Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - Pandavulu Pandavulu Tummeda

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aditya hrudayam

ప్పుడప్పుడు ఒకటి. ఆరా వారాలు రాయడం మానేస్తే దశ నుంచి అప్పుడప్పుడు రాసే దశకి బిజీ అయిపోయింది జీవితం. గోతెలుగు యాజమాన్యం, రెగ్యులర్ పాఠకులు మన్నించాలి. ఈ వారం ఎలాగైనా టైముకి రాసి పంపాలని కృతనిశ్చయించుకున్నా. అంటే కృతనిశ్చయంతో ఉన్నా కారణం, ఎవ్వరికీ నివాళులివ్వకుండా నా మానాన నేను రాసే అవకాశం రావడమే. అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు. మరీ ఎక్కువ ఏడిపించేశాడాయన ఈ మధ్యన.

"వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగుపడక వివరింపతగున్
కని, కల్ల నిజములెరిగిన
మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ"

"ఒరులేయవి యొనరించిన
నరవర అప్రియము తనమనంబున కగు, తా
నొరలకు నవి సేయకునికి
పరాయణము పరమధర్మ పధములకెల్లన్"

"ధనంలోను, కులంలోను, గుణంలోను, బలవంతుడితో ఎంతైనా పోరాటం చేయ్, గెలిస్తే మహాబలవంతుడౌతావు, ఓడిపోతే మర్యాదైనా దక్కుతుంది. కానీ, నీకన్నా బలహీనుడి మీద బ్రహ్మస్త్రాలతో దాడి చేయకు. గెలిచిన మర్యాద పోతుంది, ఓడితే మౌనమే పోతుంది.

"Live and let line" is the soul of indian philosophy.

"అవునుగాని చోట అధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువకాదు
కొండ అద్దమందు కొంచమై ఉండదా
విశ్వదాభిరామ వినురవేమ"

ఇవన్నీ మేటర్ పోగేయడానికి రాస్తున్నానని మీకనిపించవచ్చు. కానీ కాదు. ఇవి ఈ వారం రాయాలని నిర్ణయించుకుని పాతపుస్తకాలు తిరగేసి తప్పుల్లేకుండా రాయాలని ప్రయత్నమూ చేయలేదు. చిన్నప్పట్నుంచి నేర్చుకున్న చాలా విషయాల్లో నేను సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయడానికొచ్చాక రోజూ ఏదో ఒక సందర్భంలో నాకు గుర్తొస్తూనే ఉండేవి ఇవన్నీ. ఎవ్వరికైనా ఏ వృత్తిలోనైనా పనికొస్తాయని నమ్మి వీటినే ఈ వారం ఆర్టికల్ గా సారీ... హార్టికల్ గా రాస్తున్నాను.

"నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు...
నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే
నిరంకుశంగా వీరే..."
సమాజంలో పౌరుల ధోరణిని అద్దం పట్టే ఈ శ్రీ శ్రీ గారి
వచన కవిత - ప్రతి నిముషం మైండ్ లో మొదలవుతుంది నాకు."

వీటి నుంచి నేర్చుకుని పైకొచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు, వీటిని నేర్చుకుని కూడా ఏమీకాకుండా కుదేలైన వారూ చాలా మందే ఉంటారు. వీటిని నేర్చుకుని, మార్చి రాసి ప్రముఖులుగా పేరుపొందిన సాహితీవేత్తలు కూడా ఉంటారు. కానీ, పాతబడిన కొద్ది వైన్ కి కిక్ ఎక్కువైనట్టు, తరాలు మారుతున్న కొద్దీ సుమతీ శతకాలు, వేమన సూక్తులు, భర్తృహరి సుభాషితాలు, శ్రీ శ్రీ స్పూర్తివంతమైన ఆలోచనా ధోరణి, ఇలాంటి ఒరిజినల్ డి'వైన్' రచనలకి కిక్ మరీ ఎక్కువ. కాన్వెంట్ చదువుల్లో పోటీవల్ల ఇంట్లోకూడా పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడే తల్లిదండ్రులు టేకు చెట్లలా పిల్లల్ని పెంచగలరు.

వాటికి 20 ఏళ్ల తర్వాత మార్కెట్ బావుంటుంది. కానీ, మనుషులుగా మార్చలేరు.

