Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kajal wants to love

ఈ సంచికలో >> సినిమా >>

తరగని గ్లామర్‌ గని సన్నీలియోన్‌

sunny leone glamor

సన్నీలియోన్‌ హిందీ సినిమాలలోకి రావడం పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ఆమె హిందీ సినిమాల్లో దాదాపుగా సెటిల్‌ అయిపోయింది. తొలి సినిమాలో ఆమె అందాల ప్రదర్శన తరువాత, ఇంకా చూపించడానికేం లేదు అని అలవోకగా కామెంట్స్‌ విసిరారు బాలీవుడ్‌లో ఎక్కువమంది. కాని సన్నీలియోన్‌ సినిమా సినిమాకీ క్రేజ్‌ పెంచుకుంటూ వెళుతోంది.

ప్రెస్‌మీట్స్‌లో కనిపించినా, సినిమా ఫంక్షన్స్‌కి హాజరైనా, బాలీవుడ్‌ పార్టీస్‌లో దర్శనమిచ్చినా ఆమెను చూసేందుకు అందరూ ఎగబడుతున్నారట. పోర్న్‌ సినిమాల్లో నటించినందువల్ల సన్నీలియోన్‌కి హిందీ సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం కష్టం అని, అసాధ్యం అని కూడా భావించారు సినీ పరిశ్రమకు చెందినవారు.

సన్నీలియోన్‌ మాత్రం, హిందీ సినీ పరిశ్రమలో స్థిరపడ్డాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంది. ఆమె యాటిట్యూడ్‌ ఆమెను హిందీ పరిశ్రమలో హాట్‌ ప్రాపర్టీగా చేసింది. ఆమె నటించిన సినిమాలకీ, ఆమె ఫొటోలకీ బాలీవుడ్‌లో ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. అలా తరగని గ్లామర్‌ గని అనిపించుకుంటోంది సన్నీలియోన్‌.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chuddam