Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cool in summer ramcharan

ఈ సంచికలో >> సినిమా >>

టాలీవుడ్‌కి ఏం కాదు

tollywood ki em kadu

ఆంధ్రప్రదేశ్‌ విభజనతో కొందరు ఆందోళన చెందుతోంటే, ఇంకొందరు ఆందోళన అనవసరం ‘ఏది జరిగినా మన మంచికే’ అని సర్దుకుపోతున్నారు. కష్టంలోనూ సుఖం వెతుక్కుంటారు కొందరు. చెడులోనూ మంచి చూస్తే మంచిదంటారు పెద్దలు. మంచిదో, చెడ్డదో అంతా మన మంచికే అనుకుంటే పోలా అని తెలుగు సినీ పరిశ్రమలో పలువురు అనుకుంటున్నారంట.

తెలుగు సినిమాకి ఇప్పటిదాకా ఒక్క రాష్ట్రమే పెద్దదిక్కు. ఆ రాష్ట్రం రెండుగా విడిపోతుండడంతో, రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు సినిమా ఇంకా అభివృద్ధి చెందుతుందనే భావన కొందరిలో వ్యక్తమవుతున్నది. రెండు ప్రభుత్వాలూ తమకు వెసులుబాట్లు కల్పిస్తే, తెలుగు సినిమా ఖ్యాతి పెరిగేలా అద్భుత చిత్రాలు వస్తాయనే ఆలోచన ఇంకొందరిది.

వ్యాపారాత్మక ఆలోచనలు ఇలాగే వుంటాయి. సినిమా అంటే వ్యాపారమే కదా. తెలుగు సినిమాకి ఇరు ప్రాంతాలూ కావాలి. అందుకనే వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ, వాటిని బయటపెట్టకుండా అందరి సెంటిమెంట్లనూ గౌరవిస్తున్నారు సినిమా వారు. విశాఖపట్నంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తగిన మౌళిక వసతులు ఏర్పాటవుతున్నాయి. అవి పూర్తయితే, హైద్రాబాద్‌లాగానే విశాఖ కూడా ఫిలింసిటీ అయ్యే అవకాశం వుంది.

అన్ని రకాలుగా చూస్తే, రాష్ట్ర విభజనతో తెలుగు సినిమా పరిశ్రమకు ఇబ్బంది ఉండదు, పైగా రెండు రాష్ట్రాల్లో వర్ధిల్లి, ఇంకా ఎక్కువమందికి అవకాశాలు సినీ రంగంలో లభించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam