Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with Murugadoss

ఈ సంచికలో >> సినిమా >>

నిద్రపట్టనీయని పట్టపగలు

Nidrapattaneeyani pattapagalu

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘పట్టపగలు’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. భయం గొలిపే సినిమాలంటే తనకూ భయమేనని చెప్పే వర్మ, ఆ భయంలోనే థ్రిల్‌ ఫీల్‌ అవుతానంటారు. అద్భుతమైన భయం గొలిపే సినిమా చేయాలన్న కోరిక ఇప్పటిదాకా తీరలేదని చెప్పే వర్మ, ‘పట్టపగలు’ సినిమాతో తన కోరిక పూర్తిస్థాయిలో నెరవేర్చుకునే అవకాశం ఉందంట.

సినిమా చాలా భయంకరంగా ఉంటుందని, థ్రిల్లర్‌ సినిమాల్ని ఇష్టపడేవారు ఎంజాయ్‌ చేస్తారని అభిజ్ఞ వర్గాల సమాచారం. ఈ టైటిల్‌ ‘పట్టపగలు’ అని పెట్టిన వర్మ, కొత్త ట్రెండ్‌కి తెరతీశాడు. భయంకరమైన సినిమాలంటే రాత్రి, అర్థరాత్రి తదితర టైటిళ్ళు పెడతారు. లేదంటే దెయ్యం అని ఇంకోటని పెడతారు.

వర్మ అలా కాదు, ‘పట్టపగలు’ అని భిన్నంగా ఆలోచించాడు. భయం గొలిపే సినిమాల్లోనూ ఈ ‘పట్టపగలు’ డిఫరెంట్‌గా ఉంటుందట. అద్భుతంగా వర్మ ‘పట్టపగలు’ సినిమాని రూపొందించినట్లు తెలుస్తోంది. సాంకేతికంగానూ సినిమా అత్యద్భుతంగా వచ్చిందని  చెప్పుకుంటున్నారు సినీ వర్గాల్లో.

మరిన్ని సినిమా కబుర్లు