Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
great seen in movie athadu

ఈ సంచికలో >> సినిమా >>

జేడి సినిమాలో నటించాలనుందా?

want to act in JD cinema??

గొప్ప అవకాశం.. చేజార్చుకోకండని ప్రకటనలు ఇవ్వడం చూస్తాంగానీ, ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి తాను తెరకెక్కించబోయే సినిమాలో నటీనటుల కోసం నిర్వహిస్తోన్న ‘స్టార్‌ హంట్‌’ ఒకింత విచిత్రంగానే అనిపిస్తోంది. త్వరలో తాను తెరకెక్కించబోయే ఓ సినిమా కోసం జేడీ చక్రవర్తి నటీనటులను ఆహ్వానించాడు.

దీనికోసం బంపర్‌ ఆఫర్‌ అనీ, ఇంకోటనీ ఏమీ చెప్పడంలేదు జేడీ చక్రవర్తి. సింపుల్‌గా, ‘సినిమా అంటే పిచ్చి.. ఆ పిచ్చిలో మిమ్మల్నీ భాగస్వాముల్ని చేస్తున్నాం.. మీకు అవకాశం ఇవ్వడం కాదు, మీ టాలెంట్‌ని వాడుకునే అవకాశం మేం తీసుకుంటున్నాం.. మిమ్మల్ని రిక్వెస్ట్‌ చేస్తున్నాం.. మీలోని టాలెంట్‌ మాకు ఉపయోగపడేలా చేయండి..’ అని జేడీ ప్రకటన విడుదల చేశాడు.

గొప్ప విషయం కదా. కొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా అన్పించినా, జేడీ తీరు తెలిసినవారికి ఇది అంత ఎక్స్‌ట్రీమ్‌ అన్పించదు. జేడీ వాడుకోవడానికి సిద్ధం, మరి మీలో టాలెంట్‌ని అతనికి ఉపయోగపడేలా చేయడానికి సిద్ధంగా వున్నారా? అయితే జేడీ ప్రకటనకు రెస్పాన్స్‌ ఇవ్వండి.

మరిన్ని సినిమా కబుర్లు
anr daughter in movies