Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pedarayudu+yamadharmaraaju 'rowdy'

ఈ సంచికలో >> సినిమా >>

మూడ్‌ రావాలంటోన్న పవన్‌కళ్యాణ్‌

pawan kalyan

కొత్త సంవత్సరం వచ్చి, ఓ నెల దాటేసింది. రెండో నెలలో కూడా ముహూర్తం ఫిక్స్‌ అవలేదు. మూడో నెలలో అయినా ముహూర్తం ఖరారవుతుందో లేదోనని ‘పవర్‌స్టార్‌’ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళన ‘గబ్బర్‌సింగ్‌`2’ సినిమా గురించే. ‘అత్తారింటికి దారేది’ సినిమాతో ఇండస్ట్రీని షేక్‌ చేసిన పవన్‌కళ్యాణ్‌, మరోమారు ఆ రేంజ్‌ హిట్‌ ఎప్పుడిస్తాడోనని పవన్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆల్రెడీ ‘గబ్బర్‌సింగ్‌’ పెద్ద హిట్‌ అవడంతో, ఆ సినిమాకి సీక్వెల్‌గా రానున్న‘గబ్బర్‌సింగ్‌`2’ పైన కూడా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. సంపత్‌ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. స్క్రిప్ట్‌ సహా అన్నీ సిద్ధమైపోయినా, పవన్‌ సరైన మూడ్‌ కోసం ఎదురు చూస్తున్నాడట. ఎడా పెడా సినిమాలు చేసే టైప్‌ కాదు పవన్‌కళ్యాణ్‌. అందుకే, సినిమా మూడ్‌లోకి వెళ్ళాకనే, సెట్స్‌ మీదకు వెళ్ళాలన్నది పవన్‌ ఆలోచన అట.

పవన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఎప్పుడు ఇస్తాడా? అని సినిమా యూనిట్‌ ఎదురు చూస్తోంది. పవన్‌ ఓకే అంటే సెట్స్‌పైకి వెళ్ళడానికి పెద్దగా టైమ్‌ ఏమీ పట్టదట. మార్చ్‌లో సినిమా సెట్స్‌ మీదకు వస్తుందన్నది తాజా కబురు.

మరిన్ని సినిమా కబుర్లు
music based