Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
Charles Philip Brown

ఈ సంచికలో >> శీర్షికలు >>

జాతకచక్రం (మే 11 - మే 17) - శ్రీ నంద

'గోతెలుగు.కామ్' పాఠకుల ప్రశ్నలకు శ్రీ నంద గారు సమాధానాలిస్తారు. మీ యొక్క ప్రశ్నలను(ఒక్కటి మాత్రమే) మీ పేరు, పుట్టిన తేది, సమయం, పుట్టిన ఊరు జతచేసి 'goteluguastro@gmail.com ' కి పంపగలరు. 
 


ప్ర. నా భవిష్యత్తు చెప్పగలరు. నా భర్త తో నాకు గొడవ అవుతోంది. అస్సలు మనస్సు ప్రశాంతత లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది. మా బంధం ఎలా ఉంటుంది. ఇలా జరగకుండా వుండాలంటే ఏమి చెయ్యాలి - రమా, కరీంనగర్
జ. రమగారు మీరు వైవాహిక సమస్యలు ఉన్నవి అన్నారు కాని మీవారి జాతకం చెప్పలేదు. ఇద్దరి జాతకాలను పరిశీలించాలి. మీ జాతకం ప్రకారం పరిశీలించినచో స్వాతి నక్షత్రం తులారాశి ప్రస్తుతం ఏలినాటి శని  ప్రభావం ఎక్కువగా ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పంచామాధిపతి కి లాభాధిపతికి పరివర్తనయోగం ఉంది. మీయొక్క ఆలోచనలు కొద్దిగా ఖరీదైనవిగా ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకోవటం  మేలు. మీరు మనసులోని భావాలను వ్యక్తపరుచుటలో చిన్న పొరపాట్ల మూలాన మీ మధ్యలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే మీరు కొద్దిగా బద్ధకాన్ని కలిగి ఉంటారు. శ్రమించే స్వభావాన్ని పెంచుకోవాలి. అదేవిధంగా కోపాన్ని తగ్గించుకోవాలి. మీరు మొదట కాదు అని తర్వాత దానినే ఒప్పుకొనే స్వభావం ఉంటుంది. కావున ఒకే విధంగా ఉండటం మంచిది. ప్రస్తుతం శని మహర్దశలో బుధ అంతర్దశ నడుస్తుంది. దాదాపు 2012 జూన్ నుండి ఖర్చులు పెరగడం, కలహాలు  పెరిగి ఉండాలి. మీరు కొద్దిగా సర్దుకోండి. 2013 జూన్ తర్వాత కొద్దిగా మార్పులు ఉంటాయి. మీకు  కలుగుతున్న పిచ్చి ఆలోచనలను తగ్గించుకోవడం మంచిది. మీరు దైవచింతనను బాగా పెంచుకోవాలి. ప్రతిరోజు లలితా సహస్రనామం పారయాణ చేయుట, నెలకు ఒకమారు నరసింహాస్వామికి పూజచేయించుట మంచిది. అలాగే విష్ణుసహస్రనామం 53 బుధవారాలు చదవండి.   
    
ప్ర. మా అబ్బాయి జాతకం ఎలా వుంటుందో దయచేసి చెప్పగలరు - సాయి రాకేష్, కరీంనగర్
జ. మీ కుమారుడు ఉత్తరా నక్షత్రం కన్యారాశిలో జన్మించాడు. సరస్వతీ కటాక్షం మీ అబ్బాయికి ఉంది.  బలవంతంగా కాకుండా ఒకటికి రెండుసార్లు చదవడం రాయడం అలవాటు చేయండి, మంచి ఫలితాలను పొందుతారు. కొన్ని సార్లు మాటవిన్నా తను మొండిగా ఉండి ఇబ్బంది పెట్టుటకు అవకాశం కలదు. మీ అబ్బాయి పట్ల శ్రద్ధ తీసుకుంటూ తనకు నచ్చిన విధంగానే ఉండనిస్తూ మీకు కావల్సిన విధంగా తయారుచేసుకోవటం  క్షేమం. ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యలు లేదా మరొక రూపంలో ఖర్చులు పెరుగుటకు అవకాశం కలదు. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆటలాడే సమయంలో దెబ్బలు తగిలే  అవకాశాలు కలవు జాగ్రత్త, వాహనముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తరుచూ జ్వరం వస్తుంటే ఆదివారం శివునకు అభిషేకం చేయించటం మంచిది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం మంచిది. చంద్రునికి జపాలు చేయించుట, 1.25 కిలో  బియ్యం దానం ఇవ్వండి.    

ప్ర. నా ఉద్యోగ మరియు వివాహము గురించి చెప్పగలరు - శ్రీకాంత్, చిలకలూరి పేట
జ. శ్రీకాంత్ మీరు ధనిష్ట నక్షత్రం,మకరరాశిలో జన్మించారు. మీరు ఉద్యోగం వివాహం గురించి అడిగారు. వృత్తి స్థానాధిపతి నీచపొంది ద్వితీయంలో ఉన్నాడు. మీరు తెలివైన వారు అయినప్పటికిని మీపై మీకు నమ్మకం తక్కువగా ఉండటం లేదా అధికమైన ఆలోచనలు కలిగిఉంటారు. ప్రస్తుతం గురుమహర్దశ నడుస్తుంది. జూలై 2013 తర్వాత ఉద్యోగం లభిస్తుంది. కాకపోతే గట్టిగా ప్రయత్నం చేయాలి. వివాహం ప్రయత్నం మాత్రం 2014 జూన్ తర్వాత  చేయుట మంచిది. మీ మాటను అందరువినాలన్న ఆలోచనను వదిలి ఇతరుల మాటలను కూడా వినడం సూచన. కాంపిటేషన్ పరీక్షల్లో అనుకూలతలు బాగున్నవి. అలాగే మీకు సాఫ్ట్ వేర్ రంగంలో వెళ్ళాలి అనుకుంటే చక్కటి అవకాశాలు కలవు ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో ఎక్కువకాలం చేయలేరు. కావున ఈ విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రభుత్వఉద్యోగ అవకాశాలు కలవు, ఆ దిశగా ముందుకు వెళ్ళండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం, నెలకు ఒకమారు శివునకు అభిషేకం చేయండి. మేలు జరుగుతుంది.      

ప్ర. నా వివాహ సమయాన్ని గురించి తెలుపగలరు - ఇస్కపల్లి నాగరాజు, ఒంగోలు
జ. నాగరాజు మీరు పుష్యమి నక్షత్రం, కర్కాటకరాశిలో జన్మించారు. మీకు ప్రస్తుతం బుధ మహర్దశ నడుస్తుంది.  మీయొక్క జాతకంలో బుధుడు అష్టమంలో కేతువుతో కలిసి ఉన్నాడు. మీ మాటలు కొంత వరకు విశ్వసించే విధంగా ఉండవు, కావున మీరు ఈ మార్పును చేసుకోవాలి. మీరు చాలా మొండిగా ఉండటం ఇతరులతో కటినంగా మాట్లాడటం చేస్తారు, కావున అందరితోను జాగ్రత్తగా ఉండాలి. ఇక వివాహం విషయానికి వస్తే జాతకం సరిపోయే అమ్మాయిని వివాహం చేసుకోవడం మంచిది. వివాహస్థానంలో నీచభంగరాజయోగం ఉంది తప్పక అనుకూలిస్తుంది. మీకన్నా పెద్దవారిని ఇష్టపడే అవకాశాలు కలవు. అలాగే మీరు వివాహం చేసుకొనే అమ్మాయి వయస్సు ఎక్కువగా కనబడే అవకాశం కలదు. ఈ సంవత్సరం జూన్ తర్వాత గట్టిగా ప్రయత్నం చేయడం వలన  వివాహావకశాలు మెరుగుపడుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. చర్మసంబంధ  లేదా నరాలకు సంబంధించిన ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు.  2013 జూన్ నుండి వివాహం కు అనుకూలమైన కాలం. ప్రతిరోజు విష్ణుసహస్రనామ పారాయణ తో పాటు ఒకసారి శివునకు అభిషేకం చేయించండి. ఈ సంవత్సరం నవంబర్ లోపు వివాహం జరుగుటకు అవకాశాలు కలవు.  
 

