Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Courage

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (ఫిబ్రవరి 21 - ఫిబ్రవరి 27) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మొత్తంమీద శుభకార్యములలో పాల్గొంటారు వాటికి సమయాన్ని కేటాయిస్తారు. మిశ్రమఫలితాలు కలుగుతాయి నూతన ప్రయత్నాలు చేయుటకు ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట మంచిది. పెద్దల సూచనలు పెడచెవిన పెట్టకుండా వాటిని ఆచరించే ప్రయత్నం చేయండి మంచిది. ప్రయాణాలు చేయుట, పనిఒత్తిడిని వలన శ్రమను పొందుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును కావున జాగ్రత్త. విద్యార్థులకు తాముచేస్తున్న పనులపైన సరైన అవగాహన అవసరం. బాగాఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగులకు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చును సర్దుబాటు విధానం అనేది అవసరం మంచిది కూడా. వ్యాపారులకు శ్రమపెరుగుతుంది మిశ్రమ ఫలితాలు పొందుతారు కాకపోతే నిదానం అవసరం. కళారంగంలోనివారికి పెద్దలయందు భక్తిని కలిగిఉండుట అనేది సూచన వారితో గల పరిచయాలు లబ్దిని కలగజేస్తాయి.

వృషభ రాశి

ఈవారం మొత్తంమీద అనుకూలమైన ఫలితాలు పొందుతారు చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఉత్సాహంను కలిగిఉండి నూతన పనులను చేపడుతారు. బంధుమిత్రులతో మంచిసంబంధాలు కలిగి ఉండే ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయవలసి రావోచ్సును వాటిమూలన గతంలో ఆగిఉన్న పనులను పూర్తిచేసే ఆస్కారం కలదు. పెద్దల పరిచయాలు కలుగుతాయి. విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉంది మంచిప్రణాళిక అవసరం అలాగే శ్రద్ధను కలిగిఉండుట చేత మంచిఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు బాగుంటుంది అధికారులతో మీకు గల మంచిసంబంధాలు ఉపయోగపడుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారులకు నూతన అవకశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. కళారంగంలోనివారికి పెద్దలతో పరిచయాలు కలుగుతాయి వాటిమూలన నూతన అవకాశాలు పొందుతారు.


మిథున రాశి
ఈవారం  మొత్తంమీద ఆరంభంలో స్వల్ప ఇబ్బందులు తప్పక పోవచ్చును కాకపోతే ఆశించిన ఫలితాలు మాత్రం వారంమధ్యలో పొందుతారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. బంధువులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుతారు, ఖర్చులు కూడా పెరుగుటకు అవకాశం ఉంది. ఒకవార్త మీలో నిరుత్సాహంను కలిగించేదిగా ఉంటుంది దైవప్రార్థన అవసరం. విద్యార్థులకు అధికంగా శ్రమించుట అవసరం ఫలితాలు వెంటనే ఆశించకుండా వేచిచూసే దోరణి వలన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు ప్రయాణాలు అనుకూలించవు. చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోయే ఆస్కారం ఉంది. నూతన ప్రయత్నాలు చేయకండి. వ్యాపారులకు పనులు నిదానంగా కదులుతాయి. పెద్దలతో సమాలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోండి మంచిది. కళారంగంలోనివారికి కోపం పెరుగుటకు అవకాశం ఉంది దానిని అదపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి మంచిది.

కర్కాటక రాశి

ఈవారం మొత్తంమీద పనులకు సంబంధించిన విషయాల్లో ఆటంకాలు పొందినను వాటిని చివరకు విజయవంతంగా పూర్తిచేస్తారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయవలసి రావోచ్చును వాటిమూలాన అనారోగ్యసమస్యలు తలెత్తుటకు అవకాశం ఉంది జాగ్రత్త. చర్చలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండు ప్రయత్నం చేయుట మంచిది లేకపోతే అకారణంగా విభేదాలు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకు అననుకూలమైన ఫలితాలు పొందుతారు ఆలోచనావిధానం మారడం మంచిది. శ్రద్ధను పెంచుప్రయత్నం చేయండి. ఉద్యోగులకు స్థానచలనం కలుగుటకు అవకాశం ఉంది. కొంత నిరాశను పొందుతారు ఆశించిన విధంగా ఫలితాలు ఉండకపొవచ్చును. వ్యాపారులకు ఊహించని ఖర్చులు కలుగుతాయి వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. కళారంగంలోనివారికి కుటుంబసభ్యుల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును చికాకును పొందుతారు సర్దుబాటు అవసరం.


సింహ రాశి

ఈవారం  మొత్తంమీద ఆశించిన స్థాయిలో ఆర్థికపరమైన లాభం ఉంటుంది నూతన పనులను చేపట్టు అవకాశం కలదు. వ్యతిరేకవర్గం నుండి ఎదుర్కొన్న సమస్యలను తెలివితో పరిష్కరించుకోగలుగుతారు. విందులలో పాల్గొనే ఆస్కారం ఉంది సంతోషంగా సమయాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో ఆలోచనలు పంచుకుంటారు కాకపోతే సున్నితమైన విషయాలకు స్పదించక పోవడం అనేది సూచన. లేకపోతే కుటుంబం లో స్వల్ప విభేదాలు తప్పకపోవచ్చును. విద్యార్థులకు పోటిపరీక్షలలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు కాకపోతే సమయపాలన పాటించుట మంచిది. ఉద్యోగులకు స్వంత గ్రామం పైన మక్కువను కలిగిఉండే అవకాశం ఉంది, చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వ్యాపారులకు బాగుంటుంది ఊహించిన విధంగా లాభంను పొందుతారు, నూతన ఆలోచనలు చేస్తారు. కళారంగంలోనివారికి ఇష్టమైనపనులను చేపట్టి వాటిని అనుకున్న సమయానికి పూర్తిచేసే ఆస్కారం ఉంది.

 

కన్యా రాశి

ఈవారం మొత్తంమీద కుటుంబసభ్యులతో సమయాన్ని సంతోషంగా గడుపుతారు ఊరట చెందుటకు అవకాశం ఉంది. చేపట్టే పనుల విషయంలో తొందరపాటు వద్దు సాధ్యమైనంత వరకు సర్దుకుపోవడం అనేది సూచన. మాటలను జాగ్రత్తగా వాడుట అనేది మంచిది లేకపోతే విభేదాలు వస్తాయి అవి కలహములకు దారితీసే ఆస్కారం ఉంది. ప్రయాణాలు పెద్దగా అనుకూలించక పోవచ్చును. విద్యార్థులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి. పోటిపరీక్షల విషయంలో నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఉద్యోగులకు మంచిసమయం కాదు ఆశించిన స్థాయిలో మార్పులు రాకపోవచ్చును, అలాగే నూతన అవకాశాలు కల్గుటలో ఇబ్బందులు తప్పవు. వ్యాపారులకు పెద్దల సహాకారం అవసరం వాటితో కొంత వరకు పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. కళారంగంలోనివారికి నూతన అవకాశాలు వస్తాయి, వాటిపై నిర్ణయం తీసుకొనే ముందు పెద్దల సూచనలు పాటించుట మంచిది.

తులా రాశి

ఈవారం మొత్తంమీద నూతన ఆలోచనలు కలిగిఉండి వాటిని పూర్తిచేసే దిశలో అడుగులు ముందుకు వేయుటకు అవకాశం ఉంది. భోజనం విషయంలో మాత్రం వారం ఆరంభంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగుంటారు. నచ్చిన పనులను చేపట్టుటయందు ఉత్సాహం చూపిస్తారు. బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనుల వలన అనుకున్న దానికన్నా వ్యయం పెరుగుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రద్దఉండక పోవచ్చును కావున ఈవిషయంలో ప్రత్యేకమైన చర్యలు చేపట్టుట మంచిది. సమయపాలన కలిగిఉండుట అనేది మంచిది. ఉద్యోగులకు శ్రమపెరిగినను పెద్దలతో మంచిసంబందాలు ఉన్నచో మేలుజరుగుతుంది. నూతన ప్రయత్నాలు నిదానంగా ముందుకు కదులుతాయి. వ్యాపారులకు లాభాలు తప్పక కలుగుతాయి కాకపోతే నిదానం అవసరం నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. కళారంగంలోనివారికి వ్యతిరేకవర్గం ఉంది. సమస్యలు పెరుగుతాయి వాటిని తెలివితో ఎదుర్కొనే ప్రయత్నం చేయండి.

 

వృశ్చిక రాశి

ఈవారం మొత్తంమీద ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అనేది సూచన వాటిలో ఇబ్బందులు తప్పక పోవచ్చును. అనారోగ్యసమస్యలు కలుగతాయి వాటిమూలాన భాదను పొందుతారు. నూతన ప్రయత్నాలు చేయకండి గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుట అనేది మంచిది. ఆలోచనలను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి అనుకున్న దానికన్నా ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు ఫలితాలు చాలావరకు అనుకూలంగా వస్తాయి. మీపని మీరు చేయుట మంచిది ఫలితాలు ఆశించకపోవడం మంచిది. ఉద్యోగులకు శ్రమపెరుగుతుంది అధికారులకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడం సూచన. తోటివారిని కలుపుకుని వెళ్ళండి లేకపోతే విభేదాలు తప్పక పోవచ్చును. వ్యాపారులకు ఖర్చులు పెరుగుతాయి పెట్టుబడులు పెట్టునపుడు నిదానం అవసరం ఇది సరైన సమయం కాదు. కళారంగంలోనివారికి ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుటకు ఆస్కారం ఉంది.


ధనస్సు రాశి

ఈవారం మొత్తంమీద బంధువులతో, మిత్రులతో సమయాన్ని గడుపుతారు ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన పరిచయాలు కలుగుతాయి వారితో సమయాన్ని గడుపుతారు. తలపెట్టిన పనులకు సంబంధించిన విషయాల్లో గుర్తింపును పొందుతారు. పెద్దలతో గల మంచి సంబంధాలు లబ్దిని కలుగజేయుటకు అవకాశం ఉంది. మాటలు మాత్రం వాడునపుడు జాగ్రత్తగా ఉండుట సూచన స్వల్ప మనస్పర్ధలు కలుగుటకు ఆస్కారం ఉంది. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు కాకపోతే శ్రమతప్పదు. ఉద్యోగులకు పెద్దల ఆశీస్సులు వలన మేలుజరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిఅవుతాయి. కుటుంబంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు మొదట్లో ఉన్న ఉత్సాహం చివరివరకు ఉంటే లబ్దిని పొందుతారు. కళారంగంలోనివారికి అవకాశాలు కలుగుతాయి వాటిని అందిపుచ్చుకొనే ప్రయత్నం చేయుట అనేది సూచన.


మకర రాశి

ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను కొంతఆలస్యం అయినను చివరకు విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. బంధువులతో స్వల్ప మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం ఉంది నిదానంగా వ్యవహరించుట మంచిది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. స్నేహితులకు సంబంధించిన విషయాల్లో జాగ్రతగా ఉండుట వారితో కలిసి పనిచేయునపుడు నిదానం అవసరం. విద్యార్థులకు శ్రమకు తగ్గఫలితం వస్తుంది కావున మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళుట సూచన. ఉద్యోగులకు పనిభారం తప్పదు కాకపోతే అధికారులతో మంచిసంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది దృష్టి సారించుట మంచిది. వ్యాపారులకు ఆలోచనలు పెరుగుతాయి వాటిమూలన కొంత ఖర్చుకూడా పెరుగుటకు ఆస్కారం ఉంది. కళారంగంలోనివారికి శ్రమఉంటుంది అలాగే ప్రయాణాలలో ఇబ్బందులు తప్పక పోవచ్చును, నూతన నిర్ణయాలు చేయకండి మంచిది.

కుంభ రాశి

ఈవారం మొత్తంమీద నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది వాటిని పూర్తిచేసే ప్రయత్నంలో అధికమైన ఒత్తిడిని శ్రమను పొందుతారు. భోజనం విషయంలో అశ్రద్ద వద్దు. కలహాములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి, అనవసరపు చర్చలు చేయకండి. బంధుమిత్రుల ఆలోచనలు మిమ్మల్ని కొంతభాధకు గురిచేసే అవకాశం ఉంది. ప్రయాణాల వలన అలసి పోయే ఆస్కారం ఉంది. విద్యార్థులకు ఆశించిన స్థాయిలో ఫలితాలు కలుగుతాయి పెద్దలలో మంచిగుర్తింపును పొందుతారు. పోటిపరీక్షల్లో విజయం ఉంటుంది. ఉద్యోగులకు వృత్తిస్థానంలో కొంత నిరాశ ఉంటుంది ఏదొక రూపంలో ఆత్మతృప్తి ఉంటుంది. వ్యాపారులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి పెట్టుబడుల విషయంలో మాత్రం తొందరపాటు వద్దు. ఒక్కొక్కటిగా పనులు పూర్తిచేయుట అనేది కలిసి వస్తుంది. కళారంగంలోనివారికి నూతన పరిచయాలు కలుగుతాయి సమయాన్ని మీకు అనుగుణంగా గడుపుతారు.


మీన రాశి

ఈవారం మొత్తంమీద కుటుంబంలో తీసుకొనే నిర్ణయాలు చాలాకీలకం అని గుర్తుపెట్టుకోండి. పెద్దల సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళుట మంచిది. పనిభారం ఉండుట సమయానికి భోజనం చేయకపోవడం వలన అనారోగ్యసమస్యలు కలుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త. ప్రయాణాలు వాయిదావేయుట మంచిది. ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు శ్రమతప్పక పోవచ్చును సరైన సమాయనికి మంచి నిర్ణయం తీసుకోవడం సూచన. పోటీపరీక్షలకు సమయాన్ని కేటాయించుట మంచిది. ఉద్యోగులకు స్థలమార్పిడికి అవకాశం ఉంది అధికారులతో విభేదాలు కలుగుటకు ఆస్కారం ఉంది. వ్యాపారులకు కొంత నష్టం వచ్చే ఆస్కారం ఉంది కావున ప్రయోగాలు వద్దు నిదానంగా ముందుకు వెళ్ళుట మంచిది. కళారంగంలోనివారికి వచ్చిన అవాకాశాలను అందిపుచ్చుకొనే ప్రయత్నం చేయండి, సమయాన్ని కుటుంబసభ్యులతో గడిపే ప్రయత్నం చేయుట మంచిది.శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
duradrushtapu dongalu