Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
hrudaya kaleyam

ఈ సంచికలో >> సినిమా >>

100 కోట్లతో ఆర్కే మీడియా చిత్రాలు

100 crore RK Media Movies

సినిమా నిర్మాణం కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త సంస్థలు నిర్మాణ రంగంలోకి వస్తున్నాయి. కొన్ని నిలదొక్కుకుంటున్నాయి, కొన్ని గల్లంతవుతున్నాయి. ప్లానింగ్‌తో సినిమాలు తీస్తే, మొదటి సినిమాతోనే నిర్మాణ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుతున్నాయి కొన్ని సంస్థలు. అలా తెలుగు సినిమా నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేయడానికి ‘ఆర్‌కె మీడియా’ సిద్ధమవుతోంది.

ఇప్పటివరకూ పీఆర్‌ యాక్టివిటీస్‌కి పరిమితమైన ఆర్‌కె మీడియా సంస్థ, భారీ చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుడుతోందట. ఈ బ్యానర్‌లో ప్రెస్టీజియస్‌ మూవీస్‌ చేయాలని ఆర్‌ కె మీడియా సంస్థ తరఫున రవికుమార్‌ పనస ప్లాన్‌ చేస్తున్నారు. దీనికోసం భారీగా ఫండింగ్ కూడా సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం.

రవికుమార్‌ పనసకి తెలుగు సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖ హీరోలు, దర్శకులతో సన్నిహిత సంబంధాలు వున్నాయి. ఈ నేపథ్యంలో మంచి ప్లానింగ్‌తో సినిమాలు చేస్తే, ప్రెస్టీజియస్‌ మూవీస్‌ వాటంతట అవే వస్తాయని ఆశించవచ్చు. త్వరలోనే ఆర్‌కె సంస్థ నుంచి వచ్చే సినిమాల గురించిన పూర్తి వివరాలు వెల్లడి అవుతాయట.

 

మరిన్ని సినిమా కబుర్లు
sishyulu sare mari guruvo