Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
music based

ఈ సంచికలో >> సినిమా >>

‘హృదయకాలేయం’ అసలు ఏ రకం?

hrudaya kaleyam

కొన్నాళ్ళ క్రితం ‘హృదయకాలేయం’ అనే సినిమా వస్తోందని తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇదేం టైటిల్‌ అనుకున్నారు కొందరు, పేరూ ఊరూ లేని హీరో.. అని అనుకున్నారు ఇంకొందరు. తీరా సినిమా ట్రెయిలర్‌ వచ్చేసరికి షాక్‌ తిన్నారంతా. ‘సంపూ’ అన్న పేరు మార్మోగిపోయింది. ఇంటర్నెట్‌లో అయితే స్టార్‌ హీరోల సినిమా ట్రెయిలర్లకన్నా ఎక్కువగా ఈ ట్రెయిలర్‌కి రెస్పాన్స్‌ రావడమే దానికి కారణం.

కానీ, సినిమా ఇప్పటిదాకా వెలుగు చూడలేదు. అదెలా వుంటుందో ఎవరికీ తెలియదు. కామెడీ బేస్డ్‌ మూవీ అని అందరికీ అర్థమవుతోంది. అయితే సినిమా సీరియస్‌గా వుంటుందని, కొత్త జోనర్‌ సినిమా అనీ అంటున్నారిప్పుడు సినిమా గురించి కాస్తో కూస్తో తెలిసినవారు. తెరపై పాత్రలు సీరియస్‌గా వ్యవహరిస్తోంటే, చూసే ప్రేక్షకులకు నవ్వొస్తుందట.

డిఫరెంట్‌ మూవీస్‌ని ప్రేక్షకులు బాగానే రిసీవ్‌ చేసుకుంటారు కాబట్టి, ‘హృదయకాలేయం’ కొత్త తరహాలో ఉండి, సినిమాలో కంటెంట్‌ ఉంటే ప్రేక్షకాదరణ పొందే అవకాశం ఉంది. సినిమాకి ముందు ఎలాంటి కామెంట్స్‌ వచ్చినా, సినిమా విడుదలయ్యాకే అసలు రంగు తెలుస్తుంది. అప్పుడుగాని సినిమా ఏ రకం? అనేదానిపై స్పష్టత రాదు.

 

మరిన్ని సినిమా కబుర్లు
100 crore RK Media Movies