Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chaduvukunna ammayilu to tolisari

ఈ సంచికలో >> సినిమా >>

ఏయన్నార్‌ పాత చిత్రం అదొక్కటే

anr old movie thats only

ప్రముఖ తెలుగు సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరణాన్ని తెలుగు సినీ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు తెరపై ఆయన వేసిన ముద్ర అలాంటిది. అక్కినేని మరణం తర్వాత, ఆయన గురించి పాత విషయాల్నీ, కొత్త విషయాల్నీ మరోమారు పునశ్చరణ చేసుకోవడం ద్వారా ఆ మహానుభావుడిని స్మరించుకుంటున్నారు తెలుగు సినీ అభిమానులు.

ఇదివరకు పుస్తకాలే గతి. పత్రికలు తిరగేస్తే తప్ప, అలనాటి విషయాలు తెలిసేవి కాదు. ఇప్పుడు ఇంటర్నెట్‌ ముందు కూర్చుంటే అన్నీ దొరికేస్తున్నాయి. అలా వెతికీ వెతికీ అక్కినేని పాత చిత్రాల్లోని ఆపాతమధురాల్ని ఆస్వాదిస్తున్నారు ఆయన అభిమానులు. అయితే యూట్యూబ్‌లో అక్కినేని నటించిన నాలుగో సినిమా ‘ముగ్గురు మరాఠీలు’ సినిమా తప్ప, అంతకు ముందు మూడు సినిమాలు ఎవరికీ దొరకడంలేదు. వాటికి సంబంధించి స్టిల్స్‌ మాత్రం లభ్యమవుతున్నాయి.

ఏయన్నార్‌ తొలి సినిమా ‘సీతారామ జననం’ ఆ సినిమా వీడియో కోసం నెటిజన్లు వెతుకుతున్నారు. అవి దొరక్క, ఆ సినిమాకి సంబంధించిన కొన్ని ఫొటోలతో సంతృప్తి పడుతున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
puri movie with manchu vishnu