Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Patashala-11 by bhaskarabhatla

ఈ సంచికలో >> సినిమా >>

పైసా - చిత్ర సమీక్ష

Movie Review - Paisa

చిత్రం: పైసా
తారాగణం: నాని, కేథరీన్‌, సిద్ధికా శర్మ, చరణ్‌ రాజ్‌, రాజా రవీంద్ర, భరత్‌, తబర్‌, రాజు, దువ్వాసి మోహన్‌, హరికృష్ణ, ఉపేన్‌ రెడ్డి తదితరులు
ఛాయాగ్రహణం: సంతోష్‌ రాజ్‌
సంగీతం: సాయి కార్తీక్‌
నిర్మాణం: ఎల్లో ఫ్లవర్స్‌
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: పుప్పాల రమేష్‌
విడుదల తేదీ: 7 ఫిబ్రవరి 2014

క్లుప్తంగా చెప్పాలంటే :

షేర్వానీ మోడల్‌ ప్రకాష్‌ (నాని)ని నూర్‌ (కేథరీన్‌) ప్రేమిస్తుంది. కానీ, బోల్డంత డబ్బు సంపాదన మీద యావ తప్ప, తనను ప్రేమిస్తోన్న అమ్మాయిని పట్టించుకోడు ప్రకాష్‌. సీఎం రేసులో వున్న పొలిటీషియన్‌ (చరణ్‌రాజ్‌) కుమార్తె స్వీటీ (సిద్ధికా శర్మ)ను పెళ్ళి చేసుకుంటే ఆర్థికంగా తాను ఉన్నత స్థానానికి చేరుకుంటాననే ఆలోచనలు ప్రకాష్‌ మదిలో మెదులుతాయి. ఇంతలోనే అనుకోని ఘటన జరుగుతుంది. నూర్‌ని ఓ ఆపద నుంచి రక్షించే క్రమంలో ఆమెతోపాటు స్వీటీ తండ్రికి చెందిన పెద్దమొత్తంలోని సొమ్ముతో ఎస్కేప్‌ అవ్వాల్సి వస్తుంది ప్రకాష్‌కి. అక్కడినుంచి కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? నూర్‌ ` ప్రకాష్‌ల మధ్య ప్రేమ ఏమయ్యింది? ఇదంతా మిగతా కథ.

మొత్తంగా చెప్పాలంటే :
సినిమాలో తన పాత్రను చాలా ఈజ్‌తో చేశాడు నాని. ప్రకాష్‌ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. సహజంగా కృష్ణవంశీ సినిమాలో నటిస్తే ఏ నటికైనా, నటుడికైనా నటనలో పరిణతి దానంతట అదే వచ్చేస్తుంది. నాని ఇప్పటికే నటుడిగా ప్రూవ్‌ చేసుకున్నాడు గనుక, అతనికి కృష్ణవంశీ సినిమా ఇంకా ప్లస్‌ అవుతుంది నటుడిగా.

కేథరీన్‌ అందంగా కన్పించింది. ఆమె కళ్ళు ఆడియన్స్‌ని కట్టి పడేస్తాయి. ఆమె పాత్రకి ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతారు. కృష్ణవంశీ సినిమాల్లో హీరోయిన్ల గ్లామర్‌ గురించి అందరికీ తెల్సిందే. ఈ సినిమాలోనూ హీరోయిన్లు కృష్ణవంశీ బ్రాండ్‌కి తగ్గట్టుగానే వున్నారు. గ్లామరస్‌గా కన్పించడంలో సిద్ధిక మంచి మార్కులేయించుకుంటుంది. రాజా రవీంద్ర సర్‌ప్రైజ్‌ చేస్తాడు. చరణ్‌ రాజు తన పాత్రకు న్యాయం చేశాడు. భరత్‌ ఓకే. సుబ్రహ్మణ్యం ఫర్వాలేదు. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధుల మేర ఫర్వాలేదన్పించారు.

డైలాగ్స్‌ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి ప్లస్‌ అయ్యింది. రెండు పాటలు సంగీత పరంగా, విజువల్‌గా బావున్నాయి. సినిమాకి మెయిన్‌ స్ట్రెంగ్త్‌ సినిమాటోగ్రఫీ. కృష్ణవంశీ మార్క్‌ పిక్చరైజేషన్‌ ఆడియన్స్‌ని కట్టిపడేస్తుంది. ఎడిటింగ్‌ ఓకే. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి తమవంతుగా తోడ్పాటునందించాయి.

కథ, కథనం రెండూ బాగానే వున్నాయి. ఫస్టాఫ్‌ సరదా సరదాగా సాగిపోతుంది, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఇంట్రెస్టింగ్‌గా వుంది. సెకెండాఫ్‌ కొంచెం పేస్‌ తగ్గినా, క్లయిమాక్స్‌కి వచ్చేసరికి సినిమా పుంజుకుంది. రొమాంటిక్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కలగలిసిన థ్రిల్లర్‌ని రూపొందించిన దర్శకుడు, ఎక్కడా బోర్‌ కొట్టకుండా చేయగలిగాడు. ఓవరాల్‌గా చూస్తే మాస్‌నీ, క్లాస్‌నీ మెప్పించేలానే వుంటుంది సినిమా. బాక్సాఫీస్‌ వద్ద విజయఢంకా మోగించడానికి తగినంత మెటీరియల్‌ సినిమాలో వుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే : పైసా... ఆడియన్స్‌కి గిట్టుబాటే

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Adah Sharma