Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
phones

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (జనవరి 31 - ఫిబ్రవరి 06) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. నూతన ప్రయత్నాలు ఆరంభించాలనే తలంపును కలిగి ఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో సమయాన్ని గడుపుటకు ఆస్కారం ఉంది వారితో సమయాన్ని గడుపుటకు ఆస్కారం ఉంది. నచ్చిన వ్యక్తులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుతారు. రాజకీయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు వాటికి సమయాన్ని ఇచ్చుటకు అవకాశం ఉంది. ఆలోచనలు పెరుగుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద వద్దు. కుటుంబ పెద్దలతో స్వల్ప విభేదాలు కలుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త. వారం మొత్తం మీద విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి తప్పక మేలుజరుగుతుంది. పోటీపరీక్షలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు దూరప్రదేశం నుండి సమాచారం అందుతుంది. గతకొంతకాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు బాగుంటుంది ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తి ఉంటుంది. కళారంగంలో ఉన్నవారికి పెద్దలతో ఉన్న పరిచయాల వలన లాభంను పొందుతారు, కొత్త అవకాశాల కోసం చేయు ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చుటకు అవకాశం ఉంది.

వృషభ రాశి
ఈవారం మీరు బంధుమిత్రులతో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులను పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయల్లో ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. మీ ఆలోచనలు తోటివారికి ఉపయోగపడేలా ఉండుటకు అవకాశం ఉంది. ప్రయాణాల వలన ఇబ్బందులు తప్పకపోవచ్చును. అధికారులను కలుస్తారు వారితో లాభంను పొందుతారు. నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు పెద్దల సూచనలు, సలహాలను పాటించుట మంచిది. వారం మొత్తం మీద విద్యార్థులకు గుర్తింపు లభిస్తుంది. పోటీ పరీక్షల్లో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడం వలన అనుకున్నది సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారులతో గల సత్సంభందాలు ఉపయోగపడుతాయి. అందరిని కలుపుకొని వెళ్ళుట మూలాన పనులు వేగంగా పూర్తిఅయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం లాభాలు పొందుతారు. నూతన ఆలోచనలు కలిగిఉంటారు. కళారంగంలో ఉన్నవారికి పెద్దల సహాకారం వలన నూతన అవకాశాలు పొందుతారు. ప్రణాళికతో ముందుకు వెళ్ళినచో విజయాలను పొందుటకు అవకాశం ఉంది.

మిథున రాశి
ఈవారం మీరు అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండుట అనేది మీకు తప్పక ఉపయోగపడుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద చేయకండి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండుట సూచన. అనుకోకుండా ప్రయాణాలు చేయుట మూలాన ఊహించిన దానికన్నా అధికమైన ఖర్చులు కలుగుతాయి. నూతన ప్రయత్నాలు చేయకపోవడం మంచిది లేకపోతే ఇబ్బందులు పడవలసి రావోచ్చును జాగ్రత్త. వారం మొత్తం మీద విద్యార్థులకు పెద్దగా బాగుండక పోవచ్చును కావున అధికమైన శ్రద్ధను పెట్టుట మంచిది. పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చును. ఉద్యోగులు అధికారులతో వారికి అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో సమయపాలన పాటించుట అనేది ఉత్తమం. వ్యాపారస్తులకు శ్రమతప్పక పోవచ్చును శ్రమకు తగ్గ ఫలితం రాకపోవచ్చును కాకపోతే నష్టం మాత్రం ఉండదు. బాగాఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. కళారంగంలో ఉన్నవారికి పెద్దగా అనుకూలమైన ఫలితాలు కలుగకపొవచ్చును అదేవిధంగా అనుకోకుండా విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త.

కర్కాటక రాశి

ఈవారం మీరు చేపట్టిన పనులలో మొదట్లోచూపిన ఉత్సాహం చివరివరకు కొనసాగించ లేకపోవచ్చును. ప్రయత్నాలకు సంబంధించిన విషయాల్లో పెద్దల సూచనలు పాటించుట వలన కొంతమేర ఇబ్బందులు తగ్గుటకు అవకాశం ఉంది. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు అందరిని సంప్రదించుట మంచిది. ప్రయాణాల వలన అలసిపోతారు అదేవిధంగా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చును. అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. వారం మొత్తం మీద విద్యార్థులకు చదువుపైన పూర్తిస్థాయిలో శ్రద్ద ఉండకపోవచ్చును కావున పెద్దలకు నచ్చేవిధంగా చెప్పి వారిని ప్రోత్సహించుట ఉత్తమం. ఉద్యోగులకు అధికారుల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఉద్యోగంలో సర్దుబాటు విధానం ఆవలంభించుట చేత మేలుజరుగుతుంది. సాధ్యమైనంత వరకు ప్రతిపనిలో నిర్ణయం తీసుకొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట మంచిది. వ్యాపారస్తులకు ఆర్థికపరమైన విషయాల్లో చిన్న చిన్న సమస్యలు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. కళారంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు కలుగుతాయి కాకపోతే ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం సంతృప్తి ఉండకపోవచ్చును.


సింహ రాశి

ఈవారం మీరు చేపట్టిన పనులలో ఆశించిన లాబాలు కలుగుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఆరంభించి వాటిని విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద చేయకండి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మాటలను మాత్రం పొదుపుగా వాడుట సూచన లేకపోతే అనుకోకుండా విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది. వారంమొత్తం మీద విద్యార్థులకు పోటిలలో పాల్గొనాలనే తలంపు ఉంటుంది చిన్నపాటి ప్రోత్సాహం లభిస్తే వాటిని వారు సద్వినియోగం చేసుకొనే అవకాశం ఉంది. పరీక్షలలో కూడా మంచిఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారులలో గుర్తింపును పొందుతారు. చేపట్టిన పనుల వలన మంచిపేరు లభిస్తుంది. నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. వ్యాపారస్తులకు బాగుంటుంది నూతన వ్యాపారఅవకాశాలు పొందుతారు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కళారంగంలో ఉన్నవారికి దూరప్రదేశాల నుండి అనుకూలమైన వార్తను వినే అవకాశం ఉంది. చాలాకాలం నుండి ఎదురుచూస్తున్న విషయంలో ఫలితాలు పొందుతారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కన్యా రాశి
ఈవారం మీరు కుటుంబసభ్యులతో సమయాన్ని సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో తీసుకొనే నిర్ణయాల్లో తొందరపాటువద్దు. చేపట్టిన పనులకు సంబంధించిన ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చును. ప్రయాణాలలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పకపోవచ్చును. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం బాగానే ఉంటుంది శ్రమను పెంచుట అనేది తప్పక ఉపయోగపడుతుంది. నూతన పనులను చేపట్టునపుడు నిదానం అవసరం. వారం మొత్తం మీద విద్యార్థులకు కొంత శ్రమను కలిగించే అవకాశం ఉంది. పరీక్షలలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఓపికను కలిగి ఉండుట మంచిది. చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చు ఆస్కారం ఉంది. ఉద్యోగులకు అధికారులతో మంచి సంబందాలు ఉండుట వలన మేలుజరుగుతుంది. పనులలో పనిభారం తప్పకపోవచ్చును. వ్యాపారస్తులకు మాములుగా ఉంటుంది నూతన ఆలోచనలు చేయునపుడు సాధ్యాసాధ్యాలు పరీక్షించుకోవడం మంచిపని. ప్రయోగాలు చేయకండి. కళారంగంలో ఉన్నవారికి పెద్దల సహకారం వలన నూతన అవకాశాలు లభించే అవకాశం ఉంది. వేచిచూసే దొరని తప్పక ఉపయోగపడుతుంది.

తులా రాశి

ఈవారం మీరు పనులను పూర్తిచేయుటకు ఉత్సాహంను కలిగి ఉంటారు వారం మొదట్లో ఆటంకాలు పొందినను చివరకు విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. పెద్దల సూచనలతో ముందుకు వెళ్ళుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో ఒక ప్రణాళికను కలిగి ఉండుట అనేది మేలుచేస్తుంది. కుటుంబంలో అందరితో మీ ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం చేయండి, నిర్ణయాల్లో తొందరపాటు పనికి రాదు. చర్చల్లో పాల్గొనాలనే ఆలోచన చేస్తారు. అకారణంగా కోపంను పొందుటకు అవకాశం ఉంది తగ్గించుకొనే ప్రయత్నం చేయండి మంచిది. సంప్రదాయాలకు విలువను ఇచ్చుటకు అవకాశం ఉంది. వారం మొత్తం మీద విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అనుభవం ఉపయోగపడ్తుంది. ప్రయత్నం పెంచుట వలన అనుకూలమైన మార్పులు కలుగుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగులు నూతన ప్రయత్నాలు ఆరంభిస్తారు, మార్పును కోరుకొనే అవకాశం ఉంది. నిరుద్యోగులు  చేయుప్రయత్నాలు పెద్దగా ఫలితాలు ఇవ్వకపొవచ్చును. వ్యాపారస్తులకు మాములుగా ఉంటుంది పద్దతి ప్రకారం ముందుకు వెళ్ళండి మేలుజరుగుతుంది. కళారంగంలో ఉన్నవారికి కొంత కాలం ఆగక తప్పదు, వచ్చిన పనుల వలన సంతృప్తిని పొందలేరు.


వృశ్చిక రాశి

ఈవారం మీరు బంధువులను,మిత్రులను కలుస్తారు వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఆరంభిస్తారు తలపెట్టిన ప్రయత్నాలను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు వాటికి ప్రాధాన్యం ఇస్తారు. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో సమయాన్ని గడుపుతారు. దూరప్రదేశాల నుండి వార్తను వినే అవకాశం ఉంది. పెద్దల సూచనల మేర నూతన ప్రయత్నాలు ఆరంభిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో అవకాశాలు వచ్చినను ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉండే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటి వలన కొంత లాభంను పొందుతారు. వారం మొత్తం మీద విద్యార్థులకు పెద్దగా ఆశించిన ఫలితాలు రాకపోగా ఇబ్బందులు తప్పక పోవచ్చును. పెద్దలకు మీయొక్క ఆలోచనలు తెలుపుట అనేది మేలుచేస్తుంది. ఉద్యోగులకు శ్రమ పెరుగుటకు అవకాశం ఉంది. అధికారుల వలన ఇబ్బందులు తప్పకపోవచ్చును. వ్యాపారస్తులకు బాగుంటుంది. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. కళారంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలతో సమయాన్ని సందడిగా గడిపే అవకాశం ఉంది.


ధనస్సు రాశి

ఈవారం మీరు ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవాకాశాలు పొందుతారు. రాజకీయవ్యవహరాల పట్ల మక్కువను కలిగే అవకాశం ఉంది. పెద్దలతో కలిసి పనులను చేపట్టుటకు ఆస్కారం ఉంది. సమయానికి భోజనం చేయుట అనేది సూచన అశ్రద్ద చేయకండి. తలపెట్టిన పనులను కొంత నిదానం అయినను పూర్తిచేసే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు పొందుటకు ఆస్కారం కలదు వాటిని అశ్రద్ద చేయకండి. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వాటికి సమయాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సమయాన్ని గడుపుతారు. వారం మొత్తం మీద విద్యార్థులు మిశ్రమఫలితాలు పొందుతారు. సమయాన్ని వ్యర్థం చేయకుండా ప్రణాళిక రూపొందించుకుంటే మంచిది. ఉద్యోగులకు అధికారులతో మంచి సంబందాలు కలిగి ఉండే అవకాశం ఉంది. చేపట్టిన ప్రయత్నాలలో ఆశించిన ఫలితాలు కొంతమేర సంపాదించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు బాగుంటుంది, పెద్దల సహకారం వలన కొత్త పనులు చేపడుతారు. కళారంగంలో ఉన్నవారికి వారి పరిచయాల వలన నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు.


మకర రాశి

ఈవారం మీరు చేపట్టిన పనులలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సోదరులనుండి మీరు ఆశించిన స్థాయిలో సహాకారం ఉండకపోవచ్చును అందుచేత కొంత అసంతృప్తిని పొందుతారు. విలువైన వస్తువులను ప్రయాణంలో పోగొట్టుకొనే అవకాశం ఉంది కావున మీ జాగ్రత్తలో మీరు ఉండుట సూచన. గతంలో మీరు చేసిన ఆలోచనల మూలాన కొంత పనిఒత్తిడిని పొందుటకు అవకాశం కలదు. ప్రయాణాల్లో స్వల్ప ఇబ్బందులు తప్పక పోవచ్చును. బంధుమిత్రులతో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం కలదు. వారం మొత్తం మీద విద్యార్థుల ఆలోచనల వలన విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది కావున పెద్దలు వారిని కనిపెట్టుకొని ఉండుట సూచన. ప్రోత్సాహం ఇవ్వడం వలన కొంత ముందుకు వెళ్ళగలరు. ఉద్యోగులకు అధికారులతో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను పూర్తిచేయుటలో కొంత ఇబ్బందిని పొందుతారు. వ్యాపారస్తులకు మిత్రులవలన నూతన అవకాశాలు పొందుతారు. మనోదైర్యంతో ముందుకు వెళ్ళండి ఫలితాలు అనుకూలంగా వచ్చుటకు అవకాశం ఉంది. కళారంగంలో ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు నూతన ప్రయత్నాలు చేయుముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట మంచిది.

కుంభ రాశి

ఈవారం మీరు ముఖ్యంగా తీసుకోబోయే ప్రతినిర్ణయంలో పెద్దల సూచనలు సలహాలను పాటించుట మంచిది. అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు వాటిని తగ్గిచుకొనే ప్రయత్నం చేయండి మంచిది. ఊహించని ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది కావున వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. ప్రయాణాలు చేయుట వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. తలపెట్టిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం కలదు. బంధుమిత్రులతో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. వారం మొత్తం మీద విద్యార్థులకు స్వల్పఆరోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది కొంత శ్రద్దతీసుకోండి. అకారణంగా కోపంను పొందుటకు అవకాశం కలదు కావున వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. ఉద్యోగులకు మాములుగా ఉంటుంది కాకపోతే సరైన ఆలోచనల్తో ముందుకు వెళితే మేలుజరుగుతుంది. వ్యాపారస్తులకు ధనమునకు సంబంధించిన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకోకండి. కళారంగంలో ఉన్నవారికి బాగుంటుంది. పెద్దలతో పరిచయాలు కలుగుతాయి వాటి వలన లాభంను పొందుతారు.

మీన రాశి
ఈవారం మీరు బంధుమిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉన్నను ఊహించన దానికన్నా అధికమైన ఖర్చులు కలుగుతాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పనులలో శ్రమను పొందుతారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ద చేయకండి. మాతృవర్గం వారితో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం కలదు. వారం మొత్తం మీద విద్యార్థులకు బాగుంటుంది కాకపోతే చదువు పైన అశ్రద్ద చేయకండి. సరైన నిర్ణయాలు తీసుకోండి దానివలన తప్పక మేలుజరుగుతుంది. మార్పులు కలుగుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారులతో గుర్తింపును పొందుతారు కాకపోతే అధికమైన శ్రమను కలిగి ఉండుట వలన సమయం సరిపొకపొవచ్చును. వ్యాపారస్తులకు కొత్త కొత్త ఆలోచనలు కలిగిఉండుటకు అవకాశం కలదు. పెద్దల సలహాలను పాటించుట వలన లాభం పొందుతారు. కళారంగంలో ఉన్నవారికి కొద్దిగా శ్రమను పొందుట వలన మంచి ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. కుటుంబంలో మీ ఆలోచనలకు సహాకారం ఉంటుంది, సమయాన్ని సంతోషంగా గడుపుతారు.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
aa mugguru