Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Patashala-16 by bhaskarabhatla

ఈ సంచికలో >> సినిమా >>

కమలతో నా ప్రయాణం - చిత్ర సమీక్ష

Movie Review - Kamalatho Naa Prayanam

చిత్రం: కమలతో నా ప్రయాణం
తారాగణం: శివాజీ, అర్చన, పావలా శ్యామల తదితరులు
చాయాగ్రహణం: మురళీమోహన్‌రెడ్డి
సంగీతం: కెకె
నిర్మాణం: లివిత యూనివర్సల్‌ ఫిలింస్‌
దర్వకత్వం: నరసింహ నంది
నిర్మాతలు: ఇసనాక సునీల్‌రెడ్డి, సిద్దార్ధ బొగులు
విడుదల తేదీ: 14 మార్చి 2014

క్లుప్తంగా చెప్పాలంటే :
1950ల నాటి కథ ఇది. కమలారాణి (అర్చన) ఓ వేశ్య. ఒంటరిగా జీవనం సాగిస్తూ వుంటుంది. ఆమె జీవితం అసంతృప్తితో సాగిపోతుంటుంది. ఓ వర్షం కురిసిన రాత్రి ఓ వ్యక్తి సూర్యనారాయణ (శివాజీ) ఆమె ఆశ్రయం పొందుతాడు. తనకోసమే సూర్యనారాయణ వచ్చాడనుకుంటుంది కమల. అయితే, తన చిన్ననాటి స్నేహితుడ్ని కలుసుకోవాలని వస్తాడు సూర్యనారాయణ అని కమల తెలుసుకుంటుంది. అలా వారిద్దరూ తమ తమ జీవితాల గురించి తెలుసుకుంటారు. అలా అలా వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది తెరపై చూడాల్సిన కథ.

మొత్తంగా చెప్పాలంటే :
నటనలో సహజత్వం శివాజీ సొంతం. సినిమాలో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. పాత్రలో ఒదిగిపోయాడు శివాజీ. సినిమాలో శివాజీ నటనను ఓ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు శివాజీ. అర్చన కూడా నటనలో రాణించింది. ఈ సినిమాతో నటిగా ఆమెకు మరింత మంచి పేరొస్తుంది. పావలా శ్యామల ఓకే. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర ఫర్వాలేదన్పించారు.

మెచ్యూర్డ్‌ స్టోరీ లైన్‌తో దర్శకుడు సినిమాని తాను అనుకున్నట్లుగా తెరకెక్కించడంలో సఫలమయ్యాడు. డైలాగ్స్‌ బాగున్నాయి. స్క్రిప్ట్‌ ఫర్వాలేదు. స్క్రీన్‌ప్లే ఇంకాస్త బెటర్‌గా వుండాల్సింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. పాటలు ఏమంత గొప్పగా లేవు. కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్‌, ఆర్ట్‌ వింగ్‌.. అన్నీ సమర్థవంతంగా పనిచేశాయి. దర్శకుడు ఆయా విభాగాల నుంచి తనక్కావాల్సిన ఔట్‌ పుట్‌ రాబట్టుకోవడంలో సఫలమయ్యాడు. అయితే ఇంకా మంచి ఔట్‌ పుట్‌ సాధించుకునేందుకు ప్రయత్నించి వుంటే బావుణ్ణనిపిస్తుంది.

ఫస్టాఫ్‌ కొంచెం డల్‌గా సాగుతుంది. సెకెండాఫ్‌లో వేగం పెరుగుతుందిగానీ, ఎక్కడా కమర్షియల్‌ అంశాలు కన్పించవు. ఆర్ట్‌ సినిమాలా కన్పిస్తుంది చాలా చోట్ల. సినిమాని ఫీల్‌ అయితే అందులో మంచి ఫీల్‌ కన్పిస్తుంటుంది. రెగ్యులర్‌గా కమర్షియల్‌ సినిమాల్ని ఇష్టపడేవారికి మాత్రం ఈ సినిమా రుచించదు. ఆర్ట్‌ సినిమా లవర్స్‌ని ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా దర్శకుడి అటెంప్ట్‌ని అభినందిస్తారెవరైనా.

ఒక్క మాటలో చెప్పాలంటే : స్లో అండ్‌ మెచ్యూర్డ్‌ మూవీ.. అయితే కేవలం ఆర్ట్‌ మూవీ లవర్స్‌ ఇష్టపడ్తారు.

అంకెల్లో చెప్పాలంటే : 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka