Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Patashala-10 by bhaskarabhatla

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - హార్ట్‌ ఎటాక్‌

movie review - Heart Attack

చిత్రం: హార్ట్‌ ఎటాక్‌
తారాగణం: నితిన్‌, ఆదా శర్మ, కేశ కంబాటి, అలీ, బ్రహ్మానందం, విక్రమ్‌జీత్‌, అజయ్‌, తేజు, ఇజాజ్‌ ఖాన్‌ తదితరులు
ఛాయాగ్రహణం: అమోల్‌ రాథోడ్‌
సంగీతం: అనూప్‌ రుబెన్స్‌
నిర్మాణం: పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌
దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
నిర్మాత: పూరి జగన్నాథ్‌
విడుదల తేదీ: 31 జనవరి 2014
 

క్లుప్తంగా చెప్పాలంటే :
వరుణ్‌ (నితిన్‌) ఓ హిప్పీ, అతను స్పెయిన్‌కి వెళతాడు. అక్కడ వరుణ్‌కి హయాతి (ఆదా శర్మ) తారసపడ్తుంది. తొలి చూపులోనే ఆమెను ఇష్టపడతాడు నితిన్‌. అయితే ఆమె నుంచి ఓ ముద్దు మాత్రమే ఆశిస్తాడు వరుణ్‌. ముద్దు కోసం ఆదా శర్మ వెంటపడ్తాడు వరుణ్‌. ఈ క్రమంలో వరుణ్‌ని ఇష్టపడ్తుంది హయాతి. వరుణ్‌ అడిగినట్లుగా ముద్దు ఇవ్వడానికి హయాతి ఒప్పుకుంటుంది, కానీ కొన్ని కండిషన్స్‌ పెడుతుంది. అవేంటి? ఆ కండిషన్స్‌తో వరుణ్‌ లైఫ్‌ స్టయిల్‌ మారిందా? అన్నది మిగతా కథ.

మొత్తంగా చెప్పాలంటే :
హీరో నితిన్‌ ఈ సినిమాలో మెచ్యూర్డ్‌గా కన్పించాడు. నటన పరంగా మెచ్యూరిటీని ప్రదర్శించిన నితిన్‌, తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అతని నటనలో ఈజ్‌ పెరిగినట్లుగా కన్పిస్తుంది మునుపటి సినిమాలతో పోల్చితే. ఆదా శర్మ గ్లామర్‌ పరంగా ఓకే. పెర్ఫామెన్స్‌ పరంగా మంచి మార్కులేయించుకుంటుంది. కేశా కంబాటి సెక్సప్పీల్‌తో ఆకట్టుకుంటుంది. విక్రమ్‌జిత్‌ ఫర్వాలేదన్పించాడు. బ్రహ్మానందం, అలీ మామూలే. మిగతా వారంతా తమ పాత్రల పరిధుల మేర నటించారు.

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదు. పాటలు కూడా అంతే. ఎడిటింగ్‌ బాగానే వుంది. కాస్ట్యూమ్స్‌ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి కావాల్సిన రిచ్‌నెస్‌ తెచ్చింది, సన్నివేశాల్ని ఎలివేట్‌ చేసింది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరు బావుంది.

కమర్షియల్‌, యాక్షన్‌ సినిమాలపైనే దృష్టిపెట్టిన పూరి జగన్నాథ్‌, చాలా కాలం తర్వాత లవ్‌ స్టోరీ తెరకెక్కించానని చెప్పడంతో సినిమాపై అటెన్షన్‌ బాగానే క్రియేట్‌ అయ్యింది. పూరి సినిమాలంటే అందులో హీరోకి ఓ సెపరేట్‌ బాడీ లాంగ్వేజ్‌ వుంటుంది. అది నితిన్‌కి ఎలా వుంటుంది? అన్న ఆసక్తి కూడా నెలకొంది. ఇలా ఈ సినిమాపై నెలకొన్న అంచనాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కథ పరంగా భిన్నం అనిపించుకోదు. అయితే ఓ మామూలు కథకి రిచ్‌ ప్రెజెంటేషన్‌తో తీర్చిదిద్దాడు దర్శకుడు. నేరేషన్‌ మాత్రం అంత గొప్పగా అన్పించుకోలేదు. సహజంగా పూరి సినిమాలంటే డైలాగ్స్‌ గురించి ఎక్కువ ఆసక్తి వుంటుంది. అలా ఈ సినిమాలోనూ కొన్ని డైలాగ్స్‌ బాగా పేలాయి. స్క్రిప్ట్‌ ఫర్వాలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త ఎఫర్ట్స్‌ పెడిటే బావుణ్ననిపిస్తుంది.

ఫస్టాఫ్‌లో రొమాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, కాస్త యాక్షన్‌ సమపాళ్ళలోనే వున్నాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కూడా బాగానే వుంది. సెకెండాఫ్‌కొచ్చేసరికి కథలో సీరియస్‌నెస్‌ పెరుగుతుంది. ఓవరాల్‌గా చూస్తే సినిమా ఓకే అన్న ఫీలింగ్‌ కలుగుతుంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపర్చదు, అలాగని అంచనాలకు తగ్గట్టుగా వుందనీ అనలేం. బ్రహ్మానందం, అలీ పండించిన కామెడీ సినిమాకి ప్లస్‌పాయింట్‌. ఎమోషన్‌ గ్రాఫ్‌ మెయిన్‌టెయిన్‌ చేసి వుంటే, సినిమాకి అది ఇంకా ప్లస్‌ అయ్యేది.

ఒక్కమాటలో చెప్పాలంటే : హార్ట్‌ ఎటాక్‌..  టైమ్‌ పాస్‌

అంకెల్లో చెప్పాలంటే : 2.5/5

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Pandavulu Pandavulu Tummeda