Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

బసంతి - చిత్ర సమీక్ష

Movie Review - Basanthi

చిత్రం: బసంతి
తారాగణం: గౌతమ్ , అలీషా, రణధీర్ , షయాజీ షిండే, తనికెళ్ళ భరణి, నవీన తదితరులు
ఛాయాగ్రహణం: అనిల్ బండారి, పి.కె. వర్మ
సంగీతం: మణిశర్మ
నిర్మాణం: స్టార్ట్ కెమెరా పిక్చర్స్
దర్శకత్వం: చైతన్య దంతులూరి
నిర్మాతలు: చైతన్య దంతులూరి, ఉమ
విడుదల తేదీ: 28 ఫిబ్రవరి 2014

క్లుప్తంగా చెప్పాలంటే:
సరదా సరదాగా స్నేహితులతో (రణధీర్ , నవీన) జీవితాన్ని గడిపేస్తోన్న స్టూడెంట్ అర్జున్ (గౌతమ్ ) ఓ పోలీస్ అధికారి ఖాన్ (షయాజీ షిండే) కుమార్తె రోష్ని (అలీషా)తో ప్రేమలో పడతాడు. ఎప్పుడూ లైఫ్ ని లైట్ గా తీసుకునే గౌతమ్ జీవితంలో ఓ హఠాత్పరిణామం చోటు చేసుకుంటుంది. కాలేజ్ లో టెర్రరిస్టులు, విద్యార్థుల్ని బంధీలుగా పట్టుకుంటారు. ఆ కాలేజ్ లోకి వెళతాడు అర్జున్ . ఎందుకు వెళ్ళాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగతా కథ.

మొత్తంగా చెప్పాలంటే:
తన పాత్రకు న్యాయం చేయడానికి సిన్సియర్ గా పనిచేశాడు గౌతమ్ . అయితే బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ, ఎక్స్ ప్రెషన్స్ విషయంలోనూ అతనింకా పరిణతి సాధించాల్సి వుంది. అలీషా క్యూట్ గా వుంది. అంతకు మించి ఆమె గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు. షయాజీ షిండే మంచి నటనా ప్రతిభను ప్రదర్శించాడు. విలన్ పాత్రధారి సరిగ్గా సూట్ కాలేదు. రణధీర్ తన ఉనికిని చాటుకున్నాడు. ఈ సినిమా తర్వాత అతనికి మంచి అవకాశాలు రావొచ్చు. నవీనా ఓకే. ధన్ రాజ్ ని సరిగ్గా వాడుకోలేదు. తనికెళ్ళ భరణి సెన్సిబుల్ పాత్రలో షరామామూలుగానే బాగా నటించాడు.

మూడు పాటలు ఆకట్టుకుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. స్క్రిప్ట్ , స్క్రీన్ ప్లే యావరేజ్ గా వున్నాయి. డైలాగ్స్ ఓకే. మంచి క్వాలిటీతో సినిమా తెరకెక్కించారు. ఎడిటింగ్ లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. కాస్ట్యూమ్స్ బాగున్నాయి. ఆర్ట్ డిపార్ట్ మెంట్ బాగానే వర్క్ చేసింది. ఫస్టాఫ్ సోసోగా సాగిపోయింది. రొమాన్స్ , యాక్షన్ , ఎంటర్ టైన్ మెంట్ తో ఫస్టాఫ్ అంతా నడిచిపోతే, సెకెండాఫ్ లో సీరియస్ నెస్ చోటుచేసుకుంది. మెలోడ్రామా సాగింది. సీరియస్ మూవీస్ ని ఇష్టపడేవారికి ఈ సినిమా కాస్త రుచించవచ్చు. ఫక్తు మసాలా సినిమాల్ని కోరుకునేవారికి అంతగా రుచించని సినిమా ఇది. బాక్సాఫీస్ వద్ద సినిమా ఫర్వాలేదన్పించుకుంటుందంతే.

టెర్రరిజం నేపథ్యంలో సినిమాలు తీసేటప్పుడు, కథ బలంగా వుండాలి. చెప్పే విధానం ఇంకా బాగా ఆకట్టుకోవాలి. ఇప్పటికే ఈ తరహా సినిమాలు చాలానే వచ్చినా, వాటిల్లో చాలావరకు అంచనాల్ని అందుకోలేకపోయాయి. ఎంటర్ టైన్ మెంట్ మిస్ అవడం ఇలాంటి సినిమాల్లో ప్రధానమైన లోటు. ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువైతే సినిమా క్వాలిటీ తగ్గుతుంది.  సినిమా క్వాలిటీతో తెరకెక్కినా ఎంటర్ టైన్ మెంట్ లోపిస్తుంది. రెండిటినీ బ్యాలన్స్ చేయడం కత్తిమీద సామే. ఆ విషయంలో దర్శకుడు తడబడ్డాడు.

ఒక్కమాటలో చెప్పాలంటే:
‘బసంతి’ని దర్శకుడు ఇంకాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాల్సి వుంది

అంకెల్లో చెప్పాలంటే: 2.5/5

మరిన్ని సినిమా కబుర్లు
reddygaru atakekkaru