వార ఫలాలు (మే 11  - మే 17)


మేష రాశి
ఈవారం వ్యాపారస్థులు నూతన ప్రయత్నాలు వాయిదావేసుకోవడం మంచిది. ఆర్థికంగా నష్టపోయే సూచనలు కలవు. మనోవిచారంను పొందుతారు. మాటను జారవిడవడం చేత బంధువులతో వివాదములు కలుగుటకు అవకాశం కలదు. వ్యవసాయదారులకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చును. ఈ వారం మొత్తం కూడా మానసికంగా మిశ్రమంగా ఫలితాలను కలిగి ఉంటారు. సంతోషాలను వెంటనే భాదలను పొందుటకు అవకాశం కలదు. వారం ప్రారంభంలో భోజనంపైన ప్రదర్శించిన ఆసక్తిని చివరి వరకు కలిగి ఉండలేరు. ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు. అనారోగ్యం విషయంలో తప్పని సరిగా వైద్యున్ని సంప్రదించుట మేలు అశ్రద్ధ కూడదు. వారం మధ్యలో కొంతమేర మీయొక్క ఆలోచనల్లో పరిణతిని పొందడంచేత చేసేపనుల్లో దనలాభంను పొందుతారు. ఇతరులకు మంచి సూచనలు ఇవ్వడంచేత పేరును సంపాదించుకుంటారు. కుటుంభసభ్యులతో సంతోషంగా గడుపుతారు,విందులు వినోదాలలో పాల్గొంటారు. దూరప్రదేశ ప్రయాణాలు అనుకూలిస్థాయి. ప్రతిరోజు ఆదిత్యహృదయం పారాయణం చేయుట, దుర్గాదేవికి అభిషేకం చేయుట మూలాన మేలుజరుగుతుంది.

వృషభ రాశి
ఈవారం మిశ్రమ ఫలితాలను కలిగిఉంటారు. సమయానికి భోజనం చేయుట కలహాములకు దూరంగా ఉండటం మంచిది. స్నేహితులతో నిదానంగా ఉండటం చేయండి. చెడు స్నేహితులకు ఎంత దూరంగా ఉంటే అంత మేలుచేస్తుంది. కుటుంభంలో కూడ నిరుత్సాహంను పొందుతారు. సర్దుకుపొండి. అనారోగ్యం మూలాన ఇబ్బందులను పొందుతారు. ఇంతకు ముందు చేసిన ప్రయాణాలమూలాన కూడా అనారోగ్యసమస్యలు వచ్చే అవకాశం కలదు. వారం ప్రారంభంలో పనులను ఉత్సాహంతో ఆరంభిస్తారు. మధ్యలో చిన్నచిన్న సమస్యలు పొందినప్పటికిని చివరకు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇష్టమైనవ్యక్తులను కలుస్తారు వారితో సమయాన్ని సరదాగా గడుపుతారు. సంచారం చేయుటమూలన శరేరం ఆయాసంను పొందుటకు అవకాశం ఉంది. బంధువులతో కాని మిత్రులతో కాని నిదానంగా వ్యవహరించుట మేలు. ఉద్యోగంలో మీరు ఆశించినవిధంగా ఉండకపోవచ్చును. కావున వేచిచూసే విధానం మంచిది. నూతన పరిచయాలు కలుగుతాయి. వాటి ద్వారా సంతోషాన్ని పొందుతారు. ధనధాన్య సంవృద్దిని నిదానంగా పెంపొందించుకుంటారు. శివునకుఅభిషేకాలు చేయుట, సుబ్రమణ్య ఆరాధన చేయుట, రుద్రంపారయణం వినడం కూడ మేలుచేస్తుంది.  

మిథున రాశి
ఈవారం మంచిపనుల కోసం ప్రయాణం చేయవలసి వస్తుంది. ప్రయాణాల మూలాన ఖర్చును కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారలయందు ఆసక్తిని కలిగిఉంటారు. కాకపోతే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం చేత మేలుజరుగుతుంది. మీయొక్క బంధువులలో ఒకరి ఆరోగ్యం కాస్తా ఆందోళనను కలిగించేదిగా ఉండుటకు ఆస్కారం కలదు. వారంప్రారంభంలో మానసికంగా కొంత అదైర్యాన్ని పొందిన మధ్యలో కొద్దిగా కోలుకొని ఉత్సాహంతో పనులను చేస్తారు. వారం చివర్లో పనిభారం ఉంటుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుటకు ఆస్కారం కలదు. భోజనం విషయంలో ప్రత్యేక ఇష్టాలను కలిగి ఉన్నప్పటికిని మంచి ఆరోగ్యకరమైన భోజనానికి ప్రాముఖ్యతను ఇవ్వండి. ప్రయత్నాలలో ముందుకు వెళ్తారు. మీరే ముందు ఉండి కొన్నిపనులను పూర్తిచేస్తారు. చేపట్టిన పనుల్లో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరివరకు కొనసాగేలా ప్రయత్నం చేయండి. కొత్తకొత్త పరిచయాలు కలుగుతాయి సౌఖ్యానికి ప్రాధాన్యతను ఇస్తారు. వ్యాజ్యములు కలుగుటకు ఆస్కారం ఉంది. కావున జాగ్రత్తగా ఉండండి. ఈ వారం విష్ణుసహస్రనామం పారయణ చేయుట, గణపతికి అభషేకం, గురువారం సాయిబాబా దేవాలయం వెళ్ళుట చేయండి. 

కర్కాటక రాశి
ఈవారం ఉద్యోగస్థానంలో అలాగే బంధువులలో మంచిపేరును కలిగి ఉంటారు. అధికారులతో కలిసి నూతన పనులను ఆరంభిస్తారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. భోజనసౌఖ్యాన్ని పొందుతారు. శరీర సౌఖ్యాన్ని కలిగిఉంటారు. వారం ఆరంభంలో బంధువుల గృహంలో భోజనసౌఖ్యాన్ని పొందుతారు. మధ్యలో కొద్దిగా మానసిక ఇబ్బందులను పొందినా చివరకు సంతోషాన్ని పొందుతారు. ఉత్సాహంను కలిగి ఉండి చేపట్టిన పనుల్లో ముందుకు వెళ్తారు. ఇష్టమైన పనులను పూర్తిచేస్తారు బంధువులకు ఉపయోగపడుటకు అవకాశం కలదు. కుటుంభంలో చిన్న చిన్న సమస్యలు కలిగినప్పటికిని వాటిని మీవైన ఆలోచనలతో పరిష్కరించగలుగుతారు. ఎదురైనా సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు ముందుకు సాగుతారు. చక్కటి ప్రణాలికలను సిద్దం చేసుకోండి. మొదట్లో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నా అధిగమిస్తారు ధనలాభంను పొందుతారు. అనారోగ్యంను మాత్రం అశ్రద్దచేయకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. సోమవారం శివాలయం వెళ్ళండి, ప్రతిరోజు కనకధారస్తోత్రం చదవండి, హనుమాన్ దేవాలయం వెళ్ళడం అలాగే హనుమాన్ చాలీసా చదవండి మంచిది. 

సింహ రాశి
ఈవారం మీరు మిశ్రమఫలితాలను పొందుటకు అవకాశం కలదు. వారం ప్రారంభంలో ఆర్థికంగా వ్యయాన్ని పొందుతారు. జాగ్రత్తగా ఉండటం మంచిది. వారం చివర్లో మీయొక్క ఆలోచనలను అధికారులు గుర్తించే అవకాశం కలదు. కావున శ్రమించుట చేత లాభంకలుగుతుంది. రాజకీయ వ్యవహారాలలో ముందుకు వెళ్తారు. అనుకున్నవి నెరవేరే అవకాశం ఉంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. భోజనసౌఖ్యాన్ని పొందుటకు అవకాశం కలదు. బంధువులతో కలిసి ఏదైనా పనిని ఆరంభిస్తే వారం చివర్లో మీకు మనస్పర్థలు కలుగుటకు అవకాశం కలదు. కావున జాగ్రత్తలు పాటించట మేలు. పనిఒత్తిడి కావొచ్చు లేదా సంచారం చేయుట మూలాన అనారోగ్యంనకు గురయ్యే అవకాశం కలదు జాగ్రత్త. కుటుంబంలో కలిగిన మనస్పర్థలు తొలగిపోతాయి అందరు కలిసి సరదాగా గడిపే అవకాశం ఉంది. ఆ దిశగా అలోచించి ప్రయత్నం చేయుట మూలాన మంచి ఫలితాలు కలుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు వాయిదా వేసుకోండి. స్త్రీలకు సంబందించిన విషయాల్లో జాగ్రత్త. బుద్ధిబలం చేత పనులు ముందుకు సాగుతాయి. ఈవారం మీరు దుర్గాదేవికి కుంకుమ అర్చన, ప్రతిరోజు లింగాష్టకం చదవడం, వేంకటేశ్వరస్వామి దేవాలయం బుధవారం వెళ్ళడం మంచిది.   

