Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

దుమ్మురేపిన ‘లెజెండ్‌’

dummu repina legend

భారీ అంచనాలతో రూపొందుతున్న సినిమా అది. ‘చూడూ ఒకవైపే చూడు..’ అని ‘సింహా’ సినిమాలో బాలకృష్ణతో పవర్‌ఫుల్‌ డైలాగులు చెప్పించిన బోయపాటి శ్రీను రెండోసారి బాలకృష్ణ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి ‘లెజెండ్‌’గా బాలకృష్ణను బోయపాటి చూపించబోతున్నారు.

బాలకృష్న ` బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న ‘లెజెండ్‌’ ఎలా ఉండబోతోంది? అని అభిమానులు చర్చించుకుంటుండగా వారి అంచనాలను మించేలా ఉంటుందని టీజర్‌లో చూపించారు. ‘లెజెండ్‌’ టీజర్‌ బాలకృష్ణ అభిమానుల్లో సినిమాపై అంచనాలను పెంచేదిగా ఉంది. దేవిశ్రీప్రసాద్‌ తొలిసారిగా బాలకృష్ణతో కలిసి పనిచేస్తున్నాడు ఈ సినిమాకి.

సినిమా నిండా అన్నీ విశేషాలనేనని చిత్ర యూనిట్‌ చెబుతోంది. బాక్సాఫీస్‌ షేక్‌ చేయడానికి తమ అభిమాన హీరో వస్తున్నాడని రాష్ట్ర వ్యాపితంగా బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సినిమా టీజర్‌ చూశాక. టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్‌ పట్ల చిత్ర యూనిట్‌ కూడా ఆనందం వ్యక్తం చేసింది.

మరిన్ని సినిమా కబుర్లు
raja mouli to vibedhinchina seniour natudu