Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Book Review - kanyasulkam lo vaduka matalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (ఫిబ్రవరి 07 - ఫిబ్రవరి 13) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు బంధువులు, మిత్రులతో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు ఆస్కారం ఉంది. సోదరవర్గం నుండి ఆశించిన స్థాయిలో సహాకారంను పొందకపోవచ్చును. రాజకీయవ్యవహారాల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. కొత్తకొత్త ఆలోచనలు కలిగిఉండి వాటిని పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఇతరులకు మాట ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట మంచిది. భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగిఉంటారు. విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది ఫలితాలు అనుకూలంగా వచ్చుటకు ఆస్కారం కలదు. పోటిపరీక్షల విషయంలో చక్కటి ప్రణాళిక కలిగిఉండుట మంచిది. ఉద్యోగులకు అధికారులతో మంచిసంబంధాలు కలిగిఉండే అవకాశం ఉంది. స్థానచలనం పొందుటకు అవకాశం కలదు. వ్యాపారస్థులకు బాగుంటుంది ఆశించిన లాభాలు పొందుతారు. నూతన ప్రయత్నాలలో విజయం ఉంటుంది. కళారంగంలోని వారికి పెద్దలసూచనలు, సలహాలను పాటించుట వలన మేలుజరుగుతుంది.

వృషభ రాశి

ఈవారం మీరు భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగిఉంటారు. ఆలోచనలను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన విషయల్లో జాగ్రత్తగా ఉండుట మంచిది. నూతన ప్రయత్నాలను చేయునపుడు పెద్దల సూచనలు సలహాలను పాటించుట వలన మేలుజరుగుతుంది. ఉత్సాహంను కలిగిఉండి పనులను ఆరంభించే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించిన దానికన్నా అధికమైన ఖర్చును పొందుతారు. విద్యార్థులకు పనిభారంను పొందుటకు అవకాశం ఉంది. పెద్దలతో మీ ఆలోచనలను పంచుకోండి వారుచెప్పిన విధంగా నడుచుకోండి మేలుజరుగుతుంది. ఉద్యోగులకు పనిబారం ఉన్నను తలపెట్టిన పనులను పూర్తిచేయగలుగుతారు. పెద్దలతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. నూతనప్రయత్నాలు చేయకండి. కళారంగంలోని వారికి మంచిఅవకాశాలు పొందుతారు.


మిథున రాశి
ఈవారం మీరు బంధువులగృహంలో సమయాన్ని గడుపుతారు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విందులలో పాల్గొనే అవకాశం ఉంది. పనులకు సంబంధించిన విషయాల్లో అధికమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది వాటిని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి. అధికారులతో ఇబ్బందులు తప్పకపోవచ్చును కావున సర్దుకుపోవడం మంచిది. నూతన ప్రయత్నాలు చేయుముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుట మంచిది. కుటుంబంలో నూతన నిర్ణయాలు చేయకండి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి, ఒకటికి రెండు సార్లు చేయుట వలన పనులు పూర్తిఅవుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడి తప్పక పోవచ్చును సాధ్యమైనంత వరకు అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. వ్యాపారస్థులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి. అనుకున్న పనులు చేయడానికి సమయం పడుతుంది. కళారంగంలోని వారికి అనుకూలమైన సమయం ఓపికను కలిగి ఉండుట సూచన.

కర్కాటక రాశి

ఈవారం మీరు నూతన ప్రయత్నాలను చేసి విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. దూరప్రదేశాలనుండి వార్తను వినే అవకాశం ఉంది. వారం చివరల్లో మాత్రం ఆలోచనలు అదుపులో ఉండకపోవచ్చును కావున జాగ్రత్త వహించుట మంచిది. కుటుంబంలో భాగస్వామికి అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోండి. తోటివారు మీ ఆలోచనలను వ్యతిరేకించే అవకాశం కలదు సర్దుబాటు విధానం అవసరం. విద్యార్థులకు చక్కటి ప్రణాళిక అవసరం లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఊహించని ఖర్చులు కలుగుతాయి ఫలితాలు మాత్రం సంతృప్తిని ఇవ్వకపొవచ్చును. ఉద్యోగులకు వివిధరూపములుగా ఆటంకాలు పొందుతారు నూతన ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. వ్యాపారస్థులకు ఖర్చులు పెరుగుతాయి తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. కళారంగంలోని వారికి వివాదముల వలన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త.