కన్యా రాశి
ఈవారం అధికారులతో ఆచితూచి వ్యవహరించుట మేలు. ప్రభుత్వరంగంలో పనిచేవారు నూతన నిర్ణయాలు వాయిదా వేసుకోండి. లేకపోతే చేసేపనుల మూలాన ధనవ్యయాన్ని పొందుటకు అవకాశం కలదు. వారం ఆరంభంలో సమస్యలు ఎదురైనా తర్వాత సమస్యలను అధిగమిస్తారు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. చేపట్టిన పనులను ఉత్సాహంతో పూర్తిచేయుటకు అవకాశాలు కలవు. వారంచివార్లో ఒకవార్తను వినడం మూలనకొంత భాదను పొందుతారు. మానసికంగా దృడంగా ఉండటం మంచిది. వాహనములకు సంబందించిన ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికపరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మీయొక్క ఆలోచనలు ఇతరులకు ఇబ్బందులు కలిగించేవిగా ఉంటవి. కుటుంబంలో నిదానంగా ఉండటం కోపాన్ని తగ్గించుకొనుట మూలాన మేలుజరుగుతుంది. నూతన స్థిరాస్థులపైన ఆసక్తిని చూపిస్తారు. ఆదిశగా ముందుకు వెళ్ళు ప్రయత్నం చేయుట లాభాన్ని కలిగిస్తుంది. పెద్దల సూచనలు పాటించుట మేలుచేస్తుంది. స్త్రీలకు సంబందంచిన విషయాలకు దూరంగా ఉండటం మేలు. అకారణంగా ఏర్పడు కలహాములకు దూరంగా ఉండండి. మీరు ఆంజనేయస్వామికి సింధూరపూజ చేయండి, లక్ష్మీఅష్ట్తోత్తరం ప్రతిరోజు చదవండి, రాత్రిపడుకొనే ముందు చంద్రునకు నమస్కారం చేయుట మేలు. 

తులా రాశి
ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండటం అనేది సూచన. ప్రతిపనిలోను ఆటంకాలు కలుగుటకు ఆస్కారం కలదు జాగ్రత్త. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి కొద్దిగా ఇబ్బందులను పొందుతారు. వారం ప్రారంభంలో మానసికంగా ఇబ్బందులను పొందినప్పటికిని మీకు మీరు ప్రోత్సాహాన్ని ఇచ్చుకొనుట అలాగే పెద్దల సలహాలను పాటించుట చేత చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. ఇష్టమైన పనులను పూర్తిచేయుటలోను అలాగే బంధువుల యెడల ప్రీతిని కలిగి ఉంటారు. కుటుంభంలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీయొక్క ప్రవర్తన అనుమానస్పదంగా ఉంటుంది. మీయొక్క ఆలోచనలు ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తాయి. కావున జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో వివాదములకు అవకాశం ఇవ్వకండి. సమయపాలనను పాటించుట చేత కొద్దిగా ఇబ్బందులను తగ్గించుకోగలుగుతారు. వినోదములు విలాసముల పట్ల ఇస్టంను కలిగి ఉంటారు. తొందరపాటు విదానములు కలిగిఉంటే దుఃఖాన్ని పొందుటకు అవకాశం ఉంది. మహాకాళిని పూజించుట, సాయిబాబా దేవాలయం వెళ్ళుట, లక్ష్మీ-వేంకటేశ్వరులను ప్రతినిత్యం పూజించుటమేలు చేస్తుంది.  

