Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anr old movie thats only

ఈ సంచికలో >> సినిమా >>

మంచు విష్ణుతో పూరి చిత్రం

puri movie with manchu vishnu

పూరి జగన్నాథ్‌ ఫామ్‌లోకి వచ్చాడా? రాలేదా? అన్న సందేహాలున్నా, దర్శకుడిగా ఆయన వరుస సినిమాలతో జోరు కొనసాగిస్తున్నాడు. ‘హార్ట్‌ ఎటాక్‌’ సినిమాకి నెగెటివ్‌ టాక్‌ వచ్చినా, వసూళ్ళ పరంగా ఫర్వాలేదన్పించింది. అదలా ఉంచితే పూరి, తదుపరి సినిమా మహేష్‌బాబుతో చేయనున్నాడు. ఆ సినిమాకన్నా ముందు పూరి మరో సినిమాకి కమిట్‌ అయ్యాడు.

ఈ సినిమా మేలో మొదలవుతుందని సమాచారం. పూరి జగన్నాథ్‌ తెరకెక్కించబోయే కొత్త సినిమాలో మంచు విష్ణు హీరోగా నటించబోతున్నాడని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. శరవేగంగా సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట అయిన పూరి జగన్నాథ్‌, ఈ సినిమాని చాలా వేగంగా పూర్తి చేయనున్నాడట.

విష్ణుతో సినిమా పూర్తయిన వెంటనే, మహేష్‌తో సినిమా చేస్తాడు పూరి జగన్నాథ్‌. పూరి సినిమాల్లో హీరో క్యారెక్టర్‌ టిపికల్‌గా, జోవియల్‌గా వుంటుంది కాబట్టి, విష్ణు కూడా ఆ తరహా పాత్రలో ఒదిగిపోతాడేమో. ఈ సినిమా తాలూకు కంప్లీట్‌ డీటెయిల్స్‌ అతి త్వరలో.

మరిన్ని సినిమా కబుర్లు
no sleep with pattapagalu