Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
dummu repina legend

ఈ సంచికలో >> సినిమా >>

రాజమౌళితో విభేదించిన సీనియర్‌ నటుడు

raja mouli to vibedhinchina seniour natudu

తెలుగు సినీ పరిశ్రమలో ‘జక్కన్న’గా కీర్తింపబడుతున్న ప్రముఖ దర్శకుడు రాజమౌళితో ఓ సీనియర్‌ నటుడు విభేదించాడు. అతని పేరు రంగనాథ్‌. సీనియర్‌ నటుడైన రంగనాథ్‌, రాజమౌళి సినీ దర్శకుడు కాకముందు అతనితో ఓ టెలీ సీరియల్‌కి పనిచేశారు. ఆ సమయంలో రాజమౌళికీ, రంగనాథ్‌కీ ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు జరిగిన వివాదమట అది.

తన సుదీర్ఘ నటనా జీవితంలో ఎప్పుడూ ఏ దర్శకుడితోనూ విభేదించలేదనీ, అలా విభేదించడం రాజమౌళితోనే జరిగిందని రంగనాథ్‌ తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ చెప్పారు. ఆ ఒక్క సన్నివేశం విషయంలోనే అలా జరిగిందనీ, ఆ తరువాత యధావిధిగా సినిమా షూటింగ్‌లో రాజమౌళి, తాను కలిసి పనిచేశామన్నారు రంగనాథ్‌.

ఆ సీరియల్‌ తర్వాతే రాజమౌళికి దర్శకుడిగా అవకాశం వచ్చింది. ‘భవిష్యత్తులో గొప్ప దర్శకుడివవుతావు, ఆ టాలెంట్‌ నీకుంది..’ అని అప్పట్లో రాజమౌళిని తాను అభినందించానని రంగనాథ్‌ చెప్పారు. రంగనాథ్‌ చెప్పినట్టుగానే రాజమౌళి తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా వెలుగొందుతున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
pawan do not enter into plitics