Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope February 14- February 20

ఈ సంచికలో >> శీర్షికలు >>

వింత జబ్బులు - బన్ను

Vinta Jabbulu

రోజుల్లో మనకొచ్చే జబ్బులు వింతగా ఉంటున్నాయి. నిజం చెప్పాలంటే ఆ జబ్బులు ఎందుకు వస్తున్నాయో డాక్టర్స్ కి కూడా తెలియటంలేదు. మొన్నీమధ్య మా మామగారికి కడుపులో నొప్పంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాము. ఓ పేరుమోసిన డాక్టర్ 'ఎండోస్కోప్' చేసి "మీ మామగారు డ్రింకింగ్ మానకపోతే చాలా డేంజర్ అండీ ..." అన్నారు. నేను, మా ఆవిడ మొహా మొహాలు చూస్కుంటుంటే ఆయన, నాకు తెల్సండీ ... అది అంత తేలిక కాదు - కానీ మానాల్సిందే, లేదంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని బదులిచ్చి కుర్చీలో వెనక్కి వంగి నిట్టూర్చాడు. కాస్త తేరుకుని "మీకో విషయం డాక్టర్ ... అయన పుట్టాక డ్రింక్ చెయ్యలేదు" అంది మా ఆవిడ.

"వాట్? ఈయనికి లివర్ ప్రాబ్లం వుంది..." అంటూ విచిత్రంగా మా వంక చూసాడు. నిజంగానే ఆయన తాగరు. మా కుటుంబం మొత్తానికి తెలుసు. ఇటీవలే స్వర్గస్తులైన సినీ నటులు AVS గారు కూడా డ్రింక్ చెయ్యరు. ఆయన లివర్ ప్లాంటేషన్ కూడా చేయించుకున్నారు. ఆయన కుమార్తె డొనేట్ చేసిన విషయం మనకు తెలిసిందే!

స్మోక్ చెయ్యని వాళ్ళకు ఊపిరితిత్తుల జబ్బులు, హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. అంతా వింతగా మారిపోయింది. మనిషి ఎన్నాళ్ళు బ్రతికేది మనం నిర్ణయించేది కాదని తెలుసు. కానీ మానవ ప్రయత్నంగా మనం కనీసం "వ్యాయామం" చెయ్యటం లేదు. ఎవడు నడుస్తాడు అంటూ 'త్రెడ్ మిల్' మీద 10 ని॥లు ఉండడమో , కేరళ మసాజ్ కెళ్లి వ్యాయామం అవసరం లేదనుకోవటం తప్పు ! 'ప్రాణాయామం' , 'వాకింగ్' చక్కటి గాలిలో చేస్తే మంచిదని మనందరికీ తెలిసినా ... బద్దకిస్తున్నాము.

స్వర్గీయ డా॥ కంభంపాటి స్వయం ప్రకాష్ ఓ మాటన్నారు. 'వింత జబ్బు మనకొస్తే విషాదం ..... పక్కోడి కోస్తే వినోదం' అని!! ఆలోచిస్తే అందులో ఎంత అర్ధం వుందో అర్ధమవుతుంది!

మరిన్ని శీర్షికలు
duradrushtapu dongalu