌళి ఎక్కువగా గడ్డంతోనే కనిపిస్తాడు. అది ఆయనకు సెంటిమెంట్‌ అని అంటుంటారు కొందరు. దర్శకులు, నిర్మాతలు, నటులు కడా సెంటిమెంట్లు పాటించడం జరుగుతున్నది. కోడి రామకృష్ణ తలకు ఓ గుడ్డ కట్టుకుంటుంటారు. అది ఆయనకు సెంటిమెంట్‌.

రాజమౌళి విషయానికి వస్తే, ఇదివరకటికన్నా చాలా పొడుగాటి గడ్డంతో కనిపిస్తున్నాడాయన. ‘బాహుబలి’ సినిమా షూటింగ్‌ జరుగుతుండడం వల్ల, ఎక్కువ కాలం నిర్మాణంలో ఉండడం వల్ల గడ్డం చాలా ఎక్కువగా పెరిగిపోయి, చూసేవారికి కొంచెం చికాకు కలిగించేలా ఉందది.

అంత చికాకునూ రాజమౌళి భరించడం వెనుక సెంటిమెంట్‌ ఒక్కటే కారణం కాదని, సినిమాలో రాజమౌళి కూడా చిన్న పాత్రలో నటిస్తున్నాడని ఓ గుసగుస ప్రచారంలోకి వచ్చింది. తన సినిమాలపై ఎలాంటి గాసిప్స్‌ వచ్చినా, వాటికి సమాధానం ఇచ్చే రాజమౌళి, తన గడ్డం గురించి కూడా వివరణ ఇస్తే బావుంటుంది.

 

మరిన్ని సినిమా కబుర్లు
300 movies on release pending