సింహ రాశి

ఈవారం మీరు కొత్త కొత్త ఆలోచనలను కలిగిఉండి వాటిని పూర్తిచేయాలనే తలంపుతో ఉండుటకు అవకాశం ఉంది. నచ్చినవారిని కలుస్తారు వారితో సంప్రదింపులు చేసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది తలపెట్టిన పనులలో ఆశించిన స్థాయిలో లాభాలు పొందుతారు. అనుకున్న సమయానికి పనులను పూర్తిచేయుట ద్వార గుర్తింపును కలిగిఉంటారు. కుటుంబంలో స్వల్పమనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది తెలివితో ఎదుర్కోండి. విద్యార్థులకు అనుకూలమైన కాలం, చక్కటి ప్రణాళికతో ముందుకు వెళితే తప్పక ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు చాలాకాలంగా ఆగిఉన్న పనులు పూర్తిఅవుతాయి అలాగే అధికారులతో మంచిసంబంధాలు ఏర్పడుతాయి. వ్యాపారస్థులకు లాభాలు ఉంటాయ.  పెట్టుబడులు పెట్టుటకు అవకాశం ఉంది సంతోషంను పొందుతారు. కళారంగంలోని వారికి దూరప్రదేశాల నుండి ఆశించిన వార్తలను వినే అవకాశం ఉంది.

 

కన్యా రాశి

ఈవారం మీరు తలపెట్టిన పనులు మందకొడిగా సాగుటకు అవకాశం ఉంది. ఫలితాల విషయంలో అసంతృప్తిని పొందకుండా వేచిచూసే దోరణి మంచిది. శ్రమించుట మేలుచేస్తుంది ప్రయత్నం మంచిది. వారం చివరలో కొంత సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. చర్చాసంబందమైన విషయాల్లో పాల్గొనాలనే తలంపును కలిగి ఉంటారు. ఊహించని ఖర్చులను పొందుతారు, స్వల్ప అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు మంచికాలమే కాకపోతే ప్రణాళిక అవసరం. పొదుపుగా మాట్లాడితే తప్పక అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు పొందుతారు కాకపోతే ఊహించని ఖర్చులు పెరుగుతాయి, గతంలో తీసుకున్న ఋణముల విషయంలో ఇబ్బందులు తప్పకపోవచ్చును. వ్యాపారస్థులకు నిదానంగా పనులు కదులుతాయి నష్టమైతే ఉండదు. కళారంగంలోని వారికి కుటుంబ పరంగా బాగుంటుంది అవకాశాలు పెరుగుతాయి, పనిభారం ఉంటుంది.

 

తులా రాశి

ఈవారం మీరు నలుగురిలో ఆశించిన స్థాయిలో గుర్తింపును పొందుటకు ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులు కొంత నిదానంగా కదులుటకు అవకాశం ఉంది. పెద్దల సూచనలు పాటించుట, దైవభక్తి చాలా అవసరం గుర్తుపెట్టుకోండి. కుటుంబసభ్యుల వలన మిత్రుల వలన సంతోషంను పొందుతారు వారితో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ద వహించుట మంచిది. విద్యార్థులు అనవసరపు తప్పిదాలు చేసే అవకాశం ఉంది, ఈ విషయంలో తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోండి. పోటీపరీక్షల విషయంలో అశ్రద్ద కూడదు. ఉద్యోగులకు మాటద్వారా పనులు అయ్యే అవకాశం కలదు. నూతన ఆలోచనలు కలిగుంటారు. వ్యాపారస్థులకు మాములుగా ఉంటుంది. పనిభారం ఉంటుంది, కోపంను అదుపులో పెట్టుకొనుట మంచిది. కళారంగంలోని వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కలదు. ఆరంభించిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది.

 

వృశ్చిక రాశి

ఈవారం మీరు ఉత్సాహంను కలిగిఉండి నూతన పనులను చేపడుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుట సూచన. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు. తలపెట్టిన పనులలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగినను చివరకు విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. దూరప్రదేశం నుండి లేదా బంధువుల నుండి ఒకవార్త వింటారు. విద్యార్థులకు అనారోగ్యపరమైన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. పనులపట్ల శ్రద్ద తగ్గుతుంది. ఉద్యోగులకు అధికమైన శ్రమను కలిగిఉంటారు, స్థలమార్పిడికి అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే భాదను పొందుతారు ఓపిక అవసరం. వ్యాపారస్థులకు అననుకూలమైన కాలం నూతన ఆలోచనలు చేయకపోవడం మంచిది, నిదానం అవసరం.  కళారంగంలోని వారికి నూతన అవకాశాలు కలుగుతాయి కాకపోతే ఒత్తిడిని కూడా కలిగిఉంటారు.


ధనస్సు రాశి

ఈవారం మీరు పెద్దల ద్వారా చాలావరకు మీ పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసుకోగలుగుతారు. చిన్న చిన్న పనులు పూర్తికాకపోవచ్చును ఆమాత్రం దానికే హైరానా పడకపోవడం మంచిది. ఆర్థికపరమైన విషయంలో వారంచివరలో ఆశించిన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. నలుగురితో కలిసి కొత్త కొత్త ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. అనుభవజ్ఞుల సూచనలు పాటించుట తప్పక అనుకూలిస్తుంది. విద్యార్థులకు మంచికాలం. మీలక్ష్యాలకు సంబంధించిన విషయాల్లో ఓక అడుగును ముందుకు వేయగలుగుతారు. ఆశించిన ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు నూతన పర్యటనలు కలిసి వస్తాయి పనులను కూడా పూర్తిచేయగలరు. వ్యాపారస్థులకు నూతన ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలు ఇచ్చుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికి పెద్దల పరిచయం కలుగుతుంది. నూతన అవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది.


మకర రాశి

ఈవారం మీరు వారం చివరలో చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువుల విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి నష్టపోయే అవకాశం ఉంది. భోజనం విషయంలో అశ్రద్ద చేయకండి. నచ్చిన వ్యక్తులను కలుస్తారు వారితో చర్చలు జరుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు అయ్యే అవకాశం ఉంది కావున జాగ్రత్తతో ఉండుట మంచిది. విద్యార్థులకు శ్రమను పొందుట ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ప్రయత్నం పెంచుట వలన పోటీపరీక్షల్లో విజయం సాదిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం కాకపోతే ప్రయాణాలు చేయవలసి రావోచ్చును ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యాపారస్థులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. కళారంగంలోని వారికి ఊహాంచిన ఖర్చులు పెరుగుతాయి ధనము, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండుట మంచిది.

కుంభ రాశి

ఈవారం మీరు ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందలేకపోవచ్చును. మీ అనుకున్న వారితో విభేదాలు జరుగుటకు అవకాశం ఉంది కావున మీరు మాట్లాడేటప్పుడు బాగాఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనారోగ్యసమస్యలు పొందుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులలో పనిఒత్తిడిని కలిగిఉండే అవకాశం ఉంది. ఒకవార్త ఒకింత భాధకు గురిచేసే అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విద్యార్థులకు బాగుంటుంది కాకపోతే ఒక పనితర్వాత మరొక పనిని అరంభించే ప్రయత్నం మంచిది. ఉద్యోగులకు నూతన అవకాశలు లభిస్తాయి ప్రయత్నం పెంచుట ఉత్తమం. అందరిని కలుపుకుని వెళ్ళుట వలన లాభం ఉంటుంది. వ్యాపారస్థులకు నిరాశను కలిగించే ఫలితాలు రావడానికి అవకాశం ఉంది కావున నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం సూచన. కళారంగంలోని వారికి మిశ్రమఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ద వహించుట మంచిది.


మీన రాశి
ఈవారం మీరు నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. వారం చివరలో అసంతృప్తి పెరుగుతుంది ఓపిక అవసరం అని గుర్తించుకోండి. ధనము విషయంలో నూతన అవకాశాలు పొందుతారు సంతృప్తి ఉంటుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. పనిఒత్తిడిని కలిగిఉండుట చేత సమయానికి భోజనం చేయలేక పోవచ్చును. సమయపాలన అవసరం. కొన్నివిషయాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం వలన నిరుత్సాహంను పొందుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చును. అధికమైన శ్రమను పొందితే కొన్ని పనులు ముందుకు కదులుతాయి. నిదానం అవసరం. ఉద్యోగులకు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఒకటికిరెండు సార్లు ఆలోచించుట మంచిది. వ్యాపారస్థులకు బాగుంటుంది పెద్దలతో పరిచయాల మూలాన నూతన అవకాశాలు పొందుతారు. కళారంగంలోని వారికి అవాకాశాలు ఊరించే అవకాశం ఉంది. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో మాత్రం జాగ్రత్త అవసరం.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Love