Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with Sunil

ఈ సంచికలో >> సినిమా >>

భీమవరం బుల్లోడు - చిత్ర సమీక్ష

Movie Review - Bheemavaram Bullodu

చిత్రం: భీమవరం బుల్లోడు
తారాగణం: సునీల్‌, ఎస్తేర్‌, షయాజీ షిండే, జయప్రకాష్‌రెడ్డి, విక్రమ్‌జిత్‌, ఫృధ్వి, శ్రీనివాస్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, తెలంగాణ శకుంతల, సుప్రీత్‌, సత్యం రాజేష్‌ తదితరులు.
ఛాయాగ్రహణం: సంతోష్‌ రాజ్‌
సంగీతం: అనూప్‌ రుబెన్స్‌
నిర్మాణం: సురేష్‌ ప్రొడక్షన్స్‌
దర్శకత్వం: ఉదయ్‌ శంకర్‌
నిర్మాత: సురేష్‌ బాబు
విడుదల తేదీ: 27 ఫిబ్రవరి 2014

క్లుప్తంగా చెప్పాలంటే:
రాంబాబు (సునీల్‌) ఓ పల్లెటూరి కుర్రాడు. అతను ఏ అమ్మాయిని ఇష్టపడినా, ఆ అమ్మాయికి వెంటనే వేరే వ్యక్తితో పెళ్ళయిపోతుంది. అనుకోకుండా రాంబాబుకి ఓ యాక్సిడెంట్‌ జరుగుతుంది. ఆ ప్రమాదంలో అతని తలకు గాయమవుతుంది. ప్రమాదంకన్నా షాకింగ్‌ వార్త అతనికి డాక్టర్‌ ద్వారా తెలుస్తుంది. బ్రెయిన్‌ ట్యూమర్‌తో రాంబాబు బాధపడ్తున్నాడన్నది ఆ షాకింగ్‌ న్యూస్‌. పది రోజుల్లో చనిపోతావని డాక్టర్‌, రాంబాబుకి చెప్పడంతో, చచ్చిపోయేలోగా మంచి పనులు చేయాలని భావించి, సిటీకి వచ్చి ఓ రౌడీతో తలపడ్తాడు. ఈలోగా అతనికి నందిని (ఎస్తేర్‌) పరిచయమవుతుంది, నందిని ` రాంబాబుని ప్రేమిస్తుంది. కానీ తానెక్కువకాలం బతకను కాబట్టి, నందిని ప్రేమను తిరస్కరిస్తాడు రాంబాబు. అయితే రిపోర్ట్‌లు మారిపోవడంతో, లేని రోగం తనకు అంటగట్టారని, తాను చచ్చిపోవడం అబద్ధమని తెలుసుకున్న రాంబాబు, అప్పటికే రౌడీలతో పెట్టుకున్న గొడవల నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. వద్దనుకున్న ఎస్తేర్‌ ప్రేమని రాంబాబు తిరిగి పొందాడా? రౌడీల నుంచి ఎలా రాంబాబు తప్పించుకున్నాడు? అన్నవి తెరపై చూడాల్సిన అంశాలు.

మొత్తంగా చెప్పాలంటే:
హీరోగా సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు సునీల్‌. అవసరానికి తగ్గట్టుగా అతని పాత్ర వ్యవహరించింది. కానీ, ఎక్కడో చిన్న లోటు కన్పిస్తుంది అతని పాత్రలో. బహుశా దర్శకుడు, సునీల్‌ని పూర్తిగా వాడుకోకపోవడమే ఆ లోటుకు కారణమేమో. సునీల్‌, తనవరకూ పూర్తి న్యాయం చేశాడు. ఎస్తేర్‌ బొద్దుగా వుంది. నటన ఫర్వాలేదు. గ్లామర్‌ బాగానే పండిరచింది.

షయాజీ షిండే, జయప్రకాష్‌రెడ్డి షరామామూలే. విక్రమ్‌ జిత్‌, పోసాని కృష్ణమురళి, తెలంగాణ శకుంతల ఫర్వాలేదన్పించారు. పృధ్వి కామెడీ పండిరచాడు. కామెడీ విభాగానికి సంబంధించినంతవరకు అతని పాత్రే హైలైట్‌. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల్లో మమ అన్పించారంతే.

పాత కథే అయినా, కొత్తగా తీర్చిదిద్దితే బాగుండేది. కథ, కథనం అన్నీ ఓల్డ్‌ ఫార్మాట్‌లోనే వున్నాయి. సునీల్‌ హీరో కాబట్టి, కామెడీ విషయంలో ఇంకా ఫోకస్‌ పెట్టి వుంటే బావుండుననిపిస్తుంది. పాటలు ఏమంత ఆకట్టుకోవు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సోసోగా వుంది. ఎడిటింగ్‌ ఇంకాస్త బెటర్‌గా వుండాల్సింది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ నేపథ్యంలో సినిమా తీస్తున్నప్పుడు, ఎక్కడా ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అవకూడదు. అదే సమయంలో సినిమా వేగంగా నడిచిపోవాలి. కానీ ఆ స్పీడ్‌ సినిమాలో కన్పించలేదు. ఫస్టాఫ్‌ ఫర్వాలేదు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఓకే. సెకెండాఫ్‌ మాత్రం సాగతీతలా అన్పించింది. కొంచెం కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకుని వుంటే మంచి రిజల్ట్‌ వచ్చేదే. ఓవరాల్‌గా యావరేజ్‌ నుంచి బిలో యావరేజ్‌ చిత్రంగా మిగిలిపోతుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే: అంత ఘనుడేమీ కాదు ఈ భీమవరం బుల్లోడు

అంకెల్లో చెప్పాలంటే: 2.25/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka