Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aditya hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

హిట్ కాంబినేషన్

hit combination

'రాజ మౌళి! ' ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న మాట్. అపజయమే ఎరుగని దర్శకునిగా రాజమౌళి ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. ప్రభాస్ తో తీస్తున్న ' బాహుబలి ' సినిమా చిత్రీకరణలో యమ బిజీగా ఉన్న దర్శకుడు రాజమౌళి. ఈ ' బాహుబలి ' సినిమాకు సంగీతం కీరవాణి అందిస్తున్నారు. ' స్టూడెంట్ నెం. 1 ' నుండి ' ఈగ ' సినిమా వరకు రాజమౌళి చేసిన తొమ్మిది సినిమాలకు కీరవాణి సంగీత దర్శకునిగా వున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కీరవాణి, రాజమౌళిది హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.

ఒక సినిమా విజయం సాధించడం లో దర్శకుడితోబాటు సంగీత దర్శకుడు కూడా ముఖ్య పాత్ర వహిస్తాడు. అలాగే ఒక దర్శకుడికి, సంగీత దర్శకుడికి మంచి అవగాహన, సమన్వయం ఉంటే, ఎన్నో మంచి సినిమాలు రూపు దిద్దుకుంటాయి. అలాంటి హిట్ కాంబినేషన్ గల దర్శకులు ,  సంగీత దర్శకులు మన చిత్రసీమలో ఉన్నారు. వారెవరంటే -

సీనియర్ దర్శకుడు వంశీ, ఇళయరాజాల కాంబినేషన్ లో మొత్తం పదకొండు సినిమాలు రాగా అందులో ' సితార, అన్వేషణ, లేడీస్ టైలర్, ఏప్రిల్ ఒకటి విడుదల, శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, చెట్టు కింద ప్లీడరు, సినిమాలు విజయం సాధిస్తే, మహర్షి, ప్రేమించు-పెళ్ళాడు, ఆలాపన, డిటెక్టివ్ నారద, అనుమానాస్పదం, సినిమాలు అపజయం పాలైనప్పటికీ ఇప్పటికీ ఇందులోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకులని అలరిస్తున్నాయి.

కె.విశ్వనాథ్, కె.వి.మహదేవన్ కాంబినేషన్ లో ఎన్నో ఆణిముత్యాలు వచ్చాయి. వాటిలో 'సిరిసిరి మువ్వ, శంకరాభరణం, సప్తపది, సీతామాలక్ష్మి, సిరి వెన్నెల, స్వాతి కిరణం, శుభలేఖ, తదితర సినిమాలున్నాయి. అలాగే, విశ్వనాథ్, ఇళయరాజా ల కాంబినేషన్ లో సాగర సంగమం, స్వాతిముత్యం, స్వర్ణ కమలం, సినిమాలు హిట్ కాగా, వెంకటేష్ తో తీసిన చిన్నబ్బాయి ఫ్లాపైంది.

కె.రాఘవేంద్ర రావు కీరవాణిల కాంబినేషన్ లో ' ఘరానా మొగుడు, అల్లరి ప్రియుడు, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అన్నమయ్య, శ్రీరామదాసు, పెళ్ళిసందడి, బొంబాయి ప్రియుడు, సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.

బాపు, కె.వి.మహదేవన్ ల జోడి ' సాక్షి, ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, పెళ్ళిపుస్తకం, తదితర హిట్ సినిమాలు ఉన్నాయి.

ఇప్పటి హిట్ కాంబినేషన్ లో శ్రీను వైట్ల, దేవిశ్రీ ప్రసాద్ లతో  ' ఆనందం, రెడీ, కింగ్, వెంకీ, సొంతం, నమో వెంకటేశా, అందరివాడు, తదితర సినిమాలున్నాయి.

ఇక తేజ, ఆర్. పి. పట్నాయక్ ల జోడీ ' చిత్రం, నువ్వు-నేను, జయం, ఫ్యామిలీ సర్కస్, ఔనన్నా-కాదన్న ' సినిమాలు చేసారు.

చక్రి, పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో ' బాచి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమా నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, ఆంధ్రావాలా, దేశముదురు, తదితర సినిమాలున్నాయి. ఇక చక్రి, సీనియర్ దర్శకుడు వంశీల జోడీ ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, దొంగరాముడు అండ్ పార్టీ, కొంచం టచ్ లో ఉంటే చెపుతాను, గోపి, గోపిక, గోదావరి, సరదాగా కాసేపు, ఇప్పుడు వంశీ 25 వ సినిమా 'తను మొన్ననే వెళ్ళిపోయింది ' సినిమాలు ఉన్నాయి.

కె.విజయభాస్కర్, కోటిల జోడి ' నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, హిట్లు ఉంటే, ' క్లాస్ మేట్స్, సినిమా ఫాలపైంది. బి.గోపాల్ మణిశర్మల కాంబినేషన్ 'సమర సింహారెడ్డి, ఇంద్ర, నరసింహ నాయుడు, లాంటి సూపర్ హిట్ లు, పల్నాటి బ్రహ్మ నాయుడు, నరసింహుడు, సినిమాలు ఫ్లాప్ లు. వి.వి.వినాయక్, మణిశర్మ ల కాంబినేషన్ 'ఆది, ఠాగూర్ లు హిట్ సినిమాలు, 'చెన్నకెశవరెడ్డి, సాంబ లు ఫ్లాప్ లు.

కె. సతీష్ బాబు

మరిన్ని సినిమా కబుర్లు
chaduvukunna ammayilu to tolisari