Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
reddygaru atakekkaru

ఈ సంచికలో >> సినిమా >>

మంచు కోటలో ఇద్దరు రాణులు

Two queens

మోహన్‌బాబు నటిస్తోన్న ‘రౌడీ’ సినిమాలో శాన్వి నటిస్తోంది. షూటింగ్‌ స్పాట్‌లో శాన్విని మోహన్‌బాబు నిశితంగా పరిశీలిస్తున్నారట. ఆమె టాలెంట్‌ని మెచ్చి, ఆమెకు వరుసగా తమ బ్యానర్‌లోనే మరో రెండు సినిమాల్లో అవకాశం కల్పించాలని మోహన్‌బాబు భావిస్తున్నట్లుగా తెలియవచ్చింది. ప్రణీత విషయంలోనూ మోహన్‌బాబు ఇలానే ఆమెకు అవకాశాలు కల్పిస్తున్నారు.

టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేయడంలో అందరికన్నా ముందుంటారు మోహన్‌బాబు. అలా శాన్వి, ప్రణీత మోహన్‌బాబు దృష్టిలో పడటం వారి అదృష్టమని సినీ పరిశ్రమలో పలువురు చర్చించుకుంటున్నారు. మంచు ఫ్యామిలీలో మనోజ్‌, విష్ణు హీరోలు కావడంతో, వారి సినిమాల్లో వరుసగా చేసే అవకాశాలు దక్కితే, హీరోయిన్‌లుగా ప్రణీత, శాన్వి కెరీర్‌ వెలిగిపోవడం ఖాయం.

ఇప్పటికే ప్రణీత మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌ నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాలో నటించింది. శాన్వి, ప్రణీత తదుపరి మంచు ఫ్యామిలీ హీరోలతో నటించబోయే సినిమాల వివరాలు తెలియాల్సి వుంది.

మరిన్ని సినిమా కబుర్లు
Manam is estimated on the rich