వృశ్చిక రాశి
ఈవారం ఆర్థికంగా బాగున్న ఖర్చులను అధికంగా కలిగి ఉంటారు. ఇతరులకు సహాయపడుట చేత సంతోషాన్ని పొందుతారు. మిశ్రమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా చేపట్టిన పనులను వారం ఆరంభంలో లేదా మధ్యలో పూర్తిచేసే విధంగా ప్రయత్నం చేయండి. లేకపోతే వారం చివరలో ఇబ్బందులు పొందుతారు. అకారణంగా మీరు ఇతరులకు విరోదులుగా మారు అవకాశం కలదు. కావున జాగ్రత్తగా ఉండటం మేలు. వారం ఆరంభంలో మీకున్న గుర్తింపు చివరి వరకు కొనసాగాకపోవచ్చును. కావున ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. సరైన సమయానికి ఆహారం తీసుకొనుట అలాగే ఆరోగ్యసూత్రాలను పాటించుట మేలుచేస్తుంది. చర్చాసంభందమైన విషయాల్లో ఆసక్తిగా పాల్గొంటారు. అలాగే సమయాన్ని వృదాకాకుండా చూసుకోవడం చేయండి. ఇష్టమైన పనులలో మాత్రం ముందుకు వెళ్తారు. ధార్మిక కార్యకలాపాలను చేస్తారు. అకారణంగా భీతిని, కోపాన్ని పొందుట మూలన నష్టపోయే అవకాశం కలదు జాగ్రత్త. శ్రమకు గురయ్యే అవకాశం ఉంది. శ్రమిస్తేనే ఫలితాలను పొందుతారు. నరసింహాస్వామి ఆరాధన, లక్ష్మీగణపతిని పూజించుట చేయండి, అన్నపూర్ణస్తోత్రం ప్రతిరోజూ చదవండి.   

ధనస్సు రాశి
ఈ వారం ప్రారంభంలో భోజనసౌఖ్యాన్ని పొందుతారు. ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. మీయొక్క ఆలోచనలచేత గౌరవాభివృద్దిని పొందుతారు. అనారోగ్యంను మాత్రం అశ్రద్ద చేయకండి. స్వల్పంగా ఆరోగ్యసమస్యలు కలుగుతాయి. మొదట్లో చేపట్టిన పనులలో ఇబ్బందులు కలిగినా వాటిని సవరించుకొని చివర్లో పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రయాణాలు చేయుటలో ఇబ్బందులను పొందుతారు. కుటుంబంలో నూతన నిర్ణయాలు చేయకండి అందరిని కలుపుకొని వెళ్ళుట మేలుచేస్తుంది. పాపసంబంద పనులలో పాల్గొంటారు. అకారణంగా కలహములు కలుగుటకు ఆస్కారం కలదు. జాగ్రత్తగా ఉండటం మంచిది. మీయొక్క వర్గం వారినుంచే వ్యతిరేకత వచ్చుటకు అవకాశం ఉంది. కావున ఏవైనా ఆలోచనలుచేస్తే అందరిని సంప్రదించుట చేయండి. సేవకుల మూలాన లేదా క్రిందిస్థాయి ఉద్యోగుల మూలాన లాభంను పొందుతారు. ఇష్టమైన పనులలో ఆసక్తిగా పాల్గొంటారు. సంతానప్రాప్తికి అవకాశం ఉంది లేదా సంతానంకు సంభందించిన విషయల్లో సంతృప్తిని పొందుతారు. ఈవారం ఆదివారం శివాభిషేకం చేయుట, ప్రతిరోజు సూర్యధ్యానం చేయుట, నల్లని కుక్కకు చపాతి తినిపించుట చేయండి.  

