Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
puri movie with manchu vishnu

ఈ సంచికలో >> సినిమా >>

‘పట్టపగలు’ రాత్రి నిద్రపట్టనీయదు

no sleep with pattapagalu

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకి దెయ్యం సినిమాలంటే ప్రత్యేకమైన ఇష్టం. తనకు దెయ్యాలంటే భయమనీ, అందుకే దెయ్యం సినిమాల్ని ఇష్టంగా తెరకెక్కిస్తానని వర్మ చెబుతాడు. తనను పూర్తిగా భయపెట్టే సినిమా తాను తెరకెక్కించేదాకా తాను నిద్రపోనంటాడు వర్మ. అలా వర్మని భయపెట్టేందుకు ఆయన నుంచే ఓ సినిమా వస్తున్నట్టుంది. అదే ‘పట్టపగలు’.

ఈ సినిమా ట్రెయిలర్‌ చూసినవారికి కంటిమీద కునుకు వుండటంలేదు. చాలా భయంకరంగా సినిమాని తీశాడని ట్రెయిలర్‌ని బట్టి అర్థమవుతోంది. స్వాతి దీక్షిత్‌ ఈ సినిమాలో హీరోయిన్‌. రాజశేఖర్‌ హీరో. సినిమా టైటిల్‌ ‘పట్టపగలు’, క్యాప్షన్‌ ‘రాత్రి నిద్రపట్టనీయదు’ అని పెడితే బావుంటుందేమో.

వర్మ ఈ సినిమాతో అయినా దెయ్యం సినిమాల్ని తను భయపడేలా తెరకెక్కించానని సంతోషపడతాడో లేదోగాని, ట్రైలర్‌ చూసి భయపడినోళ్ళు, సినిమాని ఇంకెంత థ్రిల్‌గా ఫీలవుతామో అని అనుకుంటున్నారు. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

మరిన్ని సినిమా కబుర్లు
anushka perfomance with real gold