Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
sri sri - the mentor

ఈ సంచికలో >> శీర్షికలు >>

వంటిల్లు - మువ్వ వంకాయ - పి. పద్మావతి

Gutti Vankaya Curry

ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర ని మెత్తగా మిక్సీలో ముద్దగా చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం సరిపడినంత వేసుకుని రెడీ చేసుకోవాలి.

వంకాయలను 4 గాట్లుగా (గుత్తివంకాయ లాగా) కోసుకుని తయారు చేసుకున్న పేస్టు ను వంకాయలలో కూరుకోవాలి. బాణీలో నూనె వేసి, నూనె కాగాక స్టఫ్ చేసిన వంకాయల్ని వేసి కలిపి మూతపెట్టాలి. సన్న మంట మీద కనీసం 10 - 15 ని॥లు  మగ్గనివ్వాలి. ఇందులో నీరు పోయాల్సిన అవసరం వుండదు.

చక్కటి తాజా కూరల్లో "రాజా" కూర అయిన గుత్తి వంకాయ / మువ్వ వంకాయ కూర రెడీ!

మరిన్ని శీర్షికలు
Kaakoolu