మకర రాశి
ఈవారం ఆరంభంలో సమస్యలు కలిగినా రాను రాను సర్దుకుంటాయి. ఒకవార్త వలన మానసికంగా ఆందోళనను పొందినా ఉత్సాహంను తెచ్చుకొని పనిని పూర్తిచేయుట మూలన గుర్తింపును పొనుతారు. ఏవైనా పనులను ఆరంభించాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువగా శ్రమించుట చేత ముందుకు వెళ్ళగలరు. తలపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోవుటకు అవకాశం కలదు. ప్రయాణాలు వాయిదాపడుతాయి లేదా ఇబ్బందులను కలుగజేస్తాయి. మీయొక్క విధానాలు ఇతరులకు సహాయపడుతాయి. వాటి మూలన వారు లభాపడుతారు. బంధుమిత్రులతో మాత్రం నిదానంగా వ్యవహరించుట చేయండి. శ్రమను మాత్రం పొందుతారు. ఆర్థికంగా ముందుకు వెళ్తారు. ప్రయత్నాల్లో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయంలో మాత్రం ఆశ్రద్ద చేయకండి. ఉద్యోగంలో అధికారుల యొక్క మన్ననలను పొందుటకు అవకాశం కలదు. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు సౌఖ్యంను పొందుతారు. భోజన సౌఖ్యంను కలిగి ఉంటారు. పెద్దల పరిచయాల మూలాన మేలుజరుగుతుంది. బంధువులలో పేరును సంపాదించుకుంటారు. పనిభారం పెరుగుతుంది అయినప్పటికిని పనులను పూర్తిచేస్తారు. మరింత శుభాలు కలుగుటకు దక్షణామూర్తిని ఆరాధన చేయుట, లలితాసహస్రనామం పారాయణ చేయుట, దైవసంభంద కార్యక్రమాల్లో పాల్గొనండి. 

కుంభ రాశి
ఈవారం ప్రారంభంలో బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. చేపట్టిన పనుల పట్ల ఉత్సాహంను కలిగి ఉంటారు కాకపోతే మీ ఆలోచనల మూలాన చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోవుటకు అవకాశం కలదు. ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి. వీలైతే ప్రయాణాలు వాయిదా వేసుకోండి. మానసికంగా ఇబ్బందులను పొందుతారు. నచ్చని వార్తను వింటారు. భోజనసౌఖ్యాన్ని కలిగి ఉంటారు. ఆర్థికంగా చివర్లో లాభాలను పొందుతారు. మీయొక్క ఆలోచనల్లో పరిణతి చాలా అవసరం. ఇష్టమైన పనులకు సమయాన్ని కేటాయిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేస్తారు. వాటిని మరొకసారి తిరిగి పరిక్షించుకోండి. మొదట్లో ఉద్యోగంలో అధికారుల మూలన ఇబ్బందులను పొందినా చివరకు సమస్యలను దాటగలుగుతారు. కొంత మానసిక ప్రశాంతత దిశగా అడుగులు వేస్తారు. అనుభవజ్ఞుల ఆలోచనలు పాటించే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. మీయొక్క వ్యతిరేకవర్గం బలపడే అవకాశం కలదు జాగ్రత్త వహించండి. నూతన ప్రయత్నాలు వాయిదా వేసుకొని గతంలోని పనులను పూర్తిచేయండి. మరిన్ని ఫలితాలకోసం రాఘవేంద్ర స్వామి ఆరధన, గణపతి అష్టోత్తరం చదవండి, భగవద్గీతను చదవండి.  

మీన రాశి
ఈవారం మొదట్లో మీయొక్క మాటతీరును మార్చుకొనే ప్రయత్నం చేయండి. వారం మధ్య నుండి సంతోషాన్ని పొందుతారు బంధుమిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. ప్రయత్నాల్లో విజయాన్ని పొందుతారు ఆర్థికంగా ముందుకు వెళ్తారు. భోజనసౌఖ్యాన్ని పొందుతారు. కోపాన్నివదిలి వేయుట అందరిని కలుపుకొని వెళ్ళుట చేయండి. అశుభవార్తను వినే అవకాశం కలదు. మానసికంగా దృడంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొత్తగా చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. అకారణంగా భయంను పొందుటకు అవకాశం కలదు. నూతన పరిచయాలు కలుగుతాయి, మంచి వారితో ఉన్న పరిచయాల మూలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో సర్దుకుపోవాలి నిదానంగా వ్యవహరించాలి. శత్రువులు పెరుగుతారు వారు మిమల్ని ఇబ్బందిపెట్టాలన్న ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. అకారణంగా తిరగడం మూలన శ్రమను పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి. మరింత ఫలితాలకోసం విష్ణువు ఆరాధన, శివాభిషేకం చేయుట, దుర్గాదేవికి కుంకుమ అర్చన చేయించుట మేలు.

మరిన్ని శీర్షికలు
annamayya pada seva