Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
nobel prize for telugu writer?

ఈ సంచికలో >> సినిమా >>

డిస్ట్రిబ్యూటర్లకే గుండె దడ

risk is only for distributors

ఒకప్పుడు కథకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. కాంబినేషన్‌ సెట్‌ అయితే ఆ తర్వాత కథ దానంతట అదే వచ్చేస్తోంది. కథ వున్నా లేకపోయినా, కాంబినేషన్‌ని బట్టి సినిమా రేంజ్‌ రిలీజ్‌కి ముందే ఫిక్సయిపోతోంది. రిలీజయ్యాక సినిమా పరిస్థితి ఎలా వున్నా నిర్మాతకి టేబుల్‌ ప్రాఫిట్స్‌ వచ్చేస్తున్నాయి.

ఇక్కడ నిర్మాత, దర్శకుడు, హీరో నష్టపోయే పరిస్థితే కన్పించడంలేదు. ఎంత ఫ్లాప్‌ సినిమా తీసినా ఈ ముగ్గురూ సేఫ్‌ జోన్‌లోకే వెళ్ళిపోతున్నారు. కానీ, నష్టపోతున్నది మాత్రం డిస్ట్రిబ్యూటర్లే. ఈ మధ్య తొలివారం వసూళ్ళ గురించి ఆలోచిస్తోన్నవారు, రెండో వారం తర్వాత వచ్చే నష్టాల గురించి ఆలోచించడంలేదు. డిస్ట్రిబ్యూటర్లు దీనిపైనే ఆవేదన చెందుతున్నారు.

ఓ సినిమా హిట్టయితే హీరోకైనా, దర్శకుడికైనా భారీ రెమ్యునరేషన్‌ అందుతోంది. దర్శకుడు, హీరో పది కోట్ల రూపాయలు అందుకుంటోన్న దాఖలాలు చూస్తున్నాం. నిర్మాతకీ టేబుల్‌ ప్రాఫిట్స్‌ వచ్చేస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితో? పోటీకి తట్టుకోవాలంటే నిర్మాత చెప్పిన రేట్లకు కొనాలి, తేడా వస్తే డీలా పడిపోవాలి. కొన్ని సందర్భాల్లో నిర్మాతలు, ఓ సినిమా తేడా కొట్టినా ఇంకో సినిమా తక్కువకి ఇస్తామని చెప్పడంతో డిస్ట్రిబ్యూటర్లూ నష్టాలను భరించక తప్పడంలేదట.

చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు.. అంటే సబ్‌ డిస్ట్రిబ్యూటర్లూ పోటీలో వుండడంతో, పోటీ పడి భారీ మొత్తం చెల్లిస్తే, ఆ సినిమా దెబ్బ కొడితే పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ఘోరంగా దెబ్బతినేస్తున్నారు. అందుకే ఇప్పుడు సినిమా టెన్షన్‌ మొత్తాన్నీ డిస్ట్రిబ్యూటర్లే భరిస్తున్నారు. సినిమా విడుదలవుతుందంటే గుండె దడ పెరుగుతున్నది వారికే.

మరిన్ని సినిమా కబుర్లు
great seen in movie athadu