Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ika aa cinimaalu raanatte

ఈ సంచికలో >> సినిమా >>

మార్చి 28, లెజెండ్‌ ` రౌడీ

March 28, Legend `Rowdy

తెలుగులో రెండు భారీ సినిమాలు, భారీ అంచనాలున్న సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలకూ ఈ నెలాఖరు ముహూర్తం ఖరారైంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వస్తున్న ‘లెజెండ్‌’ ఒకటి కాగా, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపొందిస్తున్న ‘రౌడీ’ ఇంకొకటి.

‘లెజెండ్‌’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంచనాలను పెంచేలా బాలకృష్ణ డైలాగులతో ట్రెయిలర్‌ని రిలీజ్‌ చేశారు నిర్మాతలు. బోయపాటి ట్రేడ్‌ మార్క్‌ యాక్షన్‌, టేకింగ్‌ సినిమాకి హైలైట్‌ అని అంటున్నారు. ‘సింహా’ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది.

‘రౌడీ’ సినిమా విషయానికి వస్తే ఇందులో మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన కుమారుడు విష్ణు కూడా నటించాడు ‘రౌడీ’ సినిమాలో. ట్రెయిలర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. భారీ చిత్రంగా సినీ వర్గాల్లో దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ రెండు సినిమాలూ ఒకే రోజు వచ్చి, రెండు సినిమాలూ ప్రేక్షకాదరణ పొందాలని సినీ అభిమానులు అనుకుంటున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
Labor of Telugu cinema