Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
raja mouli to vibedhinchina seniour natudu

ఈ సంచికలో >> సినిమా >>

పవన్‌ రాజకీయాల్లోకి రావొద్దు

pawan do not enter into plitics

పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వస్తాడని ఎప్పటినుంచో ప్రచారం జరగుతుండగా ఆయన మాత్రం పెదవి విప్పడంలేదు. తన మీద వచ్చే ఊహాగానాలకు ఎప్పుడూ మౌనాన్నే సమాధానంగా ఇచ్చే పవన్‌, మార్చి రెండో వారంలో స్పందిస్తా అని ప్రెస్‌ నోట్‌ పంపడంతో పవన్‌ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు ఎక్కువగా వినిపించేలా చేసింది.

రాకీయాలలోకి పవన్‌ రావడం గురించి తెలుగు సినీ పరిశ్రమలో భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. పవన్‌కళ్యాణ్‌తో ‘తీన్‌మార్‌’ సినిమా తీసిన దర్శకుడు జయంత్‌ సి పరాన్జీ, పవన్‌ రాజకీయాల్లోకి రాకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో తన అభిప్రాయం తెలియజేశారు జయంత్‌.

ఏ విషయమ్మీద అయినా స్ట్రెయిట్‌గా స్పందించే పవన్‌, భ్రష్టుపట్టిపోయిన రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని జయంత్‌ పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనుకుంటే, రాజకీయాలకు దూరంగా ఉండి ఆ పని చేస్తే మంచిదని కూడా జయంత్‌ అభిప్రాయపడ్డారు. ఇంకొందరు సినీ ప్రముఖులు పవన్‌ రాజకీయాలలోకి రావడం మంచిదేనని అంటున్నారు.

అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా, దానికి సినీ రంగం నుంచి సరైన మద్దతు లభించలేదు. రాజకీయాలలో ఆ పార్టీ ఉనికి లేదిప్పుడు. ఆ పార్టీకి సంబంధించిన యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్‌ పనిచేశారు.

మరిన్ని సినిమా కబుర్లు
challenging krishnavamsy