"మొక్కై వంగనిది మానై వంగునా?" అని పెద్ద వాళ్లు ఊరికే అన్నారా? మొక్క దశలోనే పేరెంట్స్ డిసైడ్ చేస్కోవాలి - పిల్లల్ని మానుగా పెంచాలా, మనిషిగా పెంచాలా అని ఇంగ్లీషు మీడియం తప్పనో, పోటీలో పిల్లల్ని నిలబెట్టద్దనో నా ఉద్దేశం కాదు. నిజానికి ఈతరం పిల్లలకి చదువుకన్నా వ్యక్తిత్వ వికాసం నేర్పే కాన్సెప్ట్ స్కూల్సే ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. కానీ మన మాతృభాషా సాహిత్యం అర్ధం చేసుకోవడం వల్ల వచ్చే వ్యక్తిత్వ వికాసం ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కోగలుగుతుంది. ఎన్ని ఆటుపోట్లు అయినా తట్టుకోగలుగుతుంది. ఎన్ని ప్రతికూల పరిస్థితులెదురైనా పోరాడటం నేర్పుతుంది. సాటి మనిషితో స్వచ్చంగా మెలగడం నేర్పుతుంది. మనసుని సున్నితంగా ఉంచుతుంది. మెదడుని వజ్రంలా సానబెడుతుంది. ఈ రెండు అవయవాలకీ ఉండాల్సిన సహజలక్షణాలవే. కొంతమందికి మెదడు సున్నితంగా ఉండి, మనసు కఠినంగా మారిపోతుంది ఈ మధ్యన అందుకే డిప్రెషన్ లు, అసహనాలు, మానసిక అశాంతి.

సాంకేతిక చిచ్చు పెరిగిపోతున్న ఈతరం సమాజంలో లక్షలకోట్ల జీవితాల అనుభవసారంతో సాహితీవేత్తలు రచించిన సారస్వతి పాఠాల్ని చులకన చేస్తే, తర్వాత తరానికి సమాజంలో పౌరులుంటారు కానీ, వారికి ఆత్మలుండవు. సోల్ లెస్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టూ సోలో లైఫ్. ప్రతిమనిషికి సాటిమనిషి ఒకడుంటాడు గానీ వారి మధ్య ఏ బంధమూ, బాంధవ్యమూ ఉండదు. ఆత్మ నూన్యత, శూన్యత తప్ప, ఆత్మబలం, ఆశవాహాదృక్పథం ఉండవు. పొగాకు తాగడం నిషేధం అన్న డిస్ క్లైమర్ యాడ్ లాగ, ఈ వారం ఆదిత్య హృదయం తర్వాత తరానికి వారు సినిమా చేసే ముందు డిస్ క్లైమర్ యాడ్. సినిమా తీసే భావితరాలమార్గ దర్శకులు, భావితరాల మార్గ నిర్మాతలు ఆలోచించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.

నీతులు నేర్చుకోవడం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువున్నాయని కొంతమంది మిత్రులు నాతో వాదిస్తారు. వారిచ్చే ఉదాహరణల్లో ప్రముఖమైనవి ఏంటంటే 'ఆలశ్యం అమృతం విషం' అన్న పెద్దలే 'నిదానమే ప్రధానము' అని అన్నారని. నిజమే, రెండు కాంట్రాస్ట్ సూక్తులూ పెద్దలే ఎందుకన్నారని, నేను ఆలోచిస్తే, నాకర్ధమైంది ఏంటంటే...

సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఒక్కో సామెతని మనం వాడుకోవాలి. పాఠం లాగ, ఆయుధం లాగ. 'పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం పనికి రాదని' కూడా మన పెద్దలు చెప్పారు కదా! దాన్నిక్కడ వాడుకోవాలి. మంచి చెడు రెండూ మనకి పెద్దవాళ్లు నేర్పుతారు దానర్ధం మంచి జరిగేటప్పుడు చెడగొట్టద్దని, చెడు జరుగుతుంటే దాన్ని మంచిగా మలచమని మనమేం చేస్తున్నాం? ఎవరికి వారే ఆలోచించుకోవాలి.
 

మీ
వి.ఎన్. ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka