Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review - Heart Attack

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - పాండవులు పాండవులు తుమ్మెద

Movie Review - Pandavulu Pandavulu Tummeda

చిత్రం: పాండవులు పాండవులు తుమ్మెద
తారాగణం: మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌, హన్సిక, ప్రణీత, రవీనాటాండన్‌, వరుణ్‌ సందేశ్‌, తనీష్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌ తదితరులు
ఛాయాగ్రహణం: పళని కుమార్‌
సంగీతం: అచ్చు, బాబా సెహగల్‌, కీరవాణి
నిర్మాణం: లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ
దర్శకత్వం: శ్రీవాస్‌
నిర్మాతలు: మంచు మనోజ్‌, మంచు విష్ణు
విడుదల తేదీ: 31 జనవరి 2014

క్లుప్తంగా చెప్పాలంటే :
ముగ్గరు కుర్రాళ్ళకు (మనోజ్‌, తనీష్‌, వరుణ్‌ సందేశ్‌) పెంపుడు తండ్రి నాయుడు (మోహన్‌బాబు). మరోపక్క ఇద్దరు కుర్రాళ్ళు (విష్ణు, వెన్నెల కిషోర్‌)లకీ పెంపుడు తల్లి (రవీనాటాండన్‌) వుంటుంది. ఒక గ్రూప్‌, ఇంకో గ్రూప్‌తో గొడవ పడుతుంది. అలా ఆ గొడవ, నాయుడికి తెలుస్తుంది. తన పెంపుడు పుత్ర రత్నాలతో గొడవపడుతున్నదెవరో తెలుసుకోవాలనే ప్రయత్నంలో నాయుడికి ఓ షాకింగ్‌ న్యూస్‌ తెలుస్తుంది వేరే గ్రూప్‌కి పెంపుడుతల్లి అయిన మహిళ గురించి. ఆమె ఎవరు? ఆమెకీ నాయుడికీ వున్న సంబంధమేంటి? అన్నది మిగతా కథ.

మొత్తంగా చెప్పాలంటే :
విలక్షణ నటుడు మోహన్‌బాబు, నటనలో తనదైన విలక్షణత ప్రదర్శించి, సినిమాకి హైలైట్‌గా నిలిచారు. చాలాకాలం తర్వాత ఆయన తెరపై పూర్తిస్థాయి పాత్రలో కన్పించడంతోపాటు, తనదైన నటనతో ఆకట్టుకుంటారాయన. విష్ణు తన పాత్రకు న్యాయం చేశాడు. మనోజ్‌ సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు. మోహిని పాత్రలో మెచ్యూర్డ్‌ పెర్ఫామెన్స్‌ ప్రదర్శించాడు. నటన అద్భుతంగా చేసాడు. సినిమా పూర్తయ్యాక చాలా సేపు గుర్తుండేది మనోజ్ పాత్రే. తనీష్‌ పాత్ర తేలిపోయింది. వరుణ్‌ సందేశ్‌కి పెద్దగా నటించేందుకు అవకాశం లేని పాత్ర దక్కింది. నిన్నటితరం హీరోయిన్‌ రవీనాటాండన్‌ అందంగా కన్పించింది. ఉన్నంతలో తన పాత్రతో ఆకట్టుకుంటుంది. సీనియర్‌ నటిగా ఆమెకు ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు రావొచ్చు. హన్సిక ఓకే. ప్రణీత గ్లామరస్‌గా కన్పించింది. అలీ, వెన్నెల కిషోర్‌... ఇలా మిగతా నటీ నటులంతా తమ పాత్రలకు తగ్గట్టుగా పెర్ఫామెన్స్‌ ఇచ్చారు. హాస్యం పండించే విషయంలో తలో చెయ్యీ వేశారు ఆర్టిస్టులంతా.పాటలు బాగున్నాయి, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సన్నివేశాల్ని ఎలివేట్‌ చేసింది. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించడంతో రిచ్‌నెస్‌ వచ్చింది. డైలాగ్స్‌ బాగానే వున్నాయి. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. సెకెండాఫ్‌లో ఎడిటింగ్‌ టీమ్‌ ఇంకాస్త గట్టిగా పనిచేయాల్సింది. లొకేషన్స్‌ రిచ్‌గా వున్నాయి. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి హెల్పయ్యాయి.

బాలీవుడ్‌ సినిమా గోల్‌మాల్‌కి ఫ్రీమేక్‌... అన్న ప్రచారం జరిగింది ఈ సినిమాకి. ఆ సినిమా పోలికలు ఈ సినిమాలో చాలానే వున్నాయి. ఫ్రీమేక్‌ కాదని చెప్పినా, సినిమా చూస్తోంటే గోల్‌మాల్‌ చూసినవారికి తెలుగు వెర్షన్‌ చూస్తున్నట్లనిపించింది కొన్ని సన్నివేశాల్లో. అయితే నటీనటులు గోల్‌మాల్‌ ఛాయలు కన్పించకుండా స్ట్రెయిట్‌ సినిమా చూస్తున్నామన్న ఫీల్‌ వచ్చేలా తెరపై అలరించారు. గోల్మాల్ కథని గోల్మాల్ చేసి తెలుగైజ్ చేసిన బి బీ ఎస్ రవి, సంభాషణలతో కోన వెంకట్, గోపీ మోహన్ లు సినిమాని నిలబెట్టారు.

కామెడీని దర్శకుడు బాగా డీల్‌ చేశాడు. గోల్‌మాల్‌ హిట్‌ అవడంతో కథ దాదాపుగా అందరికీ తెలిసిందే అయినా, కామెడీతో సినిమాని ఒడ్డున పడేశాడు దర్శకుడు. సంగీతం నుంచి ఎడిటింగ్‌ దాకా అన్ని విభాగాల్నీ సమర్థవంతంగా వాడుకోవడంతో, టోటల్‌ ఔట్‌ పుట్‌ దర్శకుడు బాగా తెచ్చుకోగలిగాడు. ఆయా పాత్రల్ని దర్శకుడు ఎలివేట్‌ చేసిన తీరు బావుంది. తనీష్‌, వరుణ్‌ సందేశ్‌లకు మాత్రం తగిన ప్రాధాన్యత దక్కలేదు. అయినా అది సినిమాకి మైనస్‌గా అన్పించదు.

ఒక్కమాటలో చెప్పాలంటే :

ఓవరాల్‌గా ఓ మోస్తరు అంచనాలతో సినిమాకి వెళితే హాయిగా ఎంజాయ్‌ చెయ్యొచ్చు.

అంకెల్లో చెప్పాలంటే : 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Kajal Aggarwal