Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
no sleep with pattapagalu

ఈ సంచికలో >> సినిమా >>

నిజం బంగారంతో అనుష్క నటన

anushka perfomance with real gold

సినిమాల్లో అన్నీ నిజం కావు. నగలు కూడా అంతే. కానీ, ‘రుద్రమదేవి’ సినిమా లో అనుష్క ఒంటిమీదున్నవన్నీ నిజమైన నగలే. భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్‌ రూపొందిస్తున్న ఈ సినిమాలో అనుష్క ఒంటిమీద నగలు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. లక్షలు వెచ్చించి, కాదు కోట్లు వెచ్చించి మరీ ఆ నగల్ని తయారు చేయించారట.

సహజత్వం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్తాడు గుణశేఖర్‌. ‘ఒక్కడు’ సినిమా కోసం చార్మినార్‌ని సెట్‌గా వేసేశాడు. ‘అర్జున్‌’ సినిమాలో మధుర మీనాక్షి దేవాలయాన్ని సెట్‌గా మార్చేశాడాయన. ‘చూడాలని వుంది’లో కోల్‌కతా వాతావరణాన్ని గుర్తు తెచ్చేలా బిల్డింగ్‌ సెట్‌ని నిర్మించారు. ఇవన్నీ గుణశేఖర్‌ ‘టేస్ట్‌’కి నిదర్శనం.

అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘రుద్రమదేవి’ సినిమాని రూపొందిస్తున్న గుణశేఖర్‌, సినిమాలో అనుష్క పాత్ర ఎప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా తీర్చిదిద్దుతున్నాడట. అందులో భాగంగానే ఒరిజినల్‌ నగల్ని అనుష్కకి అలంకరించారు. గ్రేట్‌ వర్క్‌.. అని అనకుండా వుండలేకపోతున్నాం కదా.

మరిన్ని సినిమా కబుర్లు
varma movie with sridevi