Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anushka perfomance with real gold

ఈ సంచికలో >> సినిమా >>

శ్రీదేవితో వర్మ చిత్రం

varma movie with sridevi

అలనాటి అందాల భామ శ్రీదేవి అంటే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకి ప్రత్యేకమైన అభిమానం. ఆమె అంతటి అందగత్తె తనకు తెలిసినంతవరకూ ఎవరూ లేరంటాడు వర్మ. శ్రీదేవితో సినిమా చేస్తానని ఈ మధ్య పదే పదే చెప్తోన్న వర్మ, ఆ ప్రక్రియలో కాస్తంత ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే శ్రీదేవి ` వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందట.

ఇప్పటికే శ్రీదేవితో తాను చేయబోయే సినిమాకి సంబంధించి కథ సిద్ధం చేసుకున్న వర్మ, ఆ కథని శ్రీదేవి దృష్టికి కూడా తీసుకెళ్ళడం  జరిగిందట కూడా. శ్రీదేవి సైతం ఆ ప్రాజెక్ట్‌ పట్ల ఆసక్తితో వుందని సమాచారం. ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ సినిమాతో కెరీర్‌ని మళ్ళీ కొత్తగా ప్రారంభించిన శ్రీదేవి, ఆ సినిమా తర్వాత కెరీర్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

అన్నీ అనుకున్నట్లే జరిగితే త్వరలోనే వర్మ ` శ్రీదేవి కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌పైకి రానుందట. త్వరలో అంటే, రెండు మూడు నెలల్లోనే ఈ సినిమాకి సంబంధించిన న్యూస్‌ అధికారికంగా బయటకు రావొచ్చునట.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam