Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Labor of Telugu cinema

ఈ సంచికలో >> సినిమా >>

సినిమా నుంచి టీవీకి

Film and TV

సినిమా రంగంలో పేరొందిన నటీనటులు, టెలివిజన్‌ రంగంలో రాణిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి సోదరుడు నాగబాబు సినిమాల్లోకన్నా టీవీ సీరియల్స్‌లోనే ఎక్కువ నటిస్తుండడం దానికి నిదర్శనం. సినిమా కెరీర్‌లో రాణించలేనివారు, రాణిస్తున్నవారు కూడా టెలివిజన్‌ పట్ల ఆసక్తి ప్రదర్శించడం చూస్తున్నాం.

ఒక్కో సినిమాలో నటించినందుకు భారీ పారితోషికం తీసుకున్నా, దానికి సమానంగానే టెలివిజన్‌ సీరియల్స్‌లోనూ సంపాదన వస్తోన్నదట. మెగా సీరియల్స్‌ రాకతో ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. రోజువారీ చెల్లింపులు, అవి కూడా పక్కాగా ఉంటుండడంతో సినిమా రంగం కన్నా నటీనటులు టెలివిజన్‌ రంగంపై ఆసక్తి చూపుతున్నారు.

సినిమాలో నటిస్తే వచ్చే పేరుకున్నా టెలివిజన్‌ సీరియల్స్‌కి ప్రేక్షకులకు పెరుగుతున్న ఇంట్రెస్ట్‌తో టెలివిజన్‌ రంగంలోనే ఎక్కువ పేరు వస్తోందని ప్రముఖులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ` టీవీ రెండూ ఒకటే, సినిమాకన్నా టీవీల్లోనే పేరు ఎక్కువ వచ్చిందని సీనియర్‌ నటులు చెప్పడంతో కొత్తగా సినిమాల్లోకి వచ్చేవారు, వేగంగా టెలివిజన్‌ సీరియల్‌ పట్ల ఎట్రాక్ట్‌ అవుతున్నారు.

 

మరిన్ని సినిమా కబుర్లు
Nala Damayanthi