Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - Basanthi

ఈ సంచికలో >> సినిమా >>

‘రెడ్డిగారు’ అటకెక్కారు

reddygaru atakekkaru

సినిమా నిర్మాణానికి ముందే అటకెక్కిన సందర్భాలు టాలీవుడ్‌లో అనేకం. ప్రతిష్టాత్మకమైన కాంబినేషన్‌లో రావాల్సిన సినిమాలు కూడా ఈ కోవలో ఉంటాయి. సినిమా అనుకున్నట్లుగా సెట్స్‌పైకి వచ్చి, విడుదల అవటం అంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లుగా ఉంటుంది సినిమా ఆగిపోవడం అనేది.

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించాలనుకున్న ‘రెడ్డిగారు పోయారు’ సినిమా కూడా నిర్మాణానికి ముందే అటకెక్కేసింది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఈ సినిమా అనవసరం అని వర్మకి అనిపించిందంట. అందుకనే మరో ఆలోచన లేకుండా ఆ సినిమాని వర్మ అటకెక్కించేసినట్లుగా తెలుస్తోన్నది.

‘రెడ్డిగారు పోయారు’ సినిమా కోసం ఓ పోస్టర్‌ని రూపొందించి విడుదల చేశారు కూడా. కాని ఆ సినిమాని అటకెక్కించేసి, ఆ స్థానంలో ఇంకో సినిమా చేయాలనే ఆలోచన చేస్తున్నారు వర్మ. ఆ సినిమా తాలూకు వివరాలు కొన్ని రోజులలోనే తెలియనున్నాయి. విభజన రాజకీయాలు, ఎన్నికలు దూసుకొస్తుండడం వంటివి ‘రెడ్డిగారు పోయారు’ సినిమా ఆగిపోవడానికి కారణాలట.

మరిన్ని సినిమా కబుర్లు